Big Stories

Loan App Blackmail: ప్రాణం తీసిన క్విక్ క్యాష్.. మార్ఫింగ్ ఫొటోలతో టార్చర్!

Online Loan App Blackmail: పోలీసులు ఎన్ని చర్యలు తీసుకున్నా, ఎన్ని లోన్ యాప్ లపై ఆంక్షలు విధించినా ఇంకా కొన్ని యాప్ లు కస్టమర్ల నుంచి డబ్బుల్ని రక్తం పిండి మరీ వసూలు చేస్తున్నాయి. తీసుకున్న లోన్ కంటే రెండింతలు చెల్లించినా.. ఇంకా చెల్లించాలని వేధిస్తున్నాయి. తాజాగా తమిళనాడులోని పుదుపేట్టైకి చెదిన ఒక వ్యక్తి ఆన్ లైన్ లోన్ యాప్ వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకున్నాడు.

- Advertisement -

గోపీనాథ్.. ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. వ్యక్తిగత అవసరాల నిమిత్తం ఆన్ లైన్ లో లోన్ తీసుకున్న గోపీనాథ్.. తిరిగి అసలును వడ్డీతో సహా చెల్లించాడు. తీసుకున్న అప్పు మొత్తాన్నీ చెల్లించినా ఇంకా చెల్లించాలని గోపీనాథ్ కు వేధింపులు మొదలయ్యాయి. చెల్లించకపోతే.. మార్ఫింగ్ ఫొటోలను, వీడియోలను అతని కాంటాక్ట్స్ లిస్ట్ లో ఉన్నవారందరికీ పంపుతామని బ్లాక్ మెయిలింగ్ కు పాల్పడ్డారు క్విక్ క్యాష్ ప్రతినిధులు. మనస్తాపానికి గురైన గోపీనాథ్.. గదిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

- Advertisement -

గోపీనాథ్ మరణానికి ముందు అతని తల్లిని ఉద్దేశిస్తూ ఒక లెటర్ రాశాడు. “మిస్ యూ అమ్మా అప్పా, బై. నేను బయలుదేరుతున్నాను. సెంథిల్ అన్న నిన్ను చూసుకుంటాడు. డబ్బు సమస్య కారణంగా నేను వెళ్లిపోక తప్పడం లేదు. క్విక్ క్యాష్ యాప్ నా ఫొటోలను అసభ్యంగా మార్చి అందరికీ పంపింది. ఆ అవమానాన్ని భరించలేను. కాబట్టి నేను వెళ్లిపోతున్నా. ” అని గోపీనాథ్ ఆ లెటర్ లో రాశాడు.

Also Read: కేరళలో అంబులెన్స్- కారు ఢీ .. ముగ్గురు మృతి

అతని స్నేహితుడు మణి.. గోపీనాథ్ బలవన్మరణంపై ఆందోళన వ్యక్తం చేశాడు. లోన్ యాప్ వేధింపులు గురించి తమకు చెప్పాడని, దానిపై పోలీసులకు కంప్లైంట్ ఇద్దామని కూడా నిర్ణయించుకున్నామన్నాడు. ఇంతలోనే అతను ఉరివేసుకున్నాడని ఆవేదన చెందాడు. పోలీసులు గోపీనాథ్ మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించి.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News