BigTV English

Pawan Kalyan in Kakinada | కాకినాడపై పవన్ ఫోకస్.. ద్వారంపూడి ఓటమి ఖాయమేనా?

Pawan Kalyan in Kakinada | జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తూర్పుగోదావరి జిల్లాపై ప్రత్యేక ద‌ృష్టి సారిస్తున్నారు .. మరీ ముఖ్యంగా కాకినాడపై స్పెషల్ ఫోకస్ పెడుతున్నారు .. కాకినాడకు వరుస టూర్లు పెట్టుకుంటున్నారు .. ఏకంగా అక్కడ ఇల్లు తీసుకునే ఆలోచన కూడా చేస్తున్నారని టాక్.

Pawan Kalyan in Kakinada | కాకినాడపై పవన్ ఫోకస్.. ద్వారంపూడి ఓటమి ఖాయమేనా?

Pawan Kalyan in Kakinada | జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తూర్పుగోదావరి జిల్లాపై ప్రత్యేక ద‌ృష్టి సారిస్తున్నారు .. మరీ ముఖ్యంగా కాకినాడపై స్పెషల్ ఫోకస్ పెడుతున్నారు .. కాకినాడకు వరుస టూర్లు పెట్టుకుంటున్నారు .. ఏకంగా అక్కడ ఇల్లు తీసుకునే ఆలోచన కూడా చేస్తున్నారని టాక్. అంటే అక్కడి వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌పై చేసిన సవాల్‌ను జనసేనాని అంత సీరియస్‌గా తీసుకున్నారా? … ద్వారంపూడి ఓడించడమే టార్గెట్‌గా పెట్టుకున్నారా?


జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గోదావరి జిల్లాలపై ప్రత్యేక ద‌ృష్టి సారిస్తున్నారు … టీడీపీతో పొత్తులో భాగం ఆయన పార్టీకి ఉభయగోదావరి జిల్లాల్లోనే ఎక్కువ సీట్లు దక్కే పరిస్థితి ఉందంటున్నారు. ఆ లెక్కలతోనే జనసేనాని తన వారాహి రథ యాత్రను కాకినాడ జిల్లా అన్నవరం నుంచే ప్రారంభించారు. ప్రస్తుతం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని మొత్తం 19 నియోజకవర్గాల్లో పార్టీ బలాబలాలను తెలుసుకుంటున్నారు. అందులో భాగంగానే ఇటీవల మూడు రోజులపాటు కాకినాడలో బస చేశారు .

మొదటిరోజు కాకినాడ జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్‌చార్జ్‌లతో మాట్లాడి వారి నుంచి సమాచారం తెలుసుకున్నారు … క్షేత్రస్థాయిలో స్థాయిలో పార్టీ బలాబలాలు ఎలా ఉన్నాయి …నిత్యం ప్రజల్లో ఉంటున్నారా? … ప్రజా సమస్యలు తెలుసుకుంటున్నారా? ఇలా రకరకాల ప్రశ్నలతో ఇన్‌ఫర్మేషన్ సేకరిస్తున్నారు .. వారిని అడగడానికి ముందుగానే రహస్యంగా కొంత సమాచారం సేకరిస్తున్నారంట.


ఇదలాఉంటే జనసేన అధ్యక్షుడు కాకినాడ సిటీపై ప్రత్యేక ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తోంది … కాకినాడలో ఉన్న మిగిలిన రెండు రోజులు కాకినాడ సిటీలోని 50 మంది డివిజన్ ఇన్‌చార్జ్‌లతో సుదీర్ఘంగా చర్చించారు … మరుసటి రోజు డివిజన్ ఇన్‌చార్జ్‌తో పాటు ఆ డివిజన్లోని 20 మంది కార్యకర్తలతో ఒకేసారి భేటీ అయ్యారు … కాకినాడ సిటీలోని కార్యకర్తలు అందరిని పిలిచి వారితో ఫోటోలు కూడా దిగారు … ఇంతకీ ఆయన కాకినాడ సిటీపై ఎందుకు అంత ఫోకస్ పెట్టారు అంటే ఆయన చేసిన సవాలే కారణమంటున్నారు.

గతంలో పవన్‌కళ్యాణ్ కాకినాడలో మాట్లాడుతూ వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడిపై ఒక రేంజ్లో ఫైర్ అయ్యారు … ఆయన రేషన్ బియ్యం విదేశాలకు తరలిస్తూ వేలకోట్లు దోచుకుంటున్నారని ఆరోపించారు … ఎక్కడికక్కడ కబ్జాలు, సెటిల్మెంట్లు చేస్తూ అవినీతి సామ్రాట్ గా కాకినాడ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ధ్వజమెత్తారు …. అటువంటి వ్యక్తిని ఎన్నికల్లో అసెంబ్లీ గేటును కూడా తాకనివ్వబోనని సవాల్ చేశారు … దానికి పవన్ కళ్యాణ్ కు దమ్ముంటే తనపై పోటీ చేయాలని ద్వారంపూడి ప్రతి సవాల్ విసిరారు.

దానికి తోడు ద్వారంపూడికి మద్దతుగా ముద్రగడ పద్మనాభం కూడా పవన్ కళ్యాణ్ పై పలు విమర్శలు చేశారు.. . కాపు ఉద్యమానికి ద్వారంపూడి ఎంతో సాయం చేశారని అటువంటి వ్యక్తిపై పవన్ కళ్యాణ్ ఆరోపణలు చేయడం సరికాదని ద్వారంపూడి తరపున వకాల్తా పుచ్చుకున్నారు … ఈ నేపథ్యంలో అగ్గి మరింత రాజుకుంది… ఎట్టి పరిస్థితుల్లోనూ ద్వారంపూడిని ఓడించి తీరాలని పవన్ కళ్యాణ్ పంతం పట్టినట్లుగా కనిపిస్తోంది… కాకినాడలో గత నెలలో మీటింగులు పెట్టి… మళ్లీ ఈ నెలలో మూడు రోజుల పాటు పార్టీ కార్యకర్తలతో భేటి నిర్వహించడానికి రెడీ అయ్యారు.

అయితే ఈసారి రాజమండ్రి, కోనసీమ జిల్లాల ఇన్చార్జిలతో భేటీ అవ్వనున్నారు .. ఆ సమావేశాలు రాజమండ్రిలో, కోనసీమలో కాకుండా కాకినాడలో నిర్వహిస్తుండటం ప్రాధాన్యత సంతరించుకుంది.. ఈ సారి కూడా ఆయన కాకినాడ ఇన్‌చార్జ్‌లతో మాట్లాడి వివరాలు తెలుసుకోనున్నారు … అలాగే కాకినాడ సిటీలోని డివిజన్ ఇన్‌చార్జ్‌లు, కార్యకర్తలు, ఇతర నాయకులు అందరితో చర్చలు జరుపుతారు… ఇదంతా చూస్తుంటే పవన్ కళ్యాణ్ కాకినాడ సిటీలో ద్వారంపూడి ఓటమిని చాలా సీరియస్‌గా తీసుకున్నట్లు కనపిస్తోంది.

Related News

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Pulivendula: పులివెందులలో హై టెన్షన్.. వివేకానంద పుట్టిన రోజు, సునీత సంచలన వ్యాఖ్యలు

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Vizag Harbour News: విశాఖలో ఫిషింగ్ హార్బర్ వద్ద ఘోర ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి!

Big Stories

×