BigTV English

Sticker War in Pithapuram: ఎవరి తాలూకా? స్టిక్కర్‌ వార్ @ పిఠాపురం

Sticker War in Pithapuram: ఎవరి తాలూకా? స్టిక్కర్‌ వార్ @ పిఠాపురం

Pawan Kalyan Fans New Trend With Pithapuram MLA Stickers on Bikes and Cars: పిఠాపురంలో ఏం నడుస్తోంది.. ? ఇది క్వశ్చన్.. దీనికి ఆన్సర్ ఏమై ఉంటుంది? మహా అయితే గెలుపు పవన్‌దా లేక వంగా గీతదా? అనే చర్చ నడుస్తుంది. బట్ అలా జరగడం లేదు అక్కడ పిఠాపురం గడ్డపై ఓ కొత్త ట్రెండ్ మొదలైంది. అదే నంబర్‌ ప్లేట్స్ ఇష్యూ.. యస్.. పిఠాపురంలో ఇప్పుడు ఇదే టాపిక్‌పై రచ్చ కంటిన్యూ అవుతోంది. ఎమ్మెల్యే గారి తాలుకా అని ఓ నంబర్ ప్లేట్.. కాబోయే డిప్యూటీ సీఎం గారి తాలుకా.. ఇది మరో నంబర్ ప్లేట్‌.. కౌంటింగ్ దగ్గరపడుతున్న కొద్ది పిఠాపురంలో కనిపిస్తున్న చిత్రాలు ఇవి..
ఒక్కొక్కరు తమ అభిమానాన్ని ఒక్కో విధంగా చూపిస్తున్నారు. నిజానికి పవన్‌కు యూత్‌లో కాస్త ఫాలోయింగ్ ఎక్కువే.. వారు తమ అభిమానాన్ని వారి వారి ఇంట్రెస్ట్‌లకు తగ్గట్టుగా చూపిస్తున్నారు. ఫోన్‌ వాల్‌పేపర్ మాత్రమే కాదు.. ఆ ఫోన్‌కు వాడే పౌచ్‌పై కూడా జనసేన స్టిక్కర్స్‌ కనిపిస్తున్నాయి.


గెలిచేది జనసేన అంటూ ఏకంగా స్టిక్కర్‌ వార్‌ మొదలుపెట్టారు జనసేన అభిమానులు.. మరి జనసేన మొదలుపెట్టాక వైసీపీ వారు ఊరుకుంటారా తాము కూడా తగ్గేదేలే అంటూ కాబోయే డిప్యూటీ సీఎం తాలుకా అంటూ మొదలుపెట్టారు.. కార్ల వెనక.. బండి నంబర్ ప్లేట్స్‌పై స్టిక్కర్స్ అతికిస్తున్నారు. ఇప్పుడు ఇరు వర్గాల స్టిక్కర్ల రచ్చకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు.. సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ఈ పిచ్చి.. యస్ పిచ్చే.. మరి పిచ్చికాకపోతే ఏంటి మరి పిఠాపురం నుంచి మొదలైన ఈ స్టిక్కర్ వార్.. రాష్ట్రంలోని పలు నియోజకవర్గాలకు పాకింది. ఏకంగా వైసీపీ, టీడీపీ మధ్య నంబర్ ప్లేట్ల యుద్ధానికి దారితీసింది. పిఠాపురం ఎమ్మెల్యే నాలుగవ పెళ్లాం తాలూకా.. బాబాయిని లేపినోడి తాలూకా అంటూ ఒకటి తర్వాత నంబర్ ప్లేట్ వెలుగులోకి వచ్చాయి. ఇప్పుడు చెప్పండి నేను దీనిని పిచ్చి అనడంలో ఏమన్న తప్పుందా?

