Allu Arjun Interrogation : ప్రస్తుతం ఇండస్ట్రీలో అల్లు అర్జున్ (Allu Arjun) వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. ‘పుష్ప 2’ ప్రీమియర్ల సందర్భంగా సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కేసలాట ఓ మహిళ ప్రాణాలను బలిగొన్న సంగతి తెలిసిందే. ఈ కేసు అల్లు అర్జున్ మెడకు చుట్టుకుంది. సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచినప్పటికీ, ఈ కేసు మాత్రం అల్లు అర్జున్ ను వీడకుండా వెంటాడుతూనే ఉంది. ఈ వ్యవహారంలో అల్లు అర్జున్ తప్పు ఏమీ లేదని కొంతమంది అంటుంటే, అంతా అల్లు అర్జున్ వల్లే జరిగిందని మరికొంత మంది అంటున్నారు. ఏదేమైనా ప్రభుత్వం ఈ విషయాన్ని వదిలి పెట్టేలా కనిపించట్లేదు.
తాజాగా అల్లు అర్జున్ (Allu Arjun) ను మరోసారి పోలీసులు విచారణకు పిలిపించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే డిసెంబర్ 4 న సంధ్య థియేటర్ దగ్గర జరిగిన ఘటనకు సంబంధించిన వీడియోలు చూపిస్తూ పోలీసులు ప్రశ్నలు అడగ్గా, అల్లు అర్జున్ సైలెంట్ గా కూర్చున్నట్టుగా తెలుస్తోంది. ఈ రోజు ఉదయాన్నే మొదలైన విచారణ ఇంకా కొనసాగుతోంది. అల్లు అర్జున్ ను ఇప్పటికే పోలీసులు 18 ప్రశ్నలు అడిగినట్టుగా తెలుస్తోంది. అందులో భాగంగా అల్లు అర్జున్ చెప్పే ప్రతి ఆన్సర్ ను వీడియో ద్వారా రికార్డ్ చేస్తున్నారని సమాచారం. కేవలం వీడియో రికార్డు మాత్రమే కాదు, అల్లు అర్జున్ స్టేట్మెంట్ ను మరోవైపు టైపింగ్ కూడా చేస్తున్నారని తెలుస్తోంది.
అయితే విచారణలో భాగంగా సంధ్య థియేటర్ లోపలికి అల్లు అర్జున్ (Allu Arjun) వస్తున్న వీడియో, ఆ తర్వాత థియేటర్ లోపల ఆయన కూర్చున్న వీడియో, బయటకు వెళ్తున్న వీడియోలను అల్లు అర్జున్ కు పోలీసులు చూపించారని సమాచారం. ఆ వీడియోలను చూపించి ప్రశ్నలు అడగడంతో అల్లు అర్జున్ మౌనం వహించినట్టుగా తెలుస్తోంది. అయితే రేవతి మృతిపై పోలీసుల వద్ద అల్లు అర్జున్ విచారం వ్యక్తం చేస్తూ, ఇలా జరుగుతుందని ఊహించలేదు తప్పు జరిగింది అని సమాధానం చెప్పారని అంటున్నారు.
అంతేకాకుండా తన పిఆర్ టీం తగిన జాగ్రత్తలు తీసుకొని ఉంటే, ఇలాంటి ఘటన జరిగేది కాదని, 50 మందికి పైగా బౌన్సర్లను పెట్టడం తప్పేనని అల్లు అర్జున్ విచారణలో ఒప్పుకున్నట్టుగా సమాచారం. దీంతో పోలీసులు సీన్ రీ కన్స్ట్రక్షన్ వద్దని డిసైడ్ అయ్యారని తెలుస్తోంది. ప్రస్తుతానికి విచారణ ఇంకా కొనసాగుతుండగా, ఈరోజు మధ్యాహ్నం 2:30 గంటల వరకు కొనసాగే అవకాశం ఉందని సమాచారం.
ఇక ఇప్పుడు సర్వత్రా అల్లు అర్జున్ (Allu Arjun) గురించే చర్చ నడుస్తోంది. లోకల్ మీడియా నుంచి నేషనల్ మీడియా దాకా ఎక్కడ చూసినా ఇదే టాక్. చాలామంది సెలబ్రిటీలు అల్లు అర్జున్ అరెస్ట్ కరెక్ట్ కాదు అంటుంటే, కొంతమంది రాజకీయ నాయకులు టీఎస్ ప్రభుత్వం కావాలనే బన్నీని టార్గెట్ చేస్తోందని అంటున్నారు. మొత్తానికి ఇప్పుడు సినిమా వర్సెస్ ప్రభుత్వం అన్నట్టుగా ఉంది పరిస్థితి. ఈ విచారణ తర్వాత పోలీసులు ఏం చేయబోతున్నారు? ఈ కేసు విషయంలో అల్లు అర్జున్ ఎలా తప్పించుకోబోతున్నారు? అన్నది ఆసత్కరంగా మారింది.