BigTV English

Pawan counter on Ambati Rambabu: బ్రో ఇష్యూపై పవన్ రియాక్షన్.. వినుకో అంబటి..

Pawan counter on Ambati Rambabu: బ్రో ఇష్యూపై పవన్ రియాక్షన్.. వినుకో అంబటి..
Pawan Kalyan on Ambati Rambabu comments

Pawan Kalyan on Ambati Rambabu comments(AP politics):

కొన్నిరోజులుగా బ్రో రచ్చ నడుస్తోంది. రాంబాబు వర్సెస్ శ్యాంబాబు ఎపిసోడ్ హాట్ హాట్‌గా సాగుతోంది. తననే టార్గెట్ చేశారంటూ మంత్రి అంబటి రాంబాబు మీడియాకెక్కారు. పవన్‌పైనా తాను సినిమా తీస్తానంటూ కొన్ని టైటిల్స్ వదిలారు. అక్కడితో వదిలిపెట్టకుండా.. సినిమా పేరుతో పవన్ కల్యాణ్‌కు టీడీపీ నుంచి ప్యాకేజీ అందుతోందంటూ రాజకీయంగా కలకలం రేపారు. బ్రో నిర్మాత టీజీ విశ్వప్రసాద్‌కు విదేశాల నుంచి నిధులు ఇస్తున్నది చంద్రబాబు ముఠానే అంటూ.. ఆ ఫారిన్ ఫండ్స్‌పై విచారణ జరిపించాలంటూ.. ఈడీకి ఫిర్యాదు చేసేందుకు ఢిల్లీకి కూడా వెళ్లారు అంబటి రాంబాబు.


అంబటి ఇంతగా హల్‌చల్ చేస్తున్నా పవన్ కల్యాణ్ మాత్రం ఇప్పటి వరకూ స్పందించలేదు. తాజాగా మంగళగిరి కార్యాలయంలో పార్టీ ముఖ్యనేతలతో మాట్లాడుతూ.. బ్రో ఇష్యూపై రియాక్ట్ అయ్యారు.

సినిమా, రాజకీయాల్ని కలపొద్దని పవన్ సూచించారు. చర్చను పక్కదారి పట్టించే వాళ్లతో జాగ్రత్తగా ఉండాలని అన్నారు. వైసీపీ వాళ్ల స్థాయికి దిగజారి చర్చలో పాల్గొనవద్దని శ్రేణులకు సూచించారు. తనకు సినిమాలు కేవలం ఇంధనం మాత్రమేనని.. రిలీజ్‌ ఫంక్షన్‌తోనే సినిమా గురించి వదిలేశానన్నారు జనసేనాని.


Related News

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Tirumala devotees: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి పట్టే సమయం ఎంతంటే?

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Big Stories

×