PDS Rice Missing Case: రేషన్ బియ్యం మాయం కేసు విచారణ ఎంత వరకు వచ్చింది? కేసు విచారణ ఓ అడుగు ముందుకు పడిందా? సినిమా డైలాగ్స్ రిపీట్ అవుతున్నాయా? విచారణలో పేర్ని నాని వైఫ్ సమాధానాలు చూసి పోలీసులే షాకయ్యారా? అసలేం జరిగింది. ఒక్కసారి లోతుల్లోకి వెళ్దాం.
వైసీపీ నేతలు ఏ పని చేసినా తెలివిగా, జాగ్రత్తగా చెస్తారనే ప్రచారం ఉంది. వైసీపీ ఐదేళ్ల పాలనలో ఇష్టానుసారంగా చెలరేగిపోయారు నేతలు. కొందరి నేతలపై అవినీతి ఆరోపణలు తీవ్రమయ్యాయి. ఈ విషయాన్ని కూటమి సర్కార్ బయటపెడుతోంది. అందులో ఒకటి రేషన్ బియ్యం మాయం కేసు.
ఈ వ్యవహారంలో తీగ లాగితే డొంక కదులుతోంది. ఇందులో A1గా మాజీ మంత్రి పేర్నినాని భార్య జయసుధ పేరు చేర్చారు. విచారణకు హాజరుకావాలని పోలీసులు ఆమెకు నోటీసులు ఇచ్చారు. ఈ క్రమంలో బుధవారం బందరు పోలీసుస్టేషన్‌లో తన లాయర్లతో కలిసి విచారణకు హాజరయ్యారు జయసుధ.
మొత్తం అధికారులు 45 ప్రశ్నలు సంధించారట పోలీసులు. అందులో చాలా ప్రశ్నలకు తనకు తెలీదు.. మరిచిపోయాను.. గుర్తు లేదు అనే జవాబులే ఎక్కువగా వచ్చినట్టు తెలుస్తోంది. నిందితురాలు చెబుతున్న సమాధానాలు విన్న పోలీసులకు చెమటలు పట్టాయని అంటున్నారు. దేనికీ కరెక్టుగా సమాధానం రాలేదట.
ALSO READ: ఏపీ బీజేపీ కొత్త అధ్యక్షుడు ఎవరు? రేసులో వారు, కాకపోతే
ఈ క్రమంలో అదుర్స్ మూవీ ఎన్నిసార్లు చూశారో తెలీదుగానీ, అందులో విలన్-ఎన్టీఆర్ మధ్య సంభాషలను గుర్తు చేసుకున్నారు పోలీసులు. తెలీదు.. గుర్తు లేదు.. మరిచిపోయాను ఆ మూడు డైలాగులు పదేపదే రిపీట్ అయ్యాయని తెలుస్తోంది. ఎందుకంటే ఆ సినిమా నిర్మాత వైసీపీ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ.
గొడౌన్ నిర్మాణం ఎప్పుడు చేశారు.. ఎలా చేశారు? ఎవరి పేరు మీద ఉంది? ప్రభుత్వానికి ఎప్పుడు ఎంత అద్దె చెల్లించారు? బియ్యం నిల్వలను మీరు చూశారా? గొడౌన్ నగదు లావాదేవీలు చూసిందెవరు? ఈ మధ్యకాలంలో ఎంత చెల్లించారు? రైస్ ఎక్కువగా స్టోరేజ్ చేయడానికి కారణాలేంటి? ఇలాంటి దాదాపు 45 ప్రశ్నలు సంధించారట.
తనకు ఆరోగ్యం సరిగా లేకపోవడంతో గోడౌన్ మేనేజర్ ఈ వ్యవహారాలను చూసుకునేవారని చెప్పారట జయసుధ. తనకు తెలీకుండా బియ్యం పక్కదాని పట్టించారంటూ మేనేజర్‌పై నెట్టేసినట్టు తెలుస్తోంది. విచారణకు మరోసారి అవసమైతే పిలుస్తామని పోలీసులు చెప్పారట. విచారణ తర్వాత అక్కడి నుంచి ఆమె వెళ్లిపోయారు.