BigTV English

Pawan Kalyan: మూడోభార్యకూ విడాకులు!.. పవన్‌పై కథనాలు.. జనసేన క్లారిటీ..

Pawan Kalyan: మూడోభార్యకూ విడాకులు!.. పవన్‌పై కథనాలు.. జనసేన క్లారిటీ..
pawan kalyan

Pawan Kalyan: పవన్ కల్యాణ్ మూడోభార్యకు కూడా విడాకులు ఇవ్వబోతున్నారట. వాళ్లిద్దరి మధ్య విభేదాలు వచ్చాయట. ప్రస్తుతం ఎవరికి వారే వేరువేరుగా ఉంటున్నారట. ఇలా.. సోషల్ మీడియాలో గాసిప్ వార్తలు వండివార్చుతున్నారు కొందరు. అలా ఒకరిని చూసి ఇంకొకరు.. ఆ స్టోరీకి మరింత మసాలా దట్టిస్తూ పోస్టులు పెడుతున్నారు. అవి చూసి.. జనం నిజమే అనుకునే ప్రమాదం ఉండటంతో.. జనసేన అలర్ట్ అయింది. అలాంటిదేమీ లేదంటూ.. ఇటీవల భార్యతో కలిసి పవన్ కల్యాణ్ ఉన్న ఫోటోను.. అఫీషియల్ ట్విటర్ అకౌంట్లో పోస్ట్ చేసింది.


మొదటి విడత వారాహి యాత్ర విజయవంతంగా పూర్తయ్యాక.. హైదరాబాద్‌లోని తన ఇంట్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు జనసేనాని. భార్య ‘అనా’తో కలిసి ఆ పూజలు చేశారు. ఆ సమయంలో తీసిన ఫోటో ఇదేనంటూ లేటెస్ట్ పిక్ పోస్ట్ చేసింది జనసేన పార్టీ. కొద్దిరోజుల్లో వారాహి విజయ యాత్ర రెండో దశ మొదలవుతుందని.. సన్నాహక సమావేశాల కోసం పవన్ కల్యాణ్ త్వరలో మంగళగిరి వస్తారంటూ అప్‌డేట్ ఇచ్చింది.

ఇక, విడాకుల ప్రచారం సడెన్‌గా ఇప్పుడే ఎందుకు జరుగుతోంది అనే చర్చ నడుస్తోంది. వారాహి యాత్ర గ్రాండ్ సక్సెస్ అయింది. వైసీపీ సర్కారు తీరును జనసేనాని ఊరూరా ఎండగట్టారు. పవన్ మెసేజ్ ప్రజల్లోకి బలంగా వెళ్లింది. ఆ అక్కసుతోనే వైసీపీ సోషల్ మీడియా వింగ్.. ఇలా బ్లేమ్ గేమ్ ఆడుతోందని అనుమానిస్తున్నారు. పవన్.. మూడోభార్యకు కూడా విడాకులు ఇస్తున్నారంటూ ప్రచారం చేస్తూ.. జనసేనాని ఇమేజ్‌ను డ్యామేజ్ చేసేందుకు ట్రై చేస్తున్నారని అంటున్నారు. అందుకే, జనసేన వెంటనే అలర్ట్ అయి.. డ్యామేజ్ కంట్రోల్ చేపట్టింది. పార్టీ ట్విటర్ ఖాతాలో ఆ జంట ఇటీవల దిగిన ఫోటోను పోస్ట్ చేసి.. ఆ ఫేక్ ప్రచారానికి చెక్ పెట్టే ప్రయత్నం చేసింది. తాాజా ప్రచారంపై త్వరలో ప్రారంభం కానున్న వారాహి విజయ యాత్రలో పవన్ ఎంత ఘాటుగా స్పందిస్తారో చూడాలి.


Related News

Chandrababu: మళ్లీ జన్మంటూ ఉంటే నాకు అక్కడ పుట్టాలని ఉంది -చంద్రబాబు

Jagan-Sharmila: అన్న పేరెత్తకుండా షర్మిల, చెల్లి పేరు లేకుండా జగన్ రక్షా బంధన్ ట్వీట్లు

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Tirumala devotees: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి పట్టే సమయం ఎంతంటే?

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

Big Stories

×