అభిమానం పేరుతో చేస్తున్న పైత్యపు చర్యల వల్ల బాగుపడే వాళ్లు కూడా ఉన్నారు. వారే నంబర్ ప్లేట్లు, స్టిక్కర్లు తయారు చేసే షాప్‌ల వాళ్లు.. ఇప్పుడు వారికి డిమాండ్ ఒక్కసారిగా పెరిగింది. పిఠాపురంఓలని ఓ సెంటర్‌లో జస్ట్ టూడేస్‌లో ఏకంగా 300 బోర్డులు తయారయ్యాయని తెలుస్తోంది. అన్ని పార్టీల వారు వస్తున్నారని.. అందరికి సమానంగా ప్రాధాన్యం ఇస్తున్నామని చెబుతున్నారు షాప్ ఓనర్స్.


Also Read: ఫలితాల తర్వాత ర్యాలీలు తీయొద్దు: సీఈఓ

ఇదీ కథ.. పిఠాపురంలో మొదలై.. అలా అలా ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా పాకుతుంది ఈ నంబర్ ప్లేట్ ట్రెండ్.. అంతా బాగానే ఉంది కానీ.. ఎలక్షన్ కౌంటింగ్ జూన్‌4న జరగనుంది. గెలిచేది ఒక్కరే.. ఇద్దరైతే గెలవరు. గెలిచిన పార్టీ నంబర్ ప్లేట్స్‌ ఓకే.. కానీ ఓడిన వారు అప్పుడు ఏం చేస్తారు. ఎక్కడైతే ఆర్డర్ ఇచ్చి చేయించుకున్నారో.. మళ్లీ అక్కడికే వెళ్లి ఒరిజినల్‌ నంబర్‌ ప్లేట్స్ చేయించుకోవాలి. సో వాళ్లకి మళ్లీ గిరాకి తప్పదన్నమాట. మీ పిచ్చి వల్ల ఏదైనా మంచి జరిగింది అంటే.. ఇదొక్కటే తప్ప.. మరేది లేదు..

నిజానికి RTA రూల్స్‌ ప్రకారం నెంబర్ ప్లేట్స్‌ ఇలా పెట్టకూడదు.. ఇలాంటి వెహికల్స్‌ను పోలీసులు కనుక పట్టుకుంటే ఫైన్‌లు తప్పవు.. బట్ వారిని లెక్కలోకి తీసుకునే వారు ఎవరు? పట్టించుకునే వారు ఎవరు? ఇదంతా ఒక ఎత్తు అయితే.. ప్రస్తుతం పిఠాపురంతో పాటు రాష్ట్రంలో ఓ విచిత్రమైన పరిస్థితి కనిపిస్తోంది. అదే గెలుపుపై అన్ని పార్టీల ధీమా.. ఇటు కూటమి గెలుపు మాదే అంటోంది. అటు వైసీపీ ఏకంగా జగన్‌ ప్రమాణస్వీకారం చేసుకునేందుకు ముహూర్తం ఖరారు చేసుకుంది. ఇదే అస్సలు అర్థం కాని పరిస్థితి నెలకొంది ఏపీలో అందరు గెలిస్తే.. ఓడేది ఎవరు? అనేది మెయిన్ క్వశ్చన్.

Related News

Araku Coffee: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. అరకులో ఇకపై అందరూ లక్షాధికారులే!

Pawan Kalyan project: పవన్ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం.. కోట్లల్లో ఖర్చు.. ఎందుకంటే?

Railways: రైల్వే ప్రాజెక్టులపై దృష్టి.. అవన్నీ జరిగితే ఏపీకి తిరుగుండదు

Pulivendula Politics: పులివెందుల రాజకీయాలు.. 30 ఏళ్లలో రెండోసారి, ఓటర్లు ఫుల్‌ఖుషీ

Pawan Kalyan: రూటు మార్చిన పవన్.. నిన్న మామిడి.. నేడు చీరలు, రేపు?

AP Free Bus Scheme: ఏపీలో ఫ్రీ బస్ స్కీమ్.. ఆ బస్సు లెక్కితే ఉచిత ప్రయాణం ఉండదు

Big Stories

×