Sharath Babu latest news(Latest Tollywood Updates): సీనియర్ నటుడు శరత్‌బాబు. అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. మొదట్లో ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నా.. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారు. ఆయన చనిపోలేదు. మరణించారని వస్తున్న వార్తల్లో నిజం లేదు. అది ఫేక్ న్యూస్.
శరత్‌బాబుకు సీరియస్‌గా ఉందని తెలిసి టాలీవుడ్ ఆవేదన వ్యక్తం చేసింది. అభిమానులు ఆయన కోలుకోవాలని కోరుకుంటున్నారు. కానీ, కొందరు సైకోలు మాత్రం అడ్డగోలు వార్తలు ప్రచారం చేస్తున్నారు. వ్యూస్ కోసమే, సంచలనం కోసమో.. లేదంటే వెర్రితనంతో కూడిన సైకోయిజమో.. కారణం ఏదైనా.. శరత్‌బాబు చనిపోయారంటూ ఫేక్ న్యూస్ వైరల్ చేస్తున్నారు. బుధవారం సాయంత్రం నుంచి ఆ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
పనీపాటా లేని పోరంబోకులు ముందు ఇలా ఫేక్ న్యూస్ క్రియేట్ చేస్తుంటారు. తమ ప్లాట్‌ఫామ్స్‌లో వైరల్ చేస్తారు. వారిని చూసి ఇంకొకరు. అలా అలా వాళ్లూ వీళ్లూ అంతా అది నిజమేనని అనుకుని RIP అంటూ పోస్టులు, కామెంట్లు, స్టేటస్‌లు పెడుతూనే ఉంటారు. ఇటీవల కాలంలో ఇదే పైత్యంగా మారింది. బతికున్నవారినే చంపేస్తూ.. శునకానందం పొందుతున్నారు వెదవలు.
కనీసం క్రాస్ చెక్ చేసుకుందామనే సోయి కూడా ఉండట్లేదు చాలామందికి. వేలం వెర్రిగా, గొర్రెల్లా ఒకరిని చూసి ఒకరు ఫాలో అయిపోతున్నారు. ఇలాంటి కోతిచేష్టలు, వెకిలి వార్తలు, పైత్యపు ప్రచారం కేవలం సోషల్ మీడియాలోనే జరుగుతుంటుంది. మెయిన్‌స్ట్రీమ్ మీడియాలో ఇలాంటి ఫేక్ న్యూస్ దాదాపు రాదు. ఒకటికి రెండుసార్లు కన్ఫామ్ చేసుకున్నాక కానీ.. ఇలాంటి వార్తలు వేయదు. న్యూస్ ఛానెల్స్‌కు, పేపర్లు, ప్రముఖ వెబ్‌సైట్లకు ఆ మేరకు కఠిన నిబంధనలు ఉంటాయి. జర్నలిజాన్ని ఓ బాధ్యతగా భావిస్తుంటారు. కానీ, ఈ సోషల్ మీడియా వచ్చాక ఇలాంటి ఫేక్ న్యూస్ కుప్పలు తెప్పలుగా వస్తున్నాయి. అనేక మంది ప్రముఖులు, సెలబ్రిటీస్ ఇలాంటి వాటికి బలి అవుతున్నారు.
శరత్‌బాబు చనిపోయారంటూ జరుగుతున్న ప్రచారంపై ఆయన కుటుంబ సభ్యులు స్పందించారు. శరత్‌బాబు కోలుకుంటున్నారని.. త్వరలోనే మీడియాతో మాట్లాడుతారని.. ఇలాంటి అబద్దపు ప్రచారాన్ని నమ్మొద్దని వేడుకుంటున్నారు.
గతంలో కోటా శ్రీనివాసరావు లాంటి అనేక మంది ప్రముఖులను ఇలానే చంపేసింది సోషల్ మీడియా. టాలీవుడే ఆ ఫేక్‌గాళ్ల మెయిన్ టార్గెట్. గతంలో పలు యూట్యూబ్ ఛానెల్స్, వెబ్‌సైట్స్ అనేక మందిని బతికుండగానే చంపేసి.. బ్రేకింగ్ న్యూస్ నడిపాయి. అడ్డగోలు గాసిప్స్ క్రియేట్ చేసి.. నటీనటుల జీవితాలతో ఆడుకున్నాయి. ఇటీవల కేంద్రం నిబంధనలు కఠినతరం చేసి పలు యూట్యూబ్ ఛానెల్స్ తోకలు కట్ చేసింది కూడా. అయినా, తీరు మారడం లేదు. అబద్దపు చావు వార్తలు ఆగడం లేదు. ఆ దారుణానికి శరత్‌బాబు మరోసారి టార్గెట్ అయ్యారు. ఇకనైనా మారండిరా బాబు. బానే ఉన్నారు శరత్‌బాబు.