E-Paper
Advertisement

చివరకు ఆ కోరిక తీరిందిగా.. అద్భుతమైన ఓఎల్ఈడీ డిస్‌ప్లేతో Apple iPad Mini వచ్చేసింది!

చివరకు ఆ కోరిక తీరిందిగా.. అద్భుతమైన ఓఎల్ఈడీ డిస్‌ప్లేతో Apple iPad Mini వచ్చేసింది!
Advertisement

Apple iPad Mini: యాపిల్ ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐప్యాడ్ మినీ ఎట్టకేలకు మార్కెట్లోకి వచ్చేసింది. టెక్ ప్రపంచంలో ఎప్పుడూ ఏదో ఒక సంచలనం సృష్టించే యాపిల్ సంస్థ.. ఈసారి మినీ ట్యాబ్లెట్ ప్రియులకు అదిరిపోయే ట్రీట్ ఇచ్చింది. ఇప్పటివరకు వచ్చిన మోడల్స్‌కు పూర్తిగా భిన్నంగా, సరికొత్త హంగులతో ఈ లేటెస్ట్ ఐప్యాడ్ మినీని తీసుకొచ్చింది. మరి ఈ కొత్త మినీ ట్యాబ్లెట్‌లో ఏయే ఫీచర్లు ఉన్నాయి, దీని ధర ఎంతనేది ఇప్పుడు చూద్దాం.

తొలిసారిగా ఓఎల్ఈడీ డిస్ప్లే..

Apple Mini హిస్టరీలోనే తొలిసారిగా ఇందులో ఓఎల్ఈడీ స్క్రీన్‌ను వాడారు. 8.5 అంగుళాల సూపర్ రెటినా ఎక్స్డీఆర్ ఓఎల్ఈడీ డిస్ప్లేతో వస్తున్న ఈ ట్యాబ్లెట్ విజువల్స్ నెక్స్ట్ లెవెల్‌లో ఉంటాయి. దీనికి తోడు బెజెల్స్ మరింత సన్నగా మార్చారు. గ్లేర్ తగ్గించుకోవడానికి నానో-టెక్చర్ గ్లాస్ ఆప్షన్ కూడా ఇచ్చారు. అయితే, ఇందులో 60Hz రిఫ్రెష్ రేట్ మాత్రమే ఉండటం కాస్త నిరాశపరిచే విషయమే అయినా.. డిస్ప్లే బ్రైట్‌నెస్ మాత్రం ఏకంగా 1200 నిట్స్ వరకు వస్తుంది.

Advertisement

Also Read: ఈ గూగుల్ సెట్టింగ్ ఆఫ్‌ చేశారా? లేదంటే మీ పర్సనల్ డేటా టార్గెటెడ్ యాడ్స్ పరం అయినట్టే!

ప్రాసెసర్ పవర్‌లో చిన్న మెలిక..

ఈ కొత్త iPad Miniలో యాపిల్ లేటెస్ట్ ఏ20 ప్రో చిప్‌ను వాడింది. కాకపోతే ఇందులో చిన్న ట్విస్ట్ ఉంది. 128 జీబీ, 256 జీబీ వేరియంట్లలో 5 సీపీయూ కోర్లు మాత్రమే వస్తాయి. అదే 512 జీబీ టాప్ మోడల్‌లో మాత్రం ఫుల్ పవర్ ఉండే 6 కోర్ల ప్రాసెసర్ ఉంటుంది. అలాగే స్టోరేజ్‌ను బట్టి ఎన్పీయూ పవర్ కూడా మారుతుంది. మిగతా ఫీచర్లన్నీ అన్ని వేరియంట్లలోనూ ఒకేలా ఉంటాయి. వైఫై 7, 5జీ కనెక్టివిటీతో పాటు ఈసారి ఐపీ67 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్ ఫీచర్‌ను కూడా యాడ్ చేశారు.

కొత్త సౌండ్ అనుభూతి..

Advertisement

ఈసారి స్పీకర్ల విషయంలో యాపిల్ గట్టిగానే వర్క్ చేసింది. ట్యాబ్లెట్ డిస్‌ప్లే కిందే డ్యుయల్ స్పీకర్లను అమర్చారు. దీనివల్ల సౌండ్ చాలా క్లియర్‌గా రావడంతో పాటు బాస్ కూడా అదిరిపోతుంది. గ్లాస్, అల్యూమినియం బాడీ మధ్యలో ప్రత్యేకంగా కస్టమ్ ట్వీటర్లను దాచారు. దీనివల్ల పాటలు వింటున్నా, సినిమా చూస్తున్నా ఆడియో ఎక్స్‌పీరియన్స్ నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుంది. అలాగే 12 మెగాపిక్సెల్ సెంటర్ స్టేజ్ కెమెరాను కూడా ఇందులో అందించారు.

ధరలు ఎలా ఉన్నాయంటే?

ఈ కొత్త iPad Mini కేవలం 255 గ్రాముల బరువుతో 5.4 మిల్లీమీటర్ల మందంతో చాలా సన్నగా, తేలికగా ఉంది. మిడ్‌నైట్, స్టార్‌లైట్ కలర్స్‌లో ఇది లభిస్తుంది. దీని ప్రారంభ ధర రూ.60,000 వరకు ఉండొచ్చని అంచనా. ఇక హైఎండ్ వేరియంట్ల ధరలు దాదాపు రూ.85,000 వరకు ఉండవచ్చు. మొత్తానికి యాపిల్ మినీ లవర్స్‌కు ఈసారి పండగలాంటి ట్రీట్ అనే చెప్పాలి.

Also Read: iPhone Duo స్క్రీన్ క్రాక్స్ మిస్టరీ వీడింది.. రిపేర్ చేయడం కూడా చాలా కష్టమని తేల్చేసిన నిపుణులు!

Tags

Related News

ఈ గూగుల్ సెట్టింగ్ ఆఫ్‌ చేశారా? లేదంటే మీ పర్సనల్ డేటా టార్గెటెడ్ యాడ్స్ పరం అయినట్టే!

iPhone Duo స్క్రీన్ క్రాక్స్ మిస్టరీ వీడింది.. రిపేర్ చేయడం కూడా చాలా కష్టమని తేల్చేసిన నిపుణులు!

క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తున్నారా? ఈ 5 తప్పులు చేస్తే.. ఆర్థికంగా సర్వనాశనమే!

సైబర్ నేరగాళ్లు వాట్సాప్‌నే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? అసలు కారణాలు ఇవే!

బిఏ కుర్రాడి అద్భుతం.. యూట్యూబ్ చూసి ఎగిరే కారు ఆవిష్కరణ.. యావత్ దేశమే షాక్!

సినిమా థియేటర్‌ను ఇంటికే తెచ్చుకోండి..రూ.5వేలలోపే బెస్ట్ ప్రొజెక్టర్లు

ఆన్‌లైన్ క్లాసులు,ఆఫీస్ వర్క్ కోసం ఏసర్ క్రోమ్‌బుక్ లాంచ్- ధర ఎంతంటే?

Big Stories

Advertisement
×