BigTV English

Pavan Kalyan: పోర్ట్ బ్లెయిర్ పేరు మార్పుపై పవన్ కల్యాణ్ రియాక్షన్..

Pavan Kalyan: పోర్ట్ బ్లెయిర్ పేరు మార్పుపై పవన్ కల్యాణ్ రియాక్షన్..

Pavan Kalyan Reaction on Rename of Part Blair: బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పలు నిర్ణయాలు తీసుకుంటూ వస్తున్నది. వాటిని అమలు చేసే దిశగా ముందుకు వెళ్తున్నది. అయితే, తాజాగా కూడా కేంద్ర ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకుంది. బ్రిటీష్ పాలనప్పటి నుంచి కొనసాగుతున్న కేంద్రపాలిత ప్రాంతమైన అండమాన్న నికోబార్ రాజధాని పోర్ల్ బ్లెయిర్ పేరును మార్చివేసింది. పోర్ట్ బ్లెయిర్ పేరును శ్రీ విజయపురంగా మారుస్తూ శుక్రవారం కేంద్ర ప్రభుత్వం ఇందుకు సంబంధించిన ప్రకటన చేసింది. దీంతో దేశవ్యాప్తంగా నేతలు, ప్రముఖులు తమ అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు.


Also Read: యాంకర్ శ్యామలకు మాజీ సీఎం జగన్ బంపర్ ఆఫర్.. రాష్ట్రస్థాయిలో పదవి

తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా ఈ అంశంపై స్పందించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్నట్లు ఈ నిర్ణయాన్ని తాను హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నట్లు చెప్పారు. బ్రిటీష్ వలస పాలనకు ప్రతిబింబంగా ఉన్న పేరును మార్చాలనే ప్రభుత్వ నిర్ణయం భారత్ సాధించిన విజయాలను చేస్తుందన్నారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు.


Also Read: మళ్లీ ట్వీట్ చేసిన విజయసాయిరెడ్డి.. అందుకు ప్రధాన కారణం ఎవరో చెబుతూ..

ఎక్స్ లో పవన్ కల్యాణ్ ఇందుకు సంబంధించి పోస్ట్ పెట్టారు. అందులో ఈ విధంగా పేర్కొన్నారు. కేంద్ర పాలిత ప్రాంతమైన అండమాన్ నికోబార్ రాజధాని పోర్ట్ బ్లెయిర్ పేరు మార్పు నిర్ణయాన్ని నేను హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నాను. పోర్ట్ బ్లెయిర్ పేరును శ్రీవిజయపురంగా మార్చడం.. నిజంగా ఇది ప్రశంసనీయమైన చర్య. గత వలస వారసత్వ బ్రిటీష్ పాలన ప్రభావం నుంచి భవిష్యత్ తరాలను సంరక్షించేందుకు ఈ నిర్ణయం ఎంతగానో దోహదపడనున్నది. ప్రధాని మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం తీసుకోవడం ఓ మంచి పరిణామం. శతాబ్ధాల పాటు దేశాన్ని తీవ్రంగా అణివేసిన వలసపాలనకు ప్రతిబింబంగా ఉన్న పేరును మార్చాలనే మీ నిర్ణయం భారత్ సాధించిన విజయాలను మరింత గౌరవింపజేసేలా చేస్తుంది. వందల ఏళ్లపాటు ప్రాశ్చాత్య దేశాల బానిసత్వ మూలాలకు నిదర్శనంగా, అటు వలసవాద పాలనకు గుర్తుగా వారు పెట్టిన పేరును తీసేస్తూ.. భారతదేశం సాధించిన విజయాలకు గుర్తుగా శ్రీవిజయపురం పేరు పెట్టడమనేది నిజంగా ఆహ్వానించదగ్గ పరిణామం. భావితరాలపై వలసవాద విధానాల ప్రభావం పడకుండా మీ నిర్ణయం ఎంతగానో ఉపయోగపడుతుందని నేను భావిస్తున్నాను’ అంటూ పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.

Related News

CM Chandrababu Naidu: తెలంగాణ నాయకులు ఈ విషయాన్ని గ్రహించాలి.. సీఎం చంద్రబాబు విజ్ఞప్తి

CM Chandrababu: ఎట్టకేలకు ఫలించిన చంద్రబాబు కృషి.. కుప్పంలో కృష్ణమ్మకు సీఎం జలహారతి

Nellore: నాతో తిరిగి.. నన్నే లేపేస్తార్రా! హత్యకు కుట్రపై కోటంరెడ్డి ప్రెస్ మీట్..

AP Politics: నాగబాబుపై జనసైనికుల తిరుగుబాటు.. పవన్ ప్లాన్ ఏంటి?

APSRTC bus fight: ఏపీఎస్‌ఆర్టీసీ బస్సులో ఘర్షణ.. సీటు కోసం బూతు దాకా వెళ్లిన వాగ్వాదం.. వీడియో వైరల్!

Kotam Reddy Sridhar Reddy: నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డిపై హత్యకు కుట్ర

Big Stories

×