BigTV English

Pawan Kalyan: కడప టార్గెట్‌గా పవన్ పావులు, రేపో మాపో ఆఫీసు ఓపెన్!

Pawan Kalyan: కడప టార్గెట్‌గా పవన్ పావులు, రేపో మాపో ఆఫీసు ఓపెన్!

Pawan Kalyan: వైసీపీ అధినేత జగన్‌కు కష్టాలు మరింత రెట్టింపు అయ్యాయా? నేతలతోపాటు కేడర్ సైతం చెదిరిపోతుందా? ఎందుకు జగన్ కంగారు‌ పడుతున్నారు? వైసీపీ కోటలను జనసేన టార్గెట్ చేసిందా? వైఎస్ వివేకానంద‌రెడ్డి ఇంటిని పవన్ తన పార్టీ ఆఫీసుగా మార్చుకోనున్నారా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి. అసలు కడపలో ఏం జరుగుతోంది?


2025 ఏడాది వైసీపీకి కష్టాలు రెట్టింపు అవుతాయా? మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్‌కు ఇబ్బందులు తప్పవనే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి. వైసీపీ బలమైన పునాదులపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ గురి పెట్టినట్టు వార్తలు వస్తున్నాయి. కడపలో తనకు క్యాంపు కార్యాలయం ఏర్పాటు చేయాలని ఆలోచన చేస్తున్నారట.

కడప లేక పులివెందుల ఏది బెటరా? అనేదానిపై మంతనాలు సాగిస్తున్నారు డిప్యూటీ సీఎం. పులివెందుల అయితే సెంట్రరాఫ్ అట్రాక్షన్‌గా మారుతుందని అంటున్నారు. ఎందుకంటే వైఎస్ వివేకానంద ఇల్లు ఖాళీ ఉంది. అక్కడ క్యాంప్ ఆఫీసు పెడితే అన్నివిధాలుగా బాగుంటుందని పవన్ ఆలోచనగా పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దీనిపై వివేక కూతురుతో మంతనాలు జరుపుతున్నట్లు సమాచారం. వివేకా కేసును సీబీఐ విచారణ చేస్తోంది. తీర్పు వచ్చేవరకు వెయిట్ చేయాల్సిందే.


కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చి దాదాపు ఆరునెలలు గడిచింది. దాదాపు మూడుసార్లు కడప టూర్ వేశారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. తొలుత ‘పల్లె పండుగ’ కార్యక్రమాన్ని కడప జిల్లాలో ప్రారంభించారు. ఆ తర్వాత స్టూడెంట్స్-పేరెంట్స్ మీటింగ్ కూడా అక్కడే పెట్టారు. వైసీపీ నేతల దాడిలో గాయపడిన ఎంపీడీఓ అధికారిని పరామర్శ కోసం కడప వెళ్లారు.

ALSO READ: సంక్రాంతికి ఊర్లకు వెళ్లే వారికి ఏపీఎస్ ఆర్టీసీ తీపి కబురు.. ఇది తెలుసుకుంటే హాయిగా ప్రయాణించవచ్చు..

జరుగుతున్న పరిణామాలను గమనిస్తున్న నేతలు.. జనసేన టార్గెట్ ఇకపై కడప అని అంటున్నారు. ఎందుకంటే రాయలసీమ ప్రాంతం కడపలో మెగా అభిమానులు ఎక్కువగా ఉన్నారని గుర్తు చేస్తున్నారు. పనులు చేస్తూ ప్రజలను తనవైపు తిప్పుకోవాలన్నది జనసేన అధినేత ఆలోచనగా చెబుతున్నారు.

ఉమ్మడి కడపతోపాటు వైసీపీ ఓటు బ్యాంకు అధికంగా ఉండే ఏజెన్సీ ప్రాంతాలపై గురి‌పెట్టారు డిప్యూటీ సీఎం. పనులు చేస్తూ ప్రజలను తనవైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. విజయనగరం, విశాఖ, తూర్పుగోదావరి, నెల్లూరు, గుంటూరు జిల్లాల్లోని ఏజెన్సీ ప్రాంతాలు ఒకప్పుడు వైసీపీకి కంచుకోటగా ఉండేవి.

మొన్నటి ఎన్నికల్లో కూటమి సునామీకి ఆయా కోటలు బద్దలయ్యాయి. మిత్ర ధర్మ పాటిస్తూ టీడీపీ వీక్‌గా ఉన్న నియోజకవర్గాలపై జనసేన గురిపెట్టినట్టు తెలుస్తోంది. ఇక నుంచి ప్రతీ రెండు నెలలకొకసారి ఏజెన్సీ పర్యటనకు ప్లాన్ చేస్తున్నారట పవన్ కల్యాణ్. ఎంపీడీఓ ఘటనపై కడపలో మీడియాతో మాట్లాడిన డిప్యూటీ సీఎం పవన్, జరుగుతున్న దాడులపై కడప యువత మేల్కోవాలని పిలుపు నిచ్చారు.

అభిమానులేకాదు.. అధికారులు నావాళ్లేనని చెప్పారు పవన్. తన వాళ్లపై చెయ్యి వేస్తే తనపై వేసినట్టేనని భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు. అధికారం పోయినా కడపతోపాటు కొన్ని జిల్లాల్లో వైసీపీ ఆగడాలు ఏమాత్రం తగ్గలేదు. దాడులకు తెగబడుతున్న సందర్భాలు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో పరిస్థితులను తనకు అనుకూలంగా మార్చుకునే పనిలో పడ్డారట జనసేన అధినేత.

Related News

Chandrababu: మళ్లీ జన్మంటూ ఉంటే నాకు అక్కడ పుట్టాలని ఉంది -చంద్రబాబు

Jagan-Sharmila: అన్న పేరెత్తకుండా షర్మిల, చెల్లి పేరు లేకుండా జగన్ రక్షా బంధన్ ట్వీట్లు

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Tirumala devotees: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి పట్టే సమయం ఎంతంటే?

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

Big Stories

×