BigTV English

Pawan Kalyan: గెలుపే లక్ష్యంగా జనసేనాని దూకుడు.. ఈ నెల 14 నుంచి ఉభయ గోదావరి టూర్

Pawan Kalyan: గెలుపే లక్ష్యంగా జనసేనాని దూకుడు.. ఈ నెల 14 నుంచి ఉభయ గోదావరి టూర్
Pawan Kalyan Latest news

Pawan Kalyan Godavari Districts Tour: ప్రజాక్షేత్ర పోరులో జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ మరింత దూకుడు పెంచారు. గెలుపే లక్ష్యంగా వ్యూహాలకు పదును పెడుతున్నారు. ఇందులో భాగంగానే వైసీపీ వ్యతిరేక ఓటును చీలనివ్వని గతంలో ఎన్నోసార్లు చెప్పిన ఆయన.. ఆ దిశగా ముందుకు సాగుతున్నారు.


ఈ నేపథ్యంలో టీడీపీ, జనసేన, బీజేపీల మిత్రబంధంలో కీలక పాత్ర పోషిస్తున్నారు పవన్‌కల్యాణ్‌. ఇక మరోవైపు ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో ప్రజలను ఆకర్షించే ఎత్తుగడలో భాగంగా ఆయన జిల్లాల బాట పట్టనున్నారు. అలాగే ఈ పర్యటనతో ఇటు జనసేన, అటు టీడీపీ శ్రేణుల్లో జోష్‌ నింపి ఎన్నికల సమరానికి సన్నద్ధం చేయనున్నారు.

ఈ నేపథ్యంలోనే ఈ నెల 14 నుంచి 17వ తేదీ వరకు ఉమ్మడి గోదావరి జిల్లాల్లో పర్యటించనున్నారు. టూర్‌లో భాగంగా ముందుగా ఈ నెల 14వ తేదీన భీవరం డివిజన్‌లో తొలి భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు పవన్‌. ఆ తర్వాత వరుసగా అమలాపురం, కాకినాడలో, రాజమహేంద్రవరంలో సభలు ఉండనున్నాయని సమాచారం.


Read More: చంద్రబాబు స్కెచ్చా..? పవనే సెట్ చేశాడా?

ఎన్నికల పోరుకు సమయం ఆసన్నమవుతుండటంతో ఉభయ గోదావరి జిల్లాలపై ఫోకస్‌ పెట్టిన పవన్‌కల్యాణ్‌.. గత రెండు నెలల క్రితమే కాకినాడలో నాలుగు రోజులపాటు తిష్టవేశారు. క్షేత్రస్థాయి నాయకుల నుంచి జిల్లా స్థాయి నేతలతో పార్టీ బలోపేతంపై వరుస సమీక్షలు నిర్వహించి క్యాడర్‌ను ప్రజాక్షేత్ర రణరంగానికి సమయాత్తం చేశారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్ధేశం చేశారు.

ఇక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతున్న పవన్‌కల్యాణ్‌ పర్యటన మూడు దశలుగా సాగనుంది. నియోజకవర్గాల్లో టీడీపీ, జనసేన శ్రేణుల మధ్య సమన్వయం, పొత్తులు, విజయమే టార్గెట్‌గా సమావేశాలు నిర్వహించనున్నారు.

Read More: ఏపీపై బీజేపీ త్రిశూలవ్యూహం.. మూడు స్తంభాలాట..

ఈ మేరకు తొలి దశలో ముఖ్య నేతలు, ప్రభావశీలురుతో భేటీ కానున్నారు. రెండవ దశలో స్థానిక కమిటీల నేతలు, కార్యకర్తలు, వీరమహిళలతో సమావేశంకానున్నారు. అలాగే మూడవ దశలో ఎన్నికల ప్రచారంతో హోరెత్తించనున్నారు. ఈ నేపథ్యంలోనే ఉభయ గోదావరి జిల్లా టూర్‌ అనంతరం ఇతర జిల్లాల్లోనూ పర్యటించనున్నారు.

Related News

Tollywood Producers: ఏపీకి చేరిన సినిమా పంచాయితీ.. మంత్రి దుర్గేష్ తో ఫిలిం చాంబర్ నేతల సమావేశం

Anantapur News: ఏపీలో షాకింగ్ ఘటన.. బస్సు ఆపలేదని మహిళ ఆగ్రహం.. డ్రైవర్ చెంప పగలకొట్టింది

Aadudam Andhra Scam: రోజా అసలు ‘ఆట’ మొదలు.. అరెస్టుకు రంగం సిద్ధం, రంగంలోకి సిట్?

Tirumala News: బుక్కైన జగన్ మామ, టీటీడీ కేసు నమోదు, అసలు ఏం జరిగింది?

YS Jagan: ఉప ఎన్నికల వేళ జగన్ 8 ప్రశ్నలు.. ఓటమిని ముందే ఒప్పుకున్నారా..?

Pulivendula Campaign: ఖైదీల వేషధారణలో ఎన్నికల ప్రచారం.. వైసీపీ పరువు తీసేశారుగా!

Big Stories

×