Pawan Kalyan:..టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఒకవైపు సినిమాలు, మరొకవైపు రాజకీయంగా దూసుకుపోతున్న విషయం తెలిసిందే. 2024 సార్వత్రిక ఎన్నికలలో పోటీ చేసి మరీ ఆంధ్రప్రదేశ్ కి డిప్యూటీ సీఎం గా బాధ్యతలు చేపట్టారు. ఒకవైపు వ్యక్తిగత జీవితం, మరొకవైపు వృత్తిపరమైన జీవితాన్ని కొనసాగిస్తూ బిజీగా మారిన ఈయనకు.. తాజాగా షాక్ తగిలింది. అసలు విషయంలోకెళితే పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు అగ్నిప్రమాదంలో చిక్కుకోవడంతో కాళ్లకు, చేతులకు గాయాలైనట్లు సమాచారం. అసలు విషయంలోకి వెళ్తే సింగపూర్లో జరిగిన అగ్నిప్రమాదంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ (Mark Shankar) కి గాయాలయ్యాయి. స్కూల్లో జరిగిన ఈ అగ్ని ప్రమాదం కారణంగా ఆ చిన్నారి కాళ్ళకు, చేతులకు గాయాలైనట్లు తెలుస్తోంది. ఈ విషయం గురించి తెలుసుకున్న పవన్ కళ్యాణ్ హుటాహుటిన అల్లూరి పర్యటన ముగించుకొని.. వెంటనే సింగపూర్ కి వెళ్ళనున్నారు. ప్రస్తుతం ఈ విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
హుటాహుటిన హాస్పిటల్ కు తరలించిన బృందం..
ఇకపోతే సింగపూర్ లో మార్క్ శంకర్ చదువుకుంటున్న స్కూల్లో చోటు చేసుకున్న ఈ అగ్ని ప్రమాదంలో మార్క్ శంకర్ కాళ్లు చేతులకు గాయాలయ్యాయి. అలాగే ఊపిరితిత్తుల్లోకి పొగ వెళ్లడంతో ఇబ్బందులకు లోనయ్యాడు. దీంతో వెంటనే మార్క్ శంకర్ను హుటాహుటిన ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు.
అల్లూరి పర్యటన తర్వాత సింగపూర్ బయలుదేరనున్న పవన్ కళ్యాణ్..
ఇకపోతే కొడుకుకి ఇలా జరిగిందని తెలిసిన వెంటనే సింగపూర్ కి బయలుదేరాల్సిన పవన్ కళ్యాణ్.. ఆగిపోయారు. “అరకు సమీపంలోని కురిడి గ్రామం సందర్శిస్తానని, ఆ గ్రామ గిరిజనులకు నిన్న మాట ఇచ్చానని కాబట్టి, ఆ గ్రామం వెళ్లి వారితో మాట్లాడి, అక్కడి సమస్యలను తెలుసుకుంటానని, అలాగే అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభానికి ఏర్పాటు చేసినందున వాటిని పూర్తి చేసి వెళ్తానని” అక్కడ అధికారులతో తెలిపారు. అయితే అధికారులు, నాయకులు మాత్రం పర్యటన నిలుపుదల చేసి వెంటనే సింగపూర్ కి వెళ్లిపొమ్మని సూచించినా.. మన్యం లో పర్యటన ముగించుకొని ఆ తర్వాతే బయలుదేరుతానని చెప్పారట. ఇక మన్యం నుంచి విశాఖ ఏర్పాటుకు వెళ్లి అక్కడ నుంచి సింగపూర్ వెళ్లేందుకు నాయకులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.
మార్క్ శంకర్..
పవన్ కళ్యాణ్, అన్నా లెజినోవా దంపతుల కుమారుడే మార్క్ శంకర్ పవనోవిచ్. ప్రస్తుతం మార్క్ శంకర్ తల్లితోపాటు సింగపూర్లో ఉంటున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు సడన్ గా ఇలాంటి ప్రమాదం చోటు చేసుకోవడంతో పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ అగ్ని ప్రమాదంలో ఆ చిన్నారి ఎంతగా ఇబ్బంది పడుతున్నారో అంటూ తమ బాధను వ్యక్తపరుస్తున్నారు.
స్కూల్లో అగ్ని ప్రమాదంలో చిక్కుకున్న శ్రీ @PawanKalyan గారి చిన్న కుమారుడు మార్క్ శంకర్
•చేతులు, కాళ్ళకు గాయాలు… ఆసుపత్రిలో చికిత్స
•మన్యంలో పర్యటన ముగిసిన తరవాత శ్రీ పవన్ కల్యాణ్ గారు సింగపూర్ పయనం
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కల్యాణ్ గారి చిన్న కుమారుడు మార్క్…
— JanaSena Party (@JanaSenaParty) April 8, 2025