BigTV English

Car Engine : కారు ఇంజెన్ తయారీలో కొత్త ప్రయోగం.. ప్రపంచంలోనే మొదటిసారిగా..

Car Engine : కారు ఇంజెన్ తయారీలో కొత్త ప్రయోగం.. ప్రపంచంలోనే మొదటిసారిగా..
Car Engine


Car Engine : ఆటోమొబైల్ రంగంలో ప్రస్తుతం ఉన్న పోటీని తట్టుకోవాలంటే.. అసలు ఇలాంటి టెక్నాలజీ సాధ్యమా అని ఆశ్చర్యపరిచే టెక్నాలజీలను ప్రవేశపెట్టాలి. అలా అయితేనే కస్టమర్లు తమ వాహనాలను కొనాలని పరిగణిస్తారు అని ఫిక్స్ అయిపోయాయి సంస్థలు. అందుకే వాహనాల తయారీల విషయంలో కొత్త కొత్త ఆలోచనలతో ముందుకొస్తున్నాయి. అన్నింటిలో ముందుండాలి అనుకునే చైనా ఆటోమొబైల్ విషయంలో ప్రపంచంలో ఇప్పటివరకు ఎవరూ చేయని ప్రయోగం చేసింది.

చైనాకు చెందిన గువాంగ్జో ఆటోమొబైల్ సంస్థ అమోనియోతో రన్ అయ్యే మొదటి కార్ ఇంజెన్‌ను తయారు చేసినట్టు ప్రకటించింది. ఇప్పటివరకు పూర్తిగా అమోనియా కార్ ఇంజెన్‌ను ప్రపంచంలో ఎవరూ తయారు చేయలేదు. దీని తయారీ వల్ల ఆటోమొబైల్ వల్ల పెరుగుతున్న కార్బన్ ఎమిషన్స్‌ను కొంతవరకు అయినా అదుపు చేయవచ్చని చైనా అనుకుంటోంది. ఇప్పటికే హైడ్రోజన్ ఫ్లూయల్ సెల్స్, బ్యాటరీ పవర్ వాహనాలు అనేవి అందుబాటులో ఉన్నా.. అమోనియాతో తయారు చేసిన ఇంజెన్ వాటికంటే మెరుగ్గా పనిచేస్తుందని చెప్తోంది.


మామూలుగా అమోనియాతో కారు ఇంజెన్స్ తయారు చేయాలని ఇంతకు ముందు చాలామంది ప్రయత్నించారు. కానీ వాటిలో ఉండే ఇబ్బందుల వల్ల ఎవరూ పూర్తిస్థాయిలో తయారీని పూర్తి చేయలేకపోయారు. కానీ ఆ ఇబ్బందులు అన్నీ దాటుకుంటూ అమోనియా కారు ఇంజెన్‌ను తాము తయారు చేసి చూపించామని గువాంగ్జో యాజమాన్యం గర్వంగా చెప్తోంది. అమోనియా కారు ఇంజెన్స్ కమర్షియల్ పరంగా కూడా భవిష్యత్తు ఆటోమొబైల్ ఇండస్ట్రీకి చాలా ఉపయోగపడుతుందని అంటోంది.

ఇప్పటికే కార్బన్ ఎమిషన్స్‌ను తగ్గించే విధంగా ఎన్నో కొత్త ప్రయోగాలను చేపడుతున్నాయి ఆటోమొబైల్ సంస్థలు. తాజాగా ఫ్లయింగ్ కారును కూడా తయారు చేసి చూపించింది చైనా. ఇప్పుడు ఈ అమోనియా కారు ఇంజెన్స్‌ను కూడా తయారు చేయడంతో ఆటోమొబైల్ రంగం విషయంలో కూడా చైనా తన దూకుడును చూపిస్తుందంటూ నిపుణులు అంటున్నారు. ఇప్పటికీ అమోనియా కారు ఇంజెన్స్ విషయంలో పలు ఇబ్బందులు ఉన్నా కూడా వాటన్నింటిని అధిగమించి మార్కెట్లోకి పూర్తిస్థాయిలో ప్రవేశపెడతామని గువాంగ్జో హామీ ఇస్తోంది.

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×