Horoscope virgo 2025 : గ్రహాల సంచారం ప్రకారం రాశి ఫలాలను అంచనా వేస్తారు. కన్యా రాశి జాతకులకు ఈ సంవత్సరం 2025లో రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఈ సంవత్సవరం కన్యా రాశి జాతకులకు ఆదాయం -14, వ్యయం-2గా ఉంది. అంటే పద్నాలుగు రూపాయలు సంపాదిస్తే రెండు రూపాయలు మాత్రమే ఖర్చు పెడతారు. ధన పరంగా సింహ రాశి జాతకులకు ఈ సంవత్సరం బాగుందనే చెప్పాలి. ఇక రాజ్యపూజ్యం-6, అవమానం -6 గా ఉంది. అంటే ఆరు మంది మీకు గౌరవం ఇస్తే.. ఆరు మంది మిమ్మల్ని అవమానిస్తారు. ఇక ఈ సంవత్సరం నెలల వారీగా ఈ రాశి జాతకులకు ఎలాంటి ఫలితాలు ఎదురు కాబోతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
జనవరి : కన్యా రాశి జాతకులకు ఈ నెలలో మేనమామల నుంచి సహాయ సహకారాలు పొందుతారు. పిల్లలతో అనుకూలంగా ఉంటారు. ప్రభుత్వ ఉద్యోగులకు ప్రమోషన్లు లభిస్తాయి. శుభవార్తలు వింటారు. పిల్లల చదువులు మందకొడిగా సాగుతాయి.
ఫిబ్రవరి: కన్యా రాశి జాతకులకు ఈ నెలలో ప్రభుత్వ సహాయములు అందుతాయి. సంతానం సానుకూలంగా ఉండును. పశులాభం, స్త్రీలాభం, భూలాభం, వాహనలాభం కలుగును. పాతబాకీలు వసూలవుతాయి. డాక్టర్లు, మెడికల్ షాపులకు, ఆయుర్వేదం వారికి యోగదాయకంగా ఉంటుంది.
మార్చి : కన్యా రాశి జాతకులకు ఈ నెలలో సుఖశాంతులు, మానసిక ఆనందం పొందుతారు. దేవాలయాలను సందర్శిస్తారు. డాక్టర్లు, ఇంజినీర్లు, లాయర్లకు మంచి టైం నడుస్తుంది. దాన, ధర్మాలు చేస్తారు.
ఏప్రిల్ : కన్యా రాశి జాతకులకు ఈ నెలలో ఇష్టంలేని పనులు చేయవలసి వస్తుంది. మానసిక ఇబ్బందులు తలెత్తుతాయి. నెల చివరిలో కష్టాలు తీరిపోతాయి. దైవ దర్శనాలు చేసుకుంటారు. ఇతరుల వలన మేలు జరుగుతుంది.
మే : కన్యా రాశి జాతకులకు ఈ నెలలో ఎక్కువ ప్రయాణముల వలన శారీరకంగా బాధపడతారు. శత్రువుల వలన పీడలు కలుగును. సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. కార్యసిద్ధి, వృత్తి వ్యాపారాలు కలిసి వస్తాయి.
జూన్: కన్యా రాశి జాతకులకు ఈ నెలలో విందు, వినోదాలలో పాల్గొంటారు. అకారణంగా గొడవలు వస్తాయి. జాగ్రత్తగా ఉండాలి. రాజకీయ నాయకుల ద్వారా గొడవలు సర్దు మనుగుతాయి. ధనవ్యయం జరుగుతుంది. సోదరులతో విరోధాలు కలుగుతాయి.
ALSO READ: గ్రహ బాధలు, సమస్యలు పట్టి పీడిస్తున్నాయా? ఈ సింపుల్ రెమెడీస్‌తో మీ బాధలన్నీ పరార్
జూలై : కన్యా రాశి జాతకులకు ఈ నెలలో ఒక అత్యుత్తమ గౌరవము కలుగుతుంది. అకస్మిక ధన లాభమున్నది. ఇంట్లో ఎప్పుడు సందడిగా ఉంటుంది. శుభకార్యాలు జరుగుతాయి. కార్యసిద్ధి, సుఖం లాభం వచ్చే సూచనలున్నాయి.
ఆగష్టు : కన్యా రాశి జాతకులకు ఈ నెలలో వ్యాపారాభివృద్ధి చాలా బాగుంటుంది. మంచి లాభాలు చవి చూస్తారు. రాజకీయ నాయకులకు ఈ నెలలో అంత అనుకూలంగా ఉండదు. పురోహితులకు అనుకూలంగా ఉంటుంది.
సెప్టెంబర్ : కన్యా రాశి జాతకులకు ఈ నెలలో ఇంటా, బయటా విరోధములు ఏర్పడతాయి. శత్రుత్వము దాల్చుట వలన ఆరోగ్య హాని కలుగుతుంది. పాడి, మత్స్య, పౌల్ట్రీ యంత్ర పరిశ్రమల వారికి సామాన్య ఫలితాలు ఉన్నాయి.
అక్టోబర్ : కన్యా రాశి జాతకులకు ఈ నెలలో భోగ భాగ్యాలు అనుభవిస్తారు. ముఖ వర్చస్సు శరీర పోషణ క్రమశిక్షణ విలువలతో కూడిన జీవనము గడుపుతారు. ఒక అత్యుత్తమ గౌరవము లభిస్తుంది.
నవంబర్: కన్యా రాశి జాతకులకు ఈ నెలలో వ్యాపారంలో పెట్టుబడులు అనుకూలిస్తాయి. బంధు మిత్రులతో ఆనందంగా గడుపుతారు. మెరుగైన జీవితం గడుపుతారు. దైవారాధన చేయుట వలన ఉన్నత కాలంగా మారుతుంది.
డిసెంబర్ : కన్యా రాశి జాతకులకు ఈ నెలలో పత మిత కళత బందువులతో మాట తొందర. అనవసర ప్రసంగము ద్వారా వ్యయము.. గతంలో పెట్టిన పెట్టుబడులు కలసి వస్తాయి. ఒక అత్యుత్తమ గౌరవము కలుగుతుంది. పాడి, మత్స్య, పౌల్టి యంత్ర పరిశ్రమల వారికి సామాన్య ఫలితాలు ఉంటాయి.
ALSO READ: Donga Mallanna Temple: దేవుడినే దొంగను చేసిన భక్తులు – ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా..?