E-Paper
Advertisement

Phone Tapping : మరోసారి తెరపైకి ఫోన్ ట్యాపింగ్‌ వ్యవహారం.. అందుకే హైదరాబాద్ లోనే చంద్రబాబు..?

Phone Tapping : మరోసారి తెరపైకి ఫోన్ ట్యాపింగ్‌ వ్యవహారం.. అందుకే హైదరాబాద్ లోనే చంద్రబాబు..?
Advertisement
Phone Tapping

Phone Tapping (Andhra Pradesh news ) : ఆంధ్రప్రదేశ్‌లో మరో రాజకీయ దుమారం తెరపైకివస్తోంది. ముఖ్యనేతల ఫోన్లు ట్యాప్‌ అవుతున్నాయని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఫోన్ల ట్యాపింగ్‌తో పాటు నేతల డేటా కూడా బయటకు వెళ్తోందని తమ్ముళ్లు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు సాయంత్రం డీజీపీని కలిసి ఫిర్యాదు చేస్తామని చెప్పారు. ఇప్పటికే టీడీపీ బృందం డీజీపీ అపాయింట్మెంట్‌ కోరింది.

Advertisement

కొంత కాలంగా నేతల ఫోన్లు ట్యాపింగ్‌లో ఉన్నాయని.. అందుకే తమ అధినేత చంద్రబాబు హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేస్తున్నారని టీడీపీ నేతలు చెబుతున్నారు. అందుకే హైదరాబాద్‌ నుంచే పార్టీ కార్యక్రమాలను పర్వేక్షిస్తున్నారని అంటున్నారు. పార్టీలో జాయినింగ్స్, ఇతర యాక్టీవిటీలను హైదరాబాద్‌ నుంచే పర్వేక్షిస్తున్నారని చెబుతున్నారు. ఏదైనా ముఖ్య కార్యక్రమం ఉంటేనే చంద్రబాబు అమరావతికి వస్తున్నారని టీడీపీ నేతలు అంటున్నారు.

గతంలోనూ ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారం దుమారానికి కారణమైంది. ఇంటలిజెన్స్‌ చీఫ్‌ ఫోన్‌ ట్యాపింగ్‌కు పాల్పడ్డారంటూ కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. అది తీవ్ర దుమారానికి కారణమైంది. కోటంరెడ్డి అవతలి వ్యక్తితో మాట్లాడిన కాల్‌ రికార్డింగ్‌ అది.. అంతే తప్ప ఎలాంటి ఫోన్‌ ట్యాపింగ్‌ కాదని ప్రభుత్వం వివరణ ఇచ్చింది. తాజాగా టీడీపీ నేతలు డీజీపీని కలిసి ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంపై ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవడం ఏపీ పాలిటిక్స్‌లో మరోసారి హాట్‌ టాపిక్‌గా మారుతోంది.

Related News

ఇంకా దాగుడు మూతలు ