BigTV English

Girl molested Virtually : తొలిసారిగా 16 ఏళ్ళ బాలికపై ఆన్‌లైన్‌లో గ్యాంగ్ రేప్.. కేసు నమోదు చేసిన పోలీసులు..

London : బ్రిటన్ లో 16 ఏళ్ల బాలికపై అత్యాచారం జరిగింది. ఇది చదవడానికి కొంత విచిత్రంగా ఉన్నా నిజం. ప్రపంచంలో వర్చువల్ గ్యాంగ్ రేప్ జరగడం ప్రపంచంలో తొలి ఘటన గా అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతం దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Girl molested Virtually : తొలిసారిగా 16 ఏళ్ళ బాలికపై ఆన్‌లైన్‌లో గ్యాంగ్ రేప్.. కేసు నమోదు చేసిన పోలీసులు..

Girl molested Virtually : లండన్‌లో 16 ఏళ్ల బాలికపై వర్చువల్‌గా అత్యాచారం జరిగింది. ఇది చదవడానికి కొంత విచిత్రంగా ఉన్నా నిజం. ప్రపంచంలో వర్చువల్ గ్యాంగ్ రేప్ జరగడం తొలి ఘటన‌గా అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతం దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.


బ్రిటన్ దేశానికి చెందిన ఓ బాలిక(16) ఆన్‌‌లైన్‌లో‌ ఎక్కువుగా గేమ్స్ ఆడుతూ ఉంటుంది. ఎప్పటిలానే ఆ బాలిక వర్చువల్ రియాలిటీ గేమ్ ఆడుతుండగా వర్చువల్‌గా ఆమె‌పై దాడి జరిగింది. ఆపై గేమ్‌లోనే ఆమె డిజిటల్ క్యారక్టర్‌పై గుర్తు తెలియని వ్యక్తులు సాముహిక అత్యాచారానికి పాల్పడ్డారు. భౌతికంగా ఆమెకు ఎలాంటి గాయాలు అవ్వలేదు. అయితే మానసికంగా తీవ్ర మనోవేదనకు గురైంది. కొంత మంది పురుషులు ఆమె క్యారక్టర్‌పై ఆన్‌లైన్‌లో గ్యాంగ్ రేప్‌కు పాల్పడ్డారని న్యూయార్క్ టైమ్స్ పత్రిక పేర్కొంది.

నిజానికి బాలికపై భౌతికంగా అత్యాచారం జరగలేదు. అయితే తనపై రేప్ జరిగనట్లు ఆమె మానసికంగా బాధను అనుభవిస్తున్నట్లు పోలీసులు ప్రకటించారు. ఈ ఘటన ఆమెపై తీవ్రంగా ప్రభావం చూపిందని పోలీసు అధికారి పేర్కొన్నారు. అయితే ప్రస్తుతం ఇటువంటి కేసులకు సంబంధించి ప్రత్యేకంగా చట్టాలు ఏమీ లేవని పేర్కొన్నారు. దీంతో ఈ కేసులో ముందు ముందు అనేక సవాళ్లు ఎదురు కావొచ్చని పోలీసులు తెలిపారు.


వర్చువల్‌గా జరిగే లైంగిక నేరాలపై దర్యాప్తు చేయ్యాలా లేదా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయని తెలిపారు. ఈ కేసుపై యూకే హోం సెక్రటరీ జెమ్స్ స్పందించారు. బాలిక తీవ్ర మనోవేదనకు గురి అయింది. ప్రస్తుతం ఆమె మానసిక వేదనకు గురి అయి ఉంది. ఈ కేసును ఆమె సమర్థిస్తూ అత్యాచారానికి పాల్పడిన వారిలో ఒక వ్యక్తికి గాయాలు కూడా అయ్యాయాని పేర్కొన్నారు.

హారిజోన్ వరల్డ్‌లో వర్చువల్‌గా లైంగిక నేరాలపై అనేక నివేదకలు వచ్చాయి. ఈ ఆన్‌లైన్ ఉచిత గేమ్‌ని మెటా నిర్వహిస్తుంది. ఈ గేమ్‌పై అనేక ఆరోపణలు వచ్చాయి. దీనిపై మెటా స్పందిస్తూ తమ ప్లాట్‌ఫాంలో ఇలాంటి వాటికి అవకాశం లేదని ప్రకటించింది. వినియోగదారులకు పూర్తిగా ఆటోమేటిక్‌గా రక్షణ ఉంటుదన్నారు. అపరిచిత వ్యక్తుల నుండి పూర్తిగా రక్షణ ఉంటుందని మెటా ప్రతినిధి పేర్కొన్నారు.

Girl molested Virtually, virtual rape, London, Crime,

Related News

Cyber scam: 80 ఏళ్ల వృద్ధుడికి హాయ్ చెప్పి.. 8 కోట్లు నొక్కేసిన కి’లేడి’.. పెద్ద మోసమే!

Shamli News: భర్త వద్దన్నాడు.. అయినా భార్య వినలేదు, చివరకు ఏం జరిగిందంటే

Hyderabad incident: టిఫిన్ బాక్స్‌తో చిన్నారిపై టీచర్ దాడి.. తలకు 3 కుట్లు పడేలా కొట్టడమేంటి?

New Bride Incident: ఫ్రెండ్సే చంపేశారా? నవ వధువు కేసులో బిగ్ ట్విస్ట్!

Tamilnadu Crime: రాజకీయ నేత ఫామ్‌హౌస్.. ఎస్ఐని చంపేశారు, ఏం జరిగింది?

Karimnagar Crime: యూట్యూబ్ చూసి డైరెక్షన్ ఇచ్చింది.. పనంతా ప్రియుడు చేశాడు, చివరకు ఏమైంది?

Big Stories

×