Samantha Vs Shobhita:అక్కినేని వారసుడు అక్కినేని నాగచైతన్య(Naga Chaitanya)సినిమాల కంటే కూడా ఎక్కువగా వ్యక్తిగత విషయాల ద్వారానే వార్తల్లో నిలిచారు. ‘ఏ మాయ చేసావే’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన హీరోయిన్ సమంత(Samantha) ను ఏడేళ్ల పాటు ప్రేమించి, ఆ తర్వాత పెద్దల అంగీకారంతో వివాహం చేసుకున్నారు. 2017 లో వివాహం చేసుకున్న నాగచైతన్య, 2021 అక్టోబర్ 2న తన భార్యకు విడాకులు ఇస్తున్నట్లు ప్రకటించి, అందరినీ ఆశ్చర్యపరిచారు. ఇక అప్పట్నుంచి నాగచైతన్య ఏం చేసినా సరే వార్తల్లో నిలుస్తున్నారని చెప్పవచ్చు. ఇదిలా ఉండగా నాగచైతన్య.. సమంత నుంచి విడిపోయిన తర్వాత మరుసటి ఏడాది ప్రముఖ హీరోయిన్ శోభిత ధూళిపాళ్ల (Shobhita dhulipala)తో ప్రేమలో పడ్డారు. ఆమెతో కలిసి వెకేషన్స్ కి కూడా వెళ్లారు నాగచైతన్య. ఇక శోభితతో డేటింగ్ చేస్తున్నారంటూ వార్తలు వినిపించినా..ఈ వార్తలను వారు కొట్టిపారేసే ప్రయత్నం చేయలేదు. కానీ ఈ ఏడాది ఆగస్టు 8న నిశ్చితార్థం చేసుకొని అందరిని ఆశ్చర్యపరిచారు. అలాగే డిసెంబర్ 4వ తేదీన వివాహం చేసుకొని కొత్త బంధంలోకి అడుగు పెట్టారు నాగచైతన్య – శోభిత. ఇక నాగచైతన్య శోభితను వివాహం చేసుకోవడంతో అటు సమంతకు సంబంధించిన విషయాలను వైరల్ చేస్తున్నారు. అంతేకాదు సమంతను, శోభితాను పలు విషయాలలో
కంపేర్ చేస్తూ వార్తలు వైరల్ చేస్తూ ఉండడం గమనార్హం..
సమంత ఆస్తి విలువ..
ఈ క్రమంలోనే శోభిత ధూళిపాళ్ల , సమంత ఆస్తులను కూడా కంపేర్ చేస్తూ ఎవరికి ఎక్కువ ఆస్తులున్నాయి అనే విషయాన్ని కూడా తెలుసుకోవడానికి అభిమానులు తెగ ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. మరి ఆస్తి పరంగా ఇద్దరిలో ఎవరికి ఎంత ఆస్తి ఉందో ఇప్పుడు ఒకసారి చూద్దాం. అసలు విషయంలోకి వెళితే.. గత 15 సంవత్సరాలుగా సమంత సినిమాలలో నటిస్తున్నారు. ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలు, ఆమె ఖాతాలో వచ్చి పడ్డాయి. ఇప్పుడు సమంత ఆస్తులు విలువ సుమారుగా రూ.100 కోట్ల వరకు ఉంటుందని సమాచారం. ఒకవైపు సినిమాలే కాకుండా మరొకవైపు వెబ్ సిరీస్ లు, పలు యాడ్స్ కూడా చేస్తోంది. వీటితో పాటు సఖి అనే క్లాతింగ్ బ్రాండ్, ఎం స్కూల్ కూడా ఆమె రన్ చేస్తున్నారు. ఇక సౌత్ లోనే కాకుండా నార్త్ లో కూడా భారీ పాపులారిటీ సొంతం చేస్తున్నారు సమంత.
శోభిత ఆస్తి విలువ..
ఇక శోభిత విషయానికి వస్తే.. శోభిత ధూళిపాళ్ల గత 8 సంవత్సరాలుగా ఇండస్ట్రీలో కొనసాగుతోంది. శోభిత తెలుగు అమ్మాయి అయినప్పటికీ బాలీవుడ్లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. అక్కడ బాలీవుడ్లో సినిమాలు చేస్తూ ప్రేక్షకులను మెప్పించిన ఈమె ఇప్పుడు నాగచైతన్య ద్వారా టాలీవుడ్ లో భారీ పాపులారిటీ అందుకుంది. ఇకపోతే ఎనిమిదేళ్లుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న ఈమె ఆస్తి విలువ రూ.15 కోట్ల వరకు ఉంటుందని సమాచారం. కానీ నాగచైతన్య ఆస్తులు కలుపుకుంటే వేలకోట్లు ఈమె సొంతం అనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇకపోతే అక్కినేని నాగార్జున(Akkineni Nagarjuna) సినీ ఇండస్ట్రీలోనే అత్యంత ధనవంత హీరోగా పేరు దక్కించుకున్నారు. ఆయన ఆస్తి విలువ రూ.2500 కోట్ల పై మాటే.. మరి ఆ ఆస్తిని నాగర్జున ఇద్దరు కొడుకులకు సమానంగా పంచినా.. ఒక్కొక్కరికి రూ.1250 కోట్లకు పైగా ఆస్తులు లభిస్తాయి అని.. దీన్ని బట్టి చూస్తే నాగచైతన్య ఆస్తి శోభిత కు వర్తిస్తుంది కాబట్టి సమంత కంటే శోభిత ఆస్తి ఎక్కువ అని నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.