ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చాలా అరుదుగా మీడియా ముందుకొస్తున్నారు. సోషల్ మీడియాలో కూడా ఆయన గతంలో లాగా పెద్దగా యాక్టివ్ గా కనిపించడం లేదు. అయితే కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న పథకాలకు కానీ, కేంద్రం తీసుకుంటున్న కొత్త నిర్ణయాలకు కానీ పవన్ పూర్తి స్థాయిలో తన మద్దతునిస్తున్నారు. అంతే కాదు, ఆ పథకాలను పవన్ స్వయంగా ప్రచారం చేస్తున్నారు. తాజాగా నేషనల్ హైవేస్ కి సంబంధించి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటనను పవన్ కల్యాణ్ అభినందించారు. నేషనల్ హైవేస్ పై టోల్ ఫీజులు చెల్లించే వాహనదారులకు కాస్త ఉపశమనం కలిగించేలా కేంద్ర రవాణా శాఖ ఒక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం గేమ్ ఛేంజర్ అని ప్రశంసించారు పవన్ కల్యాణ్. ఈమేరకు ఒక ట్వీట్ వేశారు.
A game-changer for Bharat’s road infrastructure journey
A long-standing demand of vehicle owners, especially those from nearby villages and frequent highway commuters, has finally been addressed with this landmark decision.
I wholeheartedly thank Union Minister Sri… https://t.co/02shb45AR4
— Deputy CMO, Andhra Pradesh (@APDeputyCMO) June 18, 2025
ఏడాదికి ఒక్కసారి..
ఇప్పటి వరకు మనం ఫాస్టాగ్ లో ఎంత రీజార్చ్ చేసుకుంటే, అంతే అమౌంట్ ఉంటుంది. టోల్ గేట్ దాటినప్పుడల్లా ఆ టోల్ చార్జి దాని నుంచి మినహాయించుకుంటారు. అయితే వాహనదారులకు కాస్త ఉపశమనం కలిగించేలా కేంద్ర ప్రభుత్వం కొత్త నిర్ణయం తీసుకుంది. ఫాస్టాగ్ ఆధారిత వార్షిక పాస్ వ్యవస్థను ప్రవేశపెట్టబోతోంది. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15 నుంచి ఈ యాన్యువల్ టోల్ పాస్ అందుబాటులోకి రాబోతోంది. దీని ఖరీ4దు రూ.3వేలు. అంటే ఒకేసారి రూ.3వేలు చెల్లించి ఏడాది పాస్ తీసుకుంటే ఇక ఫాస్టాగ్ ని మనం రీచార్చ్ చేసుకోవాల్సిన అవసరం లేదన్నమాట.
కండిషన్స్ అప్లై..
అయితే ఏడాదికి రూ.3వేలు పెట్టి ఫాస్టాగ్ తీసుకుంటే పూర్తిగా టోల్ మినహాయింపు ఉంటుంది అనుకోలేం. ఇది కోవలం 200 ట్రిప్పులకు మాత్రమే చెల్లుబాటు అవుతుంది. 200 ట్రిప్పులు దాటితే తిరిగి మరో పాస్ తీసుకోవాలా, లేక ఫాస్టాగ్ ని రీచార్జ్ చేసుకోవాలా అనేదానిపై క్లారిటీ రావాల్సి ఉంది. అయితే వార్షిక పాస్ వినియోగదారులకు లాభదాయకమేనని అంటున్నారు. ప్రస్తుతం ఒక్కో టోల్ గేట్ వద్ద ఒక్కోరకమైన చార్జీ వసూలు చేస్తున్నారు. ఏడాది పాస్ తీసుకుంటే సగటున అన్ని టోల్ గేట్స్ వద్ద రూ.15 చెల్లించినట్టవుతుంది. కార్లు, జీపులు, వ్యాన్లు వంటి నాన్- కమర్షియల్ ప్రైవేటు వాహనాలకు మాత్రమే ఇది వర్తిస్తుందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. దీని యాక్టివేషన్ కోసం త్వరలోనే ఓ లింక్‌ను అందుబాటులోకి తెస్తామని ఆయన చెప్పారు. జాతీయ రహదారులు, జాతీయ ఎక్స్‌ప్రెస్‌వేలపై ఉండే టోల్ ప్లాజాల వద్ద మాత్రమే ఈ వార్షిక పాస్ చెల్లుబాటవుతుంది.
నితిన్ గడ్కరీ ప్రకటన తర్వాత పవన్ కల్యాణ్ తన ట్వీట్ ద్వారా కేంద్రం నిర్ణయాన్ని ప్రశంసించారు. రూ.3వేల యాన్యువల్ పాస్ తో వాహనదారులకు ఆర్థికపరమైన మేలు జరగడంతోపాటు, దేశ వ్యాప్తంగా టోల్ గేట్ల వద్ద రద్దీ తగ్గుతుందని, వేగవంతమైన, వివాద రహిత హైవే ప్రయాణం అందుబాటులోకి వస్తుందన్నారు పవన్. టోల్ ప్లాజాల సమీపంలో నివసిస్తూ తరచూ ప్రయాణాలు చేసే వారికి దీనివల్ల అధిక ప్రయోజనం కలుగుతుందని పేర్కొన్నారు పవన్.