E-Paper
Advertisement

Pawan secreat meeting: అలర్టయిన పవన్.. నేతలతో సీక్రెట్‌ భేటీ, ఏం జరిగింది?

Pawan secreat meeting: అలర్టయిన పవన్.. నేతలతో సీక్రెట్‌ భేటీ, ఏం జరిగింది?
Advertisement

Pawan secreat meeting: ఏపీలో బుజ్జగింపు రాజకీయాలు షురూ అయ్యాయి. మరో ఐదారు రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుంది. దీంతో టికెట్ రాని నేతలు పక్క పార్టీల వైపు చూస్తున్నారు. అది ఏ ఒక్క పార్టీకో పరిమితం కాలేదు. అధికార వైసీపీ, విపక్ష టీడీపీ, జనసేన నేతలు వలసబాట పడుతున్నారు.

తాజాగా జనసేనలో టికెట్లు ఆశించిన పలువురు నేతలు ఆ పార్టీని వీడుతున్నారు. పరిస్థితి గమనించిన పవన్ కల్యాణ్ మంగళగిరికి వెళ్లారు. పార్టీలో ఉన్న నేతలను పార్టీ ఆఫీసుకు రావాలని పిలుపు ఇచ్చారు. దీంతో అక్కడికి చేరుకున్న నేతలతో పవన్ కల్యాణ్ అంతర్గత సమావేశం నిర్వహించన్నారు.

Advertisement

ఇప్పటికే అసంతృప్తితో ఉన్న పలువురు నేతలకు నియోజకవర్గాల ఇన్‌ఛార్జ్ బాధ్యతలు అప్పగించారు పవన్ కల్యాణ్. మరికొందరు ఇప్పటికే పార్టీకి గుడ్ బై చెప్పేశారు. ఇంకొందరు పక్కచూపులు చూస్తున్నారు. దీంతో అప్రమత్తమైన పవన్, అంతర్గత సమావేశాన్ని ఏర్పాటు చేసినట్టు సమాచారం. మరి ఈ సమావేశంలో ఏం జరుగుతుందో చూడాలి. విజయవాడ నుంచి పోతిన మహేష్ జనసేనకు గుడ్ బై చెప్పేయడం, వైసీపీ తీర్థం పుచ్చుకోవడం జరిగింది. ఆయన బాటలో మరికొందరు నేతలు ఉన్నట్లు అధినేతకు సమాచారం అందింది. వెంటనే మంగళగిరికి చేరుకున్నారు.

Related News

అనితకు క్షమాపణ చెప్పేది లేదు.. గుంటూరులో అంబటి రాంబాబు హాట్ కామెంట్స్!

రూ.1000 కోట్ల ఆస్తి.. వేలాది కుటుంబాల ఇళ్ల కల నెరవేర్చిన మంత్రి లోకేశ్

ఆంధ్రప్రదేశ్‌కి దక్కిన అరుదైన గౌరవం.. బెస్ట్ వెడ్డింగ్ డెస్టినేషన్‌గా ఏపీకి అంతర్జాతీయ అవార్డు

ఈసారి దక్షిణాది వంతు.. అల్పపీడనం సంకేతాలు, వారం పాటు వర్షాలు కుమ్ముడే కుమ్ముడు

మాజా డ్రింక్‌లో పురుగు.. నాలుగేళ్ల బాలుడికి తప్పిన ప్రమాదం, వీడియో వైరల్..!

తెలంగాణలో దంచికొడుతున్న వానలు.. రేపు ఆ 11 జిల్లాలకు భారీ వర్ష సూచన!

కేంద్రంపై ఒత్తిడి తేవాల్సిందే.. సీఎం చంద్రబాబుకు వైఎస్ షర్మిల 2 పేజీల లేఖ!

Registration Centres: ఏపీ రిజిస్ట్రేషన్ శాఖలో కీలక సంస్కరణలు.. RSK పేరుతో సేవలు..!

Big Stories

Advertisement
×