BigTV English

Jack Trailer: తప్పు చేసాం.. లోడింగ్ అని పోస్టర్ వేసినప్పుడే అర్థం చేసుకోవాల్సింది బ్రో

Jack Trailer: తప్పు చేసాం.. లోడింగ్ అని పోస్టర్ వేసినప్పుడే అర్థం చేసుకోవాల్సింది బ్రో

Jack Trailer: ఈరోజుల్లో సినిమాలు చెప్పిన టైమ్‌కు విడుదల అవ్వడం లేదు. అంతే కాకుండా వాటిని సంబంధించిన అప్డేట్స్ కూడా అనౌన్స్ చేసిన టైమ్‌కు రావడం లేదు. దీంతో ఈ పోస్ట్‌పోన్ అవ్వడంపై మూవీ లవర్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయినా మేకర్స్ వైఖరి మారడం లేదు. ఫస్ట్ లుక్ దగ్గర నుండి టీజర్స్, ట్రైలర్స్.. ఇలా ఏదీ చెప్పిన టైమ్‌కు రావడం లేదు. పాన్ ఇండియా సినిమాల నుండి ఈ వైఖరి కామన్ అయిపోయింది. కానీ యంగ్ హీరోల సినిమాల విషయంలో కూడా మేకర్స్ ఇదే చేస్తున్నారు. దీంతో ఫ్యాన్స్ మరింత మండిపడుతున్నారు. తాజాగా సిద్ధు జొన్నలగడ్డ హీరోగా తెరకెక్కిన ‘జాక్’ మూవీ విషయంలో కూడా అదే జరిగింది.


ట్రైలర్ రాలేదు

సిద్ధు జొన్నలగడ్డ హీరోగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమానే ‘జాక్’. ఈ సినిమాకు సంబంధించిన క్రేజీ ఫస్ట్ లుక్, పోస్టర్స్, టీజర్ ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. తాజాగా ఒక పాట కూడా విడుదలయ్యింది. ఇక ట్రైలరే లేటు అన్నట్టుగా ‘జాక్’ ట్రైలర్ గురించి అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఏప్రిల్ 2న ఈ మూవీ ట్రైలర్ విడుదల కానుందని రెండు రోజుల క్రితమే ప్రకటించారు. కానీ రిలీజ్ టైమ్‌ను మాత్రం రివీల్ చేయలేదు. ఏప్రిల్ 2 ఉదయం కూడా ఈ మూవీ ట్రైలర్ వస్తుందనే అన్నారు. సాయంత్రం ట్రైలర్ కోసం సిద్ధంగా ఉండండి అంటూ ఫ్యాన్స్‌ను ఎగ్జైట్ చేశారు. ఇంతలోనే ‘జాక్’ ట్రైలర్ కోసం ఎదురుచూస్తున్న ఫ్యాన్స్‌కు నిరాశ ఎదురయ్యింది.


పోస్ట్‌పోన్ అయ్యింది

‘పలు కారణాల వల్ల జాక్ ట్రైలర్ విడుదల రేపటికి పోస్ట్‌పోన్ అయ్యింది. కానీ టాప్ ఎంటర్‌టైన్మెంట్‌ను అందించడంలో ఏ మాత్రం సమస్యలు ఉండవు’ అంటూ ‘జాక్’ మేకర్స్ ప్రకటించారు. దీంతో ఈ మూవీ కూడా పాన్ ఇండియా సినిమాలలాగానే అప్డేట్స్‌ను పోస్ట్‌పోన్ చేస్తుందని ప్రేక్షకులు కామెంట్స్ చేస్తున్నారు. క్రియేటివ్‌గా ఉండడం కోసం ‘లోడింగ్’ అంటూ ట్రైలర్ అనౌన్స్‌మెంట్‌ను డిఫరెంట్‌గా ప్లాన్ చేశారు మేకర్స్. కానీ ఇప్పుడు ట్రైలర్ పోస్ట్‌పోన్ అవ్వడం చూస్తుంటే ఇంకా లోడ్ అవుతూనే ఉందా అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి కనీసం రేపు అయినా ఈ మూవీ ట్రైలర్ వస్తుందా అని మాట్లాడుకుంటున్నారు.

Also Read: అక్కినేని ఫ్యాన్స్ గెట్ రెడీ.. బిగ్ అనౌన్స్‌మెంట్ లోడింగ్, ఒకటి కాదు రెండు?

ఫ్యాన్స్ వెయిటింగ్

ప్రస్తుతం టాలీవుడ్‌లో ఉన్న యంగ్ హీరోల్లో సిద్ధు జొన్నలగడ్డ (Siddhu Jonnalagadda)కు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. అందుకే తన తరువాతి సినిమా కోసం యూత్ అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అదే సమయంలో బొమ్మరిల్లు భాస్కర్ లాంటి సీనియర్ దర్శకుడితో ‘జాక్’ (Jack) లాంటి క్రేజీ మూవీని అనౌన్స్ చేశాడు సిద్ధు. ఈ మూవీకి సంబంధించిన పోస్టర్లలో సిద్ధు మ్యానరిజం కనిపిస్తుందని ప్రేక్షకులు ఫీలయ్యారు. ఇక తాజాగా విడుదలయిన టీజర్ కాస్త ఔట్‌డేటెట్‌గా అనిపించినా కథ బాగుండి, మౌత్ టాక్ బాగుంటే ఈ సినిమా పక్కా హిట్టే అని ఫ్యాన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ మూవీ ట్రైలర్ విడుదలయితే దీని రిజల్ట్‌పై మరింత క్లారిటీ వస్తుంది అనుకుంటున్నారు.

Related News

Rakesh Poojary: ‘కాంతారా-1’లో కడుపుబ్బా నవ్వించిన.. ఈ నటుడు ఎలా చనిపోయాడో తెలుసా? కన్నీళ్లు ఆగవు!

Janu lyri- Deelip Devagan: జాను లిరితో బ్రేకప్.. దిలీప్ రియాక్షన్ ఇదే.. సెలబ్రిటీలం కాబట్టే అంటూ!

Siva jyothi: ఘనంగా శివ జ్యోతి సీమంతపు వేడుకలు.. ఫోటోలు వైరల్!

Manchu Manoj: భార్యపై మనసులోని భావాలు.. ఇన్‌స్టాగ్రామ్‌లో ఎమోషనల్ పోస్ట్ 

Tollywood: భార్య వేధింపులు తాళలేక ప్రముఖ నటుడు ఆత్మహత్య.. సెల్ఫీ వీడియో వైరల్!

Kissik Talks Promo : మహేష్ విట్టా లవ్ స్టోరిలో ఇన్ని ట్విస్టులా..ఆ ఒక్క కోరిక తీరలేదు..

Ritu Chaudhary : చెప్పు రీతు నువ్వు నన్ను మోసం చేయలేదా? రీతుకి కళ్యాణ్ తో బంధం తెగిపోయిందా?

Bigg boss emmanuel : నా బాధ మీకు తెలియదు, రోజు దుప్పటి కప్పుకుని ఏడుస్తాను

Big Stories

×