AP Govt: ఏపీలోని పింఛన్ దారులకు ప్రభుత్వం వరుస గుడ్ న్యూస్ లు చెబుతోంది. ప్రభుత్వం ఏర్పడిన వెంటనే తొలుత పింఛన్ దారులకు వరాలు కురిపించింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రావడం, రావడమే ఒకేసారి పింఛన్ పెంపు చేసింది. అంతేకాకుండా 3 నెలలకు ఒక్కొక్క నెల చొప్పున వెయ్యి రూపాయల వంతున నగదును అందజేసింది. ఇలా పింఛన్ దారులకు ప్రభుత్వం వరాలు కురిపిస్తోంది. తాజాగా మరో కీలక ప్రకటన కూడా ప్రభుత్వం చేసింది.
ఏపీ ఎన్నికల సమయంలో సీఎం చంద్రబాబు ప్రచారంలో భాగంగా పింఛన్ పెంపుపై కీలక ప్రకటన చేశారు. ఆ ప్రకటన మేరకు అధికారంలోకి రాగానే పింఛన్ నగదును పెంచి, ఇచ్చిన మాటకు కట్టుబడ్డారు సీఎం చంద్రబాబు. మొదటి నెల ఒక్కొక్క పింఛన్ దారునికి పెంచిన నగదుతో కలిపి రూ. 7 వేలు పంపిణీ చేశారు. దీనితో రూ. 4359.34 కోట్ల రూపాయలు మొదటి నెల ప్రభుత్వం అందజేసింది. అంతేకాదు దివ్యాంగుల పింఛన్ 3 నుంచి 6 వేలకు పెరిగింది. తీవ్రమైన జబ్బులతో మంచానికి పరిమితమైన వారికి కొందరికి రూ.10 వేలు, మరి కొందరికి రూ.15 వేలు పెన్షన్ వస్తోంది.
తాజాగా మరో కీలక ప్రకటన కూడా చేసింది ప్రభుత్వం. ఎవరైనా పింఛన్ దారుడు మృతి చెందితే, మరుసటి నెల నుండే పింఛన్ దారుడి భార్యకు పింఛన్ వర్తింపజేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కాగా ఇటీవల పింఛన్లను ప్రభుత్వం తొలగిస్తోందని వైసీపీ విమర్శిస్తోంది. ఈ విమర్శలపై సీఎం చంద్రబాబు తాజాగా కీలక ప్రకటన చేశారు. సీఎం మాట్లాడుతూ.. ఇప్పటి వరకు కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక, ఏ ఒక్కరి పింఛన్ తొలగించలేదన్నారు. అలాగే ఎవరైనా అనర్హులు పింఛన్ పొందుతున్నారా అనే రీతిలో కేవలం విచారణ మాత్రమే సాగించడం జరిగిందన్నారు.
అలాగే 3 నెలలు ఏదైనా కారణంతో పింఛన్ పొందని వారికి, ఒకేసారి 3 నెలల పింఛన్ నగదును అందజేయాలని కూడా ప్రభుత్వం అందజేసేందుకు చర్యలు తీసుకుంది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన సమయం నుండి ఇప్పటి వరకు రూ. 17863.56 కోట్ల నగదును పింఛన్ రూపంలో లబ్దిదారులకు సహాయం అందింది. ప్రభుత్వం ఏర్పడిన సమయం నుండి ఎన్నో కీలక మార్పులను పింఛన్ పంపిణీకి సంబంధించి చేసింది. పింఛన్ పెంపు, భర్త చనిపోతే భార్యకు మరుసటి నెల నుండే పింఛన్, 3 నెలల పింఛన్ ఒకేసారి తీసుకోవడం ఇలాంటి చర్యలతో పింఛన్ దారుల మనసును ప్రభుత్వం చూరగొందని చెప్పవచ్చు.