Bigg Boss Gautam: బిగ్ బాస్ సీజన్ 8లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వచ్చాడు గౌతమ్. మామూలుగా ఏ బిగ్ బాస్ సీజన్‌లో కూడా వైల్డ్ కార్డ్ ఎంట్రీలు విన్ అవ్వలేదు. అలాగే గౌతమ్ కూడా విన్నర్ అవ్వడానికి ఒక్క అడుగు దూరంలోనే ఆగిపోయాడు. అయినా కూడా చాలామందికి నిఖిల్ కంటే గౌతమ్ గెలిస్తేనే బాగుండేది అన్న ఫీలింగ్ వచ్చింది. అందుకే సోషల్ మీడియాలో చాలావరకు పీపుల్స్ విన్నర్ గౌతమ్ అంటూ కామెంట్స్ కనిపిస్తున్నాయి. తాజాగా బిగ్ టీవీ ఇంటర్వ్యూలో పాల్గొన్న గౌతమ్.. బిగ్ బాస్ సీజన్ 7,8 మధ్య ఉన్న వ్యత్యాసాల గురించి.. తన పర్సనల్, ప్రొఫెషనల్ లైఫ్ గురించి ఎన్నో విషయాలు పంచుకున్నాడు. అలాగే యష్మీతో లవ్ ట్రాక్ గురించి కూడా మాట్లాడాడు.
అందుకే ఆడలేదు
ముందుగా బిగ్ బాస్ సీజన్ 8లో తనకు అవకాశం రాగానే చాలా కన్ఫ్యూజన్‌లో పడిపోయానని, అసలు ఒప్పుకోవాలో వద్దో తెలియక ఆలోచనలో పడిపోయానని చెప్పుకొచ్చాడు గౌతమ్. తన తండ్రికి బిగ్ బాస్‌కు మళ్లీ వెళ్లడం ఇష్టం లేదు కాబట్టే హౌస్‌లోకి వెళ్లే రెండు రోజుల ముందుకు వరకు తనతో మాట్లాడలేదని బయటపెట్టాడు. అయినా గౌతమ్ టాప్ 5 కంటెస్టెంట్స్‌లో ఒక్కడిగా ఉన్నప్పుడు తను బిగ్ బాస్‌కు రావడం కరెక్టే అని స్వయంగా తన తండ్రే అన్నారు. తన తండ్రితో మాట్లాడకుండా హౌస్‌లోకి అడుగుపెట్టాడు కాబట్టి రెండు వారాల పాటు సరిగా ఆడలేకపోయానని, మూడో వారం నుండే తన ఆట మొదలయ్యిందని తెలిపాడు. తనకు సపోర్ట్ చేసిన అందరికీ ప్రత్యేకంగా థాంక్స్ చెప్పుకున్నాడు.
Also Read: మెగా ఫ్యామిలీని కలవబోతున్న గౌతమ్.. మెగా మూవీలో ఛాన్స్..
ఫ్యాన్స్ సపోర్ట్
బిగ్ బాస్ 8 కంటెస్టెంట్స్ అందరిలో ముఖ్యంగా గౌతమ్‌కు మెగా ఫ్యాన్స్ నుండి విపరీతమైన సపోర్ట్ లభించింది. దానిపై గౌతమ్ స్పందించాడు. నిజంగానే తనకు మెగా ఫ్యాన్స్ బాగా సపోర్ట్ చేశారని, వారందరికీ థాంక్స్ చెప్పుకున్నాడు. తను రామ్ చరణ్, పవన్ కళ్యాణ్‌కు వీరాభిమానిని అని చెప్పుకొచ్చాడు. పవన్ కళ్యాణ్ తనకు దేవుడితో సమానమని, ఆయన ఆలోచనలు చాలా నచ్చుతాయని తెలిపాడు. వారితో పాటు అసలు తను ఎవరో తెలియని చాలామంది కూడా తనకు సోషల్ మీడియా ద్వారా సపోర్ట్ చేశారని అందరికీ ధన్యవాదాలు తెలిపాడు. ఇక తన తరువాతి సినిమా ‘సోలో బాయ్’కు కావాల్సిన ప్రమోషన్ అంతా బిగ్ బాస్ హౌస్‌లోని జరిగిందని సంతోషం వ్యక్తం చేశాడు.
అలా చేయను
బిగ్ బాస్ 8లోకి వచ్చిన తర్వాత గౌతమ్ ఎక్కువగా సోలో గేమే ఆడాడు. అందుకే ప్రేక్షకులు తనను గెలిపిస్తారని కలలు కూడా కన్నాడట. కానీ అలా జరగలేదు. ఇక హౌస్‌లో ఎవ్వరితో కలవకపోవడంపై కూడా స్పందించాడు గౌతమ్. ఫ్రెండ్స్‌గా దగ్గరయితే ఎలాంటి పరిస్థితుల్లో అయినా వారికి సపోర్ట్ చేయాలని కానీ తను ఎవరు అర్హులో వారికి మాత్రమే సపోర్ట్ చేశానని అన్నాడు. యష్మీతో రెండు వారాల పాటు రిలేషన్ బాగానే కొనసాగినా ఆ తర్వాత విభేదాలు రావడం వల్ల దూరమయిపోయానని బయటపెట్టాడు. గత సీజన్‌లో కొందరు కంటెస్టెంట్స్‌తో తాను సన్నిహితంగా ఉన్నా కూడా వారు తనకు సపోర్ట్ చేయడానికి ముందు రాలేదని, వారు ఎవరో పేర్లు మాత్రం చెప్పనని అనేశాడు గౌతమ్.