Janasena Youth Leader Suspends: కూటమి అధికారంలోకి రావడంతో జనసేన కార్యకర్తలు మాంచి స్పీడు మీదున్నారా? పార్టీలు, పుట్టిన రోజులంటూ సెలబ్రేషన్స్‌లో నిమగ్నమయ్యారా? రికార్డింగ్ డ్యాన్సులకు శ్రీకారం చుట్టారా? బావలూ సయ్యా అంటూ దారుణంగా డ్యాన్సులు చేయించారా? ఈ వ్యవహరం బయటకు పొక్కడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. చివరకు పార్టీ సైతం ఆ నాయకుడిపై వేటు వేసింది.
ఏలూరు జిల్లా నిడమర్రు మండలం బావలయ్య పాలెంలో బావలు సయ్యా అనే కార్యక్రమానికి వేదికైంది. ఉంగుటూరు నియోజకవర్గం నిడమర్రు మండలం జనసేన పార్టీ అధ్యక్షుడు వాకమూడి ఇంద్ర తన పుట్టిన రోజు సందర్భంగా కార్యకర్తలు, అభిమానులను ఉత్సాహపరిచేలా చిన్న పార్టీ ఇచ్చేశాడు. విందు, మందుతో మజా ఉండదని భావించాడు. క్రొవ్విడి శివారులోని ఓ రైస్ మిల్లులో అశ్లీల నృత్యాలు (రేవ్ పార్టీ) నిర్వహించాడు.
పార్టీలో అశ్లీల నృత్యాలు వ్యవహారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీనిపై పార్టీలో ఇంటా బయటా విమర్శలు వెల్లువెత్తాయి . పరిస్థితి గమనించిన జనసేన హైకమాండ్, వాకమూడి ఇంద్రను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది.
కొత్తగా మండల అధ్యక్షుడిగా నిమ్మల దొరబాబుని ప్రకటించింది. ఒక్కమాటలో చెప్పాలంటే పార్టీలో నేతలకు జనసేన హెచ్చరిక ఇచ్చిందనే చెప్పాలి. రేపటి రోజున ఎవరైనా ఈ తరహా కార్యక్రమాలు చేస్తే వేటు తప్పదనే సంకేతాలు ముందుగానే పంపించినట్లైంది. ఆరోపణలు రావడంతో గతంలో జానీ మాస్టర్‌పై జనసేన వేటు వేసిన విషయం తెల్సిందే.
ALSO READ: షర్మిలపై ఫోకస్.. జగన్‌తో శైలజానాథ్ మంతనాలు
పార్టీ వేటు తర్వాత పోలీసులు రంగంలోకి దిగడం, ఆపై కేసు నమోదు చేయడం చకచకా జరిగిపోయింది. మొత్తం 17 మందని పోలీసులు అరెస్ట్ చేసినట్టు సమాచారం. ఇతర ప్రాంతాల నుంచి హిజ్రాలు తీసుకొచ్చి మద్యం తాగించి ఆపై డ్యాన్సులు వేయించినట్టు తెలుస్తోంది.