Google Personal Intelligence: మనం ఫోన్లలో వాడే గూగుల్ సర్వీసులు రోజురోజుకీ చాలా స్మార్ట్ అయిపోతున్నాయి. మనం ఏం కోరుకుంటున్నామో ముందే పసిగట్టి రిప్లై ఇస్తున్నాయి. అయితే ఈ స్మార్ట్‌నెస్ వెనుక మన ప్రైవసీకి ముప్పు వాటిల్లే అవకాశం ఉంది. రీసెంట్‌గా గూగుల్ తమ ప్రైవసీ పాలసీలో కొన్ని కీలక మార్పులు చేసింది. దీని ప్రకారం.. జెమిని లేదా సెర్చ్‌లో పర్సనలైజ్డ్ ఏఐ ఫీచర్లు వాడేవాళ్లు గమనించాల్సిన విషయం ఏంటంటే.. మీ జీమెయిల్, గూగుల్ ఫొటోలు, డ్రైవ్‌లో ఉండే డేటాను యాడ్స్ చూపించడానికి కూడా వాడే ఛాన్స్ ఉంది. ఈ చిన్న ట్రిక్ తెలిస్తే ఈజీగా దీన్ని ఆపవచ్చు.
గూగుల్ రీసెంట్‌గా తీసుకొచ్చిన అప్‌డేట్ ప్రకారం.. మీ పర్సనల్ డేటా మరింత స్మార్ట్ సర్వీసుల కోసం వాడుకోవచ్చని చెబుతోంది. దీనివల్ల ఏఐ ఆన్సర్లు చాలా పర్ఫెక్ట్‌గా వస్తాయి. కానీ, ఏ యాప్‌లతో అయితే మీ ఫొటోలు, మెయిల్స్ షేర్ చేస్తారో.. అదే డేటాను బేస్ చేసుకుని టార్గెటెడ్ యాడ్స్ కూడా చూపించే అవకాశం ఉంది. కాకపోతే.. మీరే స్వయంగా ఆ పర్మిషన్ ఇస్తేనే ఇది జరుగుతుంది. ఇది అందరికీ కాకపోయినా.. కొన్ని దేశాల్లో బీటా వర్షన్‌గా అందుబాటులోకి వచ్చింది.
Also Read: iPhone Duo స్క్రీన్ క్రాక్స్ మిస్టరీ వీడింది.. రిపేర్ చేయడం కూడా చాలా కష్టమని తేల్చేసిన నిపుణులు!
ఈ ఇబ్బంది అంతా Personal Intelligence అనే ఫీచర్ వల్లే వస్తోంది. ఈ ఏడాది జనవరిలో గూగుల్ దీన్ని లాంచ్ చేసింది. దీని ద్వారా జీమెయిల్, యూట్యూబ్, ఫొటోలను ఏఐకి కనెక్ట్ చేసుకోవచ్చు. దీనివల్ల ఏఐ మన అవసరాలను ఇష్టాలను ఇమేజిన్ చేసుకుని మంచి రిజల్ట్స్ ఇస్తుంది. కానీ, ఇక్కడే మన పర్సనల్ లైఫ్ ట్రేడ్రాఫ్ లోకి వెళ్తుంది. ప్రయోజనాల కోసం డేటాను షేర్ చేస్తే.. ప్రైవసీ కొద్దిగా రిస్క్‌లో పడుతుంది.
ఇది ఆపడం చాలా సింపుల్. ముందుగా మీ గూగుల్ అకౌంట్ సెట్టింగ్స్‌లోకి వెళ్లండి. అక్కడ డేటా అండ్ ప్రైవసీ ట్యాబ్ ఓపెన్ చేయండి. అందులో పర్సనలైజేషన్ అండ్ యాక్టివిటీ కింద సెర్చ్ సర్వీసెస్ పర్సనలైజేషన్ సెలెక్ట్ చేసుకోండి. అక్కడ మేనేజ్ పర్సనలైజ్డ్ రికమండేషన్స్‌లోకి వెళ్లి జీమెయిల్, ఫొటోలు వంటి కనెక్టెడ్ యాప్స్‌ను డిస్‌కనెక్ట్ చేయవచ్చు. ఒకవేళ ట్రేసింగ్ పూర్తిగా ఆపేయాలంటే పర్సనలైజ్డ్ రికమండేషన్స్ ఆప్షన్ టర్న్ ఆఫ్ చేస్తే సరిపోతుంది.
ఏఐ టెక్నాలజీ ఫాస్ట్‌గా మారుతోంది. గూగుల్ మాత్రమే కాదు.. ఓపెన్ ఏఐ వంటి కంపెనీలు కూడా యాడ్స్ బాట పట్టాయి. ఫ్రీగా సర్వీసులు ఇస్తున్నాం కదా అని మన పర్సనల్ డేటాను గుడ్డిగా షేర్ చేయడం మంచిది కాదు. మనకు ఏది అవసరమో చూసుకుని సెట్టింగ్స్ అప్పుడప్పుడు చెక్ చేయడం మంచి అలవాటు. ప్రైవసీ అనేది మన చేతుల్లోనే ఉంటుంది కాబట్టి.. అప్రమత్తంగా ఉండటం చాలా అవసరం.
Also Read: తక్కువ నెట్‌తో హై-క్లారిటీ వీడియోస్.. యూట్యూబ్ తీసుకొస్తున్న కొత్త టెక్నాలజీ ఇదే!