E-Paper
Advertisement

Ban On SRH: SRHపై నిషేధం..తెర‌పైకి డెక్కన్ చార్జర్స్..బీసీసీఐ స్కెచ్ అదుర్స్ ?

Ban On SRH: SRHపై నిషేధం..తెర‌పైకి డెక్కన్ చార్జర్స్..బీసీసీఐ స్కెచ్ అదుర్స్ ?
Advertisement

Ban On SRH:  సన్ రైజ‌ర్స్ హైదరాబాద్ జట్టు పై ఐదు సంవత్సరాల పాటు బ్యాన్ విధిస్తారని సోషల్ మీడియాలో తెగ పోస్టులు పెడుతున్నారు. పాకిస్తాన్ ఆటగాడు అబ్రార్ అహ్మద్ ను ( Abrar Ahmed ) కొనుగోలు చేయడంపై సన్ రైజ‌ర్స్ హైదరాబాద్ ను ( Sunrisers Hyderabad ) టార్గెట్ చేసి విమర్శలు చేస్తున్నారు క్రికెట్ అభిమానులు. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఓనర్ కావ్య పాప ( Kavya Maran) దేశద్రోహి అంటూ పోస్టులు పెడుతున్నారు. ఇక త్వరలోనే సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుపై బ్యాన్ ( srh ban) విధిస్తారని… ఆ స్థానంలో డెక్కన్ చార్జెస్ ( deccan chargers) పాత జట్టు తెరపైకి వస్తుందని చర్చ జరుగుతోంది. ఈ మేరకు సోషల్ మీడియాలో డెక్కన్ చార్జెస్ ఓనర్ గాయత్రి రెడ్డి ఫోటోలను వైరల్ చేస్తున్నారు. త్వ‌ర‌లోనే సన్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టు స్థానంలో డెక్కన్ చార్జెస్ ( deccan chargers) జ‌ట్టు ఐపీఎల్ 2026 రాబోతుంద‌ని పోస్టులు పెడుతున్నారు తెలుగు ఫ్యాన్స్‌.

Also Read:  Salman Ali Agha Run Out: ఒళ్లు మ‌రిచిపోయి నిద్ర‌పోయిన స‌ల్మాన్ అలీ….బ‌చ్చాగాడిని చేసి రనౌట్ చేసిన బంగ్లాదేశ్‌

SRHపై నిషేధం..తెర‌పైకి డెక్కన్ చార్జర్స్..బీసీసీఐ స్కెచ్ అదుర్స్ ?

Advertisement

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ప్రారంభం కంటే ముందు సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు కొత్త వివాదంలో చిక్కుకుంది. ది హండ్రెడ్ లీగ్ టోర్నమెంట్ లో ( The Hundred) పాకిస్తాన్ ఆటగాడు అబ్రార్ అహ్మద్ ను కావ్య పాప కొనుగోలు చేసింది. రూ.2.34 కోట్లు పెట్టి పాకిస్తాన్ ఆటగాడు అబ్రార్ అహ్మద్ ను కొనుగోలు చేసింది కావ్య పాప. దీంతో కావ్య పాపను దేశద్రోహి అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పడుతున్నారు. సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుపై ఐదు సంవత్సరాల పాటు బ్యాన్ విధించాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి కోరుతున్నారు. అదే సమయంలో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు స్థానంలో డెక్కన్ చార్జర్స్ జట్టు మళ్లీ తెరపైకి వస్తుందని అంటున్నారు. సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు స్థానంలో డెక్కన్ చార్జెస్ కు అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు గాయత్రి రెడ్డి ఫోటోలను వైరల్ చేస్తున్నారు హైదరాబాద్ ఫ్యాన్స్. మరి దీనిపై సన్రైజర్స్ హైదరాబాద్ ఓనర్ కావ్య మారన్ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.

అబ్రార్ అహ్మద్ ను కొనుగోలు చేయడంపై బీసీసీఐ కీలక ప్రకటన

పాకిస్తాన్ ఆటగాడు అబ్రార్ అహ్మద్ ను సన్రైజర్స్ లీడ్స్ జట్టు కొనుగోలు చేసిన వివాదంపై భారత క్రికెట్ నియంత్రణ మండలి తాజాగా స్పందించింది. ఇందులో ఎలాంటి తప్పు లేదని క్లారిటీ ఇచ్చింది. రూల్స్ ప్రకారం ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్లో పాకిస్తాన్ ప్లేయర్లను కొనుగోలు చేయకూడదు. ది హండ్రెడ్ లీగ్ టోర్నమెంట్ అనేది ఇంగ్లాండుకు సంబంధించినది. అక్కడ ఏ ప్లేయర్ అయినా ఆడుకోవచ్చు.. ఎవరినైనా కొనుగోలు చేయవచ్చు… అంటూ భారత క్రికెట్ నియంత్రణ మండలి ఉపాధ్యక్షులు రాజీవ్ శుక్లా కీలక ప్రకటన చేశారు. దీంతో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుపై ఎలాంటి బ్యాన్ పడబోదని అంటున్నారు.

Advertisement

Also Read: RCB VS SRH: కావ్యా పాపపై దారుణంగా పోస్టులు..స‌న్ రైజ‌ర్స్ ను పాకిస్తాన్ గా ఫోటోలు మార్ఫింగ్ చేసి

 

 

Related News

ముస్లిం క్రికెట‌ర్ల‌కు టీమిండియాలో ఛాన్స్ ఇవ్వ‌రు కానీ పాకిస్తాన్ వ‌చ్చేయ్ !

ఇస్లామాబాద్ లో హై టెన్ష‌న్‌…ఇంగ్లాండ్ క్రికెట‌ర్లు బ‌స చేస్తున్న హోట‌ల్ ద‌గ్గ‌ర భారీ బ్లాస్ట్ !

ప్రీతి జింటా లాగా సొట్ట బుగ్గలేసుకుని, వీడేం వికెట్ కీపింగ్ చేస్తాడురా నాయ‌నా ?

పాకిస్తాన్ అంటేనే ఎగిరెగిరి ప‌డ‌తారు, కానీ సిగ్గు లేకుండా మాతో మ్యాచ్ లు ఆడ‌తారు!

ద‌రిద్రుడు అగార్క‌ర్ పోయినా రాత మార‌లేదే…ష‌మీ, భువీల‌ను న‌ట్టేట ముంచారు క‌ద‌రా?

విండీస్ పై చివ‌రి మ్యాచ్ ఆడేశాడు…ఇక ర‌వీంద్ర జ‌డేజా రిటైర్మెంట్ ఇవ్వాల్సిందే

రీ-ఎంట్రీపై ప‌గ‌టి క‌ల‌లు వ‌ద్దు..ఇక‌ రిటైర్మెంట్ ఇచ్చేసి, స‌న్యాసం తీసుకో !

SRH ఇక నీదే అల్లుడు…క‌ట్నంగా కింద క‌ట్ట‌బెట్టిన కావ్య పాప ఫ్యామిలీ ?

Big Stories

Advertisement
×