Australia vs India, 4th Test: టీమిండియా ( Team India ) వర్సెస్ ఆస్ట్రేలియా ( Australia ) మధ్య… బాక్సింగ్ డే టెస్ట్ జరుగుతున్న సంగతి తెలిసిందే. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024 లో భాగంగా… టీమ్ ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా ( Australia ) మధ్య నాలుగో టెస్ట్.. కొనసాగుతోంది. అయితే ఈ మ్యాచ్ లో టీమిండియా కు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. అందరూ అనుకున్నట్లుగానే టీమ్ ఇండియా టాపార్డర్ మళ్ళీ విఫలమైంది. నాలుగో టెస్ట్ మొదటి ఇన్నింగ్స్ లో తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి… ఆదుకున్నాడు.
Also Read: Pro Kabaddi League 2024 Final: ప్రో కబడ్డీ విన్నర్‌గా హరియాణా స్టీలర్స్…ఇదే తొలిసారి !
అయితే నితీష్ కుమార్ రెడ్డి ఆదుకున్న ఇన్నింగ్స్ ను ఇప్పుడు రెండో ఇన్నింగ్స్ లో కాపాడుకోలేకపోతోంది టీమిండియా టాపార్డర్. ఇవాళ ఉదయం రెండవ ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియా ఇప్పటికే మూడు వికెట్లు కోల్పోయింది. 26.1 ఓవర్లు ఆడిన టీమిండియా ( Team India ) … 33 పరుగులు చేసి మూడు వికెట్లు కోల్పోవడం జరిగింది. ఇవాళ చివరి రోజు కావడం గమనార్హం. ప్రస్తుతం లంచ్ బ్రేక్ ఇచ్చారు.
ఈ మ్యాచ్ లో టీమ్ ఇండియా ( Team India ) గెలువాలంటే మరో 307 పరుగులు చేయాలి. ఆఫ్ డే మాత్రమే మిగిలి ఉంది. ఇలాంటి నేపథ్యంలో మూడు వికెట్లు కోల్పోయిన టీమ్ ఇండియా కష్టాల్లో నెట్టివేయబడింది. హిట్టింగ్ ఆడితే మిగతా వికెట్లు కూడా టపటప రాలిపోతాయి. టీమిండియా కీలక బ్యాటర్లు…. త్వరగా అవుట్ కాకుండా ఇన్నింగ్స్ చక్క దిద్దితే సరిపోయేది. కానీ టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ( Rohit Sharma)… మరోసారి విఫలం అయ్యాడు.
40 బంతులు ఆడిన రోహిత్ శర్మ… 9 పరుగులకు అవుట్ అయ్యాడు. ఆ తొమ్మిది పరుగులు చేయడానికి నాన కష్టాలు పడ్డాడు రోహిత్ శర్మ. ఇక మొన్నటి వరకు మెరిసిన కేఎల్ రాహుల్ ( KL rahul )… ఇవాల్టి రెండో ఇన్నింగ్స్ లో డక్ అవుట్ అయ్యాడు. అతన్ని.. ఓపెనర్ గా పంపించాల్సింది పోయి మొదటి డౌన్లోడ్.. పంపించి రోహిత్ శర్మ పెద్ద మిస్టేక్ చేశాడు. దీంతో.. రాహుల్ పరుగులు ఏమి చేయకుండా అవుట్ అయ్యాడు.
Also Read: T20 Player of the year: టీ-20 ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు.. నామినేట్ అయింది వీరే.. బుమ్రా కు షాక్ !
అటు విరాట్ కోహ్లీ పైన అందరూ ఆశలు పెట్టుకున్నారు. అతగాడు కూడా పెద్దగా ఆడలేదు. ఎప్పటిలాగే రెగ్యులర్ బ్యాటింగ్.. చేసి… మిచేల్ స్టార్క్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు విరాట్ కోహ్లీ ( Virat Kohli). దీంతో మూడు వికెట్లు కోల్పోయింది టీమిండియా. ప్రస్తుతం… టీమిండియా యువ బ్యాటర్ యశస్వి జైస్వాల్ బ్యాటింగ్ చేస్తున్నాడు. 83 బంతులు ఆడిన యశస్వి జైస్వాల్ 14 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. ఇక తర్వాత రిషబ్ పంత్ బ్యాటింగ్ చేసే ఛాన్స్ ఉంది.
ఇక అంతకుముందు రెండవ ఇన్నింగ్స్ లో… 234 పరుగులు చేసి ఆల్ అవుట్ అయింది ఆస్ట్రేలియా. దీంతో 340 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా ముందు ఉంచింది. ఈ మ్యాచ్ లో గెలవడం ఆస్ట్రేలియాకు అలాగే టీమ్ ఇండియాకు చాలా కీలకం. ఇందులో గెలిచిన జట్టు కచ్చితంగా డబ్ల్యూటిసి ఫైనల్ కు వెళ్లే ఛాన్స్ ఉంటుంది. డ్రా అయితే… ఫలితాలు వేరే ఉంటాయి.