Pawan kalyan: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ రేపో మాపో సింగపూర్‌కు వెళ్తున్నారు. ఆయన చిన్న కొడుకు మార్క్ శంకర్ సింగపూర్‌లో జరిగిన ఓ అగ్నిప్రమాదంలో గాయపడ్డాడు. శంకర్ చదువుతున్న పాఠశాలలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. శంకర్ కాళ్లు, చేతులకు గాయాలయ్యాయి. ప్రస్తుతం ఓ ఆసుపత్రిలో ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నాడు.
అడవి తల్లి బాట కార్యక్రమంలో భాగంగా రెండురోజులపాటు ఉమ్మడి విశాఖ జిల్లా ఏజెన్సీ ప్రాంతాల్లో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పర్యటిస్తున్నారు. మార్క్ శంకర్ ఘటన విషయం తెలియగానే పర్యటన ఆపాలని అధినేత పవన్‌కు నేతలు సూచన చేశారు. అరకు సమీపంలోని కురిడి గ్రామం సందర్శిస్తానని అక్కడి గిరిజనులకు మాట ఇచ్చానని అన్నారట.
అన్న మాట ప్రకారం ఆ గ్రామానికి వెళ్ళి వారితో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకుంటానని స్పష్టం చేశారు పవన్ కల్యాణ్. అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనకు ఏర్పాట్లు చేశారని, ఇప్పుడు అర్థాంతరంగా వెల్లడం కష్టమని, పూర్తి చేసిన తర్వాత వెళ్తానని నాయకులకు చెప్పారు. ఈ విషయంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
మరోవైపు మార్క్ శంకర్‌కు ఘటన గురించి తెలియగానే కుటుంబసభ్యులు కంగారుపడ్డారు. ఏజెన్సీ పర్యటన ముగిసిన తర్వాత పవన్ దంపతులు సింగపూర్‌కు వెళ్లనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. మార్క్ శంకర్ చదువుతున్న పాఠశాలలో సోమవారం అనుకోకుండా అగ్నిప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది.
ALSO READ: పదో తరగతి విద్యార్థులకు అలర్ట్
అక్కడ సిబ్బంది సకాలంలో స్పందించడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదంలో శంకర్ చేతులు, కాళ్ళకు గాయాలయ్యాయి. ఊపిరితిత్తుల్లోకి పొగ వెళ్లడంతో ఇబ్బందులకు లోనయ్యాడని తెలుస్తోంది. ప్రస్తుతం మార్క్ శంకర్ ఆసుపత్రిలో కోలుకున్నట్లు పాఠశాల వర్గాలు తెలిపాయి. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.
సింగపూర్ లోని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు చదువుతున్న స్కూల్ లో అగ్ని ప్రమాదం
ప్రమాదంలో పవన్ కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ చేతులు, కాళ్లకు గాయాలు
మార్క్ శంకర్ కు ఆసుపత్రిలో కొనసాగుతున్న చికిత్స
మన్యం పర్యటన ముగించుకొని సింగపూర్ వెళ్లనున్న డిప్యూటీ సీఎం పవన్… https://t.co/WmG4MofVKi pic.twitter.com/h3iseajD2u
— BIG TV Breaking News (@bigtvtelugu) April 8, 2025