BigTV English
Advertisement

OTT Movie : పట్టిందల్లా బంగారం చేసే మాయ చెరువు… ట్విస్టులతో అదరగొట్టే హాలీవుడ్ ఫ్యాంటసీ థ్రిల్లర్

OTT Movie : పట్టిందల్లా బంగారం చేసే మాయ చెరువు… ట్విస్టులతో అదరగొట్టే హాలీవుడ్ ఫ్యాంటసీ థ్రిల్లర్

OTT Movie : ఇంగ్లాండ్‌లో ఒక యుద్ధ సమయంలో, లూసీ, ఎడ్మండ్ పెవెన్సీలు తమ బంధువు యుస్టేస్ స్క్రబ్‌తో కలిసి ఒక సాహసంతో కూడిన ప్రయాణం చేస్తారు. ఒక రహస్యమైన ప్రదేశం నుంచి నార్నియా మాయాజాల ప్రపంచంలోకి వెళతారు. అక్కడ వీళ్ళు కాస్పియన్ అనే రాజుకు చెందిన ఒక ఓడలోకి  చేరతారు. ఈ ఓడ ప్రయాణంతో స్టోరీ ఆసక్తికరంగా సాగుతుంది. వీళ్ళు నార్నియా ప్రపంచంలోకి ఎందుకు వెళ్లారు ? అక్కడ ఏం చేస్తారు ? ఈ స్టోరీ ఏమిటి ? ఏ ఓటీటీలో ఉందో తెలుసుకుందాం పదండి.


స్టోరీలోకి వెళితే 

ఎడ్మండ్ పెవెన్సీ, లూసీ తమ బంధువు యుస్టేస్ తో కలిసి, ఒక మాయాజాల చిత్రం ద్వారా నార్నియాలోకి ప్రయాణిస్తారు. అక్కడ వీళ్ళు కాస్పియన్ అనే రాజుతో కలసి ఒక ఓడలో ప్రయాణిస్తారు. ఈ ఓడ తూర్పు సముద్రంలో, కనిపించకుండా పోయిన ఏడు నార్నియన్ లార్డ్‌లను వెతకడానికి ప్రయాణిస్తోంది. కాస్పియన్ ఈ లార్డ్‌లను కనిపెట్టి, నార్నియాను ఒక చీకటి శక్తి నుండి కాపాడాలని లక్ష్యంగా పెట్టుకుంటాడు. ఈ ప్రయాణంలో వీళ్ళంతా ఒక్కొక్క ద్వీపంలో లార్డ్‌లను వెతుకుతూ వెళతారు.  అక్కడ వివిధ మాయాజాల సవాళ్లను ఎదుర్కొంటారు. ఒక ద్వీపంలో అయితే బానిస వ్యాపారుల బారిన పడతారు. మరొక ద్వీపంలో ఒక మాయాజాల సరస్సులో పట్టిందల్లా బంగారం అవుతుంది. అలాగే వీళ్ళకు సమస్యలు కూడా చుట్టుముడతాయి. లూసీ, ఎడ్మండ్ ఈ మాయాజాల శక్తులతో పోరాడుతారు.


ఇంతలో రీపిచీప్ అనే ఒక ధైర్యమైన ఎలుక ఈ బృందానికి సహాయం చేస్తూ, అస్లాన్ ను చేరుకోవాలనే కలను కలిగి ఉంటాడు. ఇక కథ ముందుకు సాగుతున్న కొద్దీ, ఈ బృందం ఏడు లార్డ్‌ల ఖడ్గాలను సేకరించాల్సి ఉంటుంది. ఇవి రహస్యమైన ద్వీపంలో ఉన్న, ఒక శక్తివంతమైన శత్రువును ఓడించడానికి సహాయపడతాయి. ఇప్పుడు ఈ శత్రువు ఒక ఆకుపచ్చ మంచు రూపంలో, నార్నియాను నాశనం చేసే దుష్టశక్తిగా వస్తుంది. మరో వైపు అస్లాన్ అనే నార్నియా దైవిక సింహం, కీలక సమయాల్లో ఈ బృందానికి మార్గనిర్దేశం చేస్తాడు. చివరికి వీళ్ళంతా ఆ ఖడ్గాలను కనిపెడతారా ? నార్నియాను ఆ దుష్ట శక్తి నుంచి కాపాడుతారా ? అస్లాన్ వీళ్ళకు ఏవిధంగా సాయం చేస్తుంది. అనే విషయాలను ఈ సినిమాను చూసి తెలుసుకోవాల్సిందే.

Read Also : దెయ్యాల జోలికి వెళ్ళి హాస్పిటల్ బెడ్ ఎక్కే పూజారి … ఈ ఇండొనేషియన్ సినిమాని చూడాలంటే చాలా గట్స్ ఉండాలి

ఏ ఓటీటీలో ఉందంటే

ఈ ఫాంటసీ అడ్వెంచర్ మూవీ పేరు ‘The Chronicles of Narnia: The Voyage of the Dawn Treader’ 2010 లో వచ్చిన ఈ సినిమాకి మైఖేల్ ఆప్టెడ్ దర్శకత్వం వహించారు. సి.ఎస్. లూయిస్ రచించిన ఐదవ నవల ఆధారంగా ఈ సినిమా రూపొందింది. ఇందులో జార్జీ హెన్లీ, స్కాండర్ కీన్స్, బెన్ బార్న్స్, విల్ పౌల్టర్, సైమన్ పెగ్ (రీపిచీప్ గాత్రం), లియామ్ నీసన్ (అస్లాన్ గాత్రం) వంటి నటులు నటించారు. 1 గంట 53 నిమిషాల రన్‌ టైమ్ ఉన్న ఈ సినిమాకి, IMDb లో 6.3/10 రేటింగ్ ఉంది. జియో హాట్ స్టార్ (Jio Hotstar) లో ఈ మూవీ అందుబాటులో ఉంది.

Related News

Chiranjeeva Movie Review : ‘చిరంజీవ’ మూవీ రివ్యూ : షార్ట్ ఫిలింని తలపించే ఓటీటీ సినిమా

Jana Nayagan OTT: భారీ ధరలకు జననాయగన్ ఓటీటీ రైట్స్… తమిళ ఇండస్ట్రీలోనే రికార్డు ధర!

The Family Man 3 Trailer: హై వోల్టేజ్ యాక్షన్ గా ది ఫ్యామిలీ మ్యాన్ 3.. ఆకట్టుకుంటున్న ట్రైలర్!

Chiranjeeva OTT : ఓటీటీలోకి వచ్చేసిన రాజ్ తరుణ్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

Jatadhara OTT: ‘ జటాధర’ ఓటీటీ పార్ట్నర్ లాక్.. స్ట్రీమింగ్ ఎందులోనంటే..?

OTT Movie : అమ్మాయిలతో ఆ పాడు పని చేసి చంపే సైకో… ఒంటరిగా చూడాల్సిన సీన్స్… క్లైమాక్స్ కేక

OTT Movie : 240 కోట్ల కలెక్షన్స్, 10 అవార్డులు… ఈ బ్లాక్ బస్టర్ మూవీ హీరోని జైలుకు పంపిందన్న విషయం తెలుసా ?

Kiss movie OTT : కిస్ పెట్టుకుంటే ఫ్యూచర్లోకి… మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి సూపర్ హిట్ తమిళ్ మూవీ

Big Stories

×