BigTV English

Kalki 2898 Ad Prabhas: ఇవాళే ఓటీటీలోకి ‘కల్కి 2898 ఏడీ’ సిరీస్.. ట్రైలర్ బ్లాక్ బస్టర్

Kalki 2898 Ad Prabhas: ఇవాళే ఓటీటీలోకి ‘కల్కి 2898 ఏడీ’ సిరీస్.. ట్రైలర్ బ్లాక్ బస్టర్

kalki 2898 ad prabhas release date: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తోన్న కొత్త సినిమా ‘KALKI 2898 AD’ మూవీ. ప్రముఖ దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తోన్న ఈ మూవీలో దీపికా పదుకొనే, దిశా పటానీ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అలాగే అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, రానా వంటి ప్రముఖ స్టార్లు ఇందులో కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇప్పుడంతా ఈ మూవీపైనే ఫోకస్. ఎందుకంటే ఈ మూవీ హాలీవుడ్ రేంజ్ మార్వెల్ సినిమాలా ఉండబోతుందనడమే అందుకు కారణం.


ప్రముఖ సంస్థ వైజయంతీ మూవీస్ ఈ చిత్రం కోసం ఎంతైనా ఖర్చు పెడుతుంది. ప్రేక్షకులకు మంచి క్వాలిటీ అందించడంలో ఏ విషయంలోనూ వెనక్కి తగ్గడం లేదు. మాస్ యాక్షన్ అండ్ అడ్వంచరస్‌గా తెరకెక్కుతోన్న ఈ మూవీ కోసం యావత్ సినీ ప్రేక్షకులు, అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్ టీజర్స్ సినిమా రేంజ్‌ను మరో లెవెల్‌కి తీసుకెళ్లాయి.

ఇక ఈ మూవీ జూన్ 27న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుండటంతో చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలు వేగవంతం చేసింది. ఈ క్రమంలోనే ఇటీవల ‘బుజ్జి’ కారును చూపించేందుకు ప్రత్యేక ఈవెంట్‌ నిర్వహించారు. ఆ ఈవెంట్‌లో బుజ్జితో ప్రభాస్ విన్యాసాలు ఓ రేంజ్‌లో ప్రేక్షకాభిమానుల్ని ఆకట్టుకున్నాయి. అయితే ఇప్పుడు మూవీ యూనిట్ మరొక వినూత్న ప్రయత్నం చేసింది.


Also Read: ‘కల్కి’ ఫ్యాన్స్ ఇక రెడీ అయిపోండ్రి.. ట్రైలర్ వచ్చేస్తోంది!

ఇందులో భాగంగానే చిత్రబృందం బుజ్జితో ప్రభాస్ చేసే సాహస విన్యాసాల్ని ‘బుజ్జి అండ్ భైరవ’ పేరుతో ఓ యానిమేటెడ్ సిరీస్‌ను రూపొందించింది. ఈ సిరీస్ ఇవాల్టి నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ అమెజాన్‌ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ నేపథ్యంలో నిన్న అంటే మే 30న ఈ సిరీస్ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు నాగ్ అశ్విన్ మాట్లాడుతూ.. కల్కి 2898 ఏడీలో బుజ్జి, భైరవల కామెడీ అందర్నీ బాగా ఆకట్టుకుంటుందని అన్నాడు. అయితే సినిమాకు ముందు ఈ సిరీస్‌ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం సాహసోపేతమైన ప్రయోగం అని తెలిపాడు. మరెందుకు ఆలస్యం మీరు ఈ ట్రైలర్ చూసి.. సిరీస్‌ను ఇవాళ ఎంజాయ్ చేసేయండి.

Tags

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×