Big Stories

AP Elections 2024: ఏపీలో నేటితో ముగియనున్న పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్.. రికార్డు స్థాయిలో పోలింగ్!

Postal Ballot Voting in Andhra Pradesh: పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌. ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులకు ఇచ్చే ఆప్షన్‌. పోలింగ్‌ నాడు డ్యూటీల్లో ఉంటారు కాబట్టి ముందుగానే వారు ఓటును వేసే అవకాశం ఉంటుంది. అయితే ఈ సారి ఏపీలో ఎక్కువ సంఖ్యలో ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ కు దరఖాస్తు చేసుకున్నారు. అందుకు అనుగుణంగా.. గురువారం (మే 9) వరకూ పోస్టల్‌ బ్యాలెట్‌ ఎన్నికల్లో రికార్డు స్థాయిలో పోలింగ్‌ జరిగింది. ఎంతలా అంటే గతేడాదితో పోలిస్తే డబుల్‌ అయిందని తెలుస్తోంది. అంటే ఆ రేంజ్‌ లో పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌ జరగడం ఎవరికీ ప్లస్‌.. ఎవరికీ మైనస్‌ అనే చర్చ మొదలైంది.

- Advertisement -

రికార్డు స్థాయిలో పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌ జరగడం అంటే.. ప్రభుత్వ ఉద్యోగులు ప్రస్తుత జగన్‌ సర్కార్‌కు వ్యతిరేకంగా ఉన్నారా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే అధికార వైసీపీ మాత్రం సచివాలయ ఉద్యోగులు తమ వెంటే ఉంటారని భావిస్తున్నారు. ఎందుకంటే ఆ పోస్టు క్రియేట్‌ చేసి ఉద్యోగాలు కల్పించింది తామే అనే ధీమాలో వైసీపీ ఉంది.

- Advertisement -

పోస్టల్‌ బ్యాలెట్‌ ఎన్నికల ప్రక్రియలో ఉద్యోగులు ఇబ్బందిపడ్డారు. తమ ఓటు ఎక్కడ ఉందో తెలుసుకునేందుకు ఉద్యోగులు పోలింగ్ కేంద్రాల చుట్టూ ఎండలో తిరగాల్సిన పరిస్థితి నెలకొంది. విసుగు చెందిన ఓటర్లు, ఓటుహక్కు వినియోగించుకోకుండానే వెనుదిరిగారు. అటు పోలింగ్ కేంద్రాల్లో సౌకర్యాలు కల్పించలేదని ఉద్యోగులు మండిపడ్డారు.

Also Read: అప్పుడు కోడికత్తి డ్రామా.. ఇప్పుడు గులకరాయి డ్రామా..

చాలామందికి ఓట్లు లేవని చెప్పడంతో ఉద్యోగులు నిరాశగా వెనుదిరిగారు. తాము పనిచేసే చోటే పోస్టల్‌ బ్యాలట్ ఓటు ఉంటుందని కొంతమంది, తమ నివాసం ఉన్నచోట పోస్టల్‌ బ్యాలెట్‌ ఇస్తారని మరికొంతమంది అధికారులు చెప్పడంతో ఉద్యోగులు గందరగోళానికి గురయ్యారు. చాలాదూరం నుంచి వచ్చిన ఉద్యోగులు ఎండలో తిరిగివెళ్లలేక ఇబ్బందిపడ్డారు. ఎక్కడికి వెళ్లాలో తెలియక సతమతమయ్యారు. ఇక ఇవాళ భద్రతా విధుల్లో ఉన్న ఉద్యోగులకు మాత్రం ఓటుహక్కు వినియోగించుకున్నారు.

2019లో జరిగిన పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌ సరళిని పరిశీలిద్దాం. అప్పుడు 77 శాతం పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌ జరిగింది. అందులో వైసీపీకి లక్షా 34వేల ఓట్లు, 80 వేల ఓట్లు టీడీపీకి, 11వేల ఓట్లు జనసేనకు, 4వేల ఓట్లు బీజేపీకి పోల్‌ అయ్యాయి. మొత్తంగా 90శాతానికి పైగా ఉద్యోగులు అయితే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News