CM Revanth Reddy: బనకచర్లపై అఖిలపక్ష ఎంపీలతో సమావేశం అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. గ్రావిటీ ద్వారా నీళ్లు అందించాల్సిందిపోయి కేసీఆర్, హరీష్ రావు కమిషన్ల కాసులకు కక్కుర్తిపడి లిఫ్ట్ ఇరిగేషన్లతో కాళేశ్వరం చేపట్టారని సీఎం రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. బనకచర్లతో తెలంగాణకు నష్టంపై ఉరితీయాల్సింది కేసీఆర్‌నే అని సంచలన వ్యాఖ్యలు చేశారు. అలాగే కేంద్రంలో పలుకుబడి ఉందని అన్ని ప్రాజెక్టులకూ అనుమతులు వస్తాయని అనుకోవద్దని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు సీఎం రేవంత్ సూచించారు.
బనకచర్ల ప్రాజెక్టుపై కేంద్రానికి లేఖ రాసి ఫిర్యాదులు చేస్తున్నాం. తెలంగాణ ప్రభుత్వం ఈ ప్రాజెక్టుపై నిర్లక్ష్యం చేయడం లేదు. బనకచర్ల పాపానికి పునాది వేసింది కేసీఆర్. సర్వపాపాలు చేసింది కేసీఆర్, హరీష్ రావు. బనకచర్లతో తెలంగాణకు నష్టంపై ఉరితీయాల్సిందే కేసీఆర్‌నే. ఉమ్మడి రాష్ట్రంలో మొదలు పెట్టిన కృష్ణా ప్రాజెక్టులను పూర్తి చేయలేదు. తుమ్మిడిహట్టి దగ్గర ప్రాజెక్ట్ కట్టి ఉంటే లిఫ్ట్ లు లేకుండా.. గ్రావిటీతో ఉత్తర తెలంగాణకు నీళ్లు ఇచ్చేవి.. బేసిన్లు లేవు భేషజాలు లేవని కేసీఆర్ చెప్పారు. ఏపీ ప్రభుత్వం నుంచి బనకచర్ల ప్రతిపాదన రాగానే.. నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్ ను కలిశాం. బనకచర్లతో తెలంగాణకు నష్టమని మా అభ్యంతరం తెలిపాం.
READ ALSO: CM Revanth Reddy: బనకచర్లను అడ్డుకోవడమే నా లక్ష్యం.. దీని కోసం ఎంతవరకైనా? : సీఎం రేవంత్
బనకచర్ల ప్రాజెక్టు సామర్థ్యం 200 టీఎంసీలని చెబుతున్నారు. వాస్తవంగా 300 టీఎంసీలు తరలించాలనేది బనకచర్ల లక్ష్యం. లక్ష కోట్లతో కట్టిన కాళేశ్వరంతో లక్ష ఎకరాలకు కూడా నీరు ఇవ్వలేదు. మూడేళ్లలో కేసీఆర్ కట్టిన కాళేశ్వరం కూలిపోయింది. కాళేశ్వరంలో చేసిన తప్పులకు కేసీఆర్ విచారణ ఎదుర్కొంటున్నారు. కాళేశ్వరం విచారణ డైవర్ట్ చేయడానికి ప్రభుత్వంపై బీఆర్ఎస్ విమర్శలు చేస్తోంది. ఎస్ఎల్‌బీసీలో ప్రమాదం జరిగితే బీఆర్ఎస్ నేతలకు పైశాచికానందం. లక్ష కోట్లతో కట్టిన కాళేశ్వరంతో లక్ష ఎకరాలకు కూడా నీరు ఇవ్వలేదు.
READ ALSO: AP News : అది కనిపిస్తే కేసు!.. సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయం
అలాగే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడికి కూడా కీలక సూచనలు చేశారు. కేంద్రంలో పలుకుబడి ఉందని అన్ని ప్రాజెక్టులకూ అనుమతులు వస్తాయని అనుకోవద్దని చంద్రబాబుకు ఆయన సూచించారు. మోదీతో చంద్రబాబు, చంద్రబాబుతో మోదీకి అవసరం ఉందని.. అధికారం మీకు అన్నట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ‘ప్రధాని మోదీపై ఒత్తిడి తెచ్చి అనుమతులు తెచ్చుకోవడం వల్ల ఇవి పూర్తి కావు. గోదావరి బేసిన్‌లోని 968 టీఎంసీలు, కృష్ణా బేసిన్‌లోని 555 టీఎంసీలలో తెలంగాణలో ప్రాజెక్టులు నిర్మించుకుంటాం. అన్నింటికీ ఎన్‌వోసీ ఇవ్వండి. ఆ తర్వాత సముద్రంలోకి పోయే నీళ్లు ఏపీ తీసుకోవడానికి ఇబ్బంది లేదు’ అని సీఎం రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు.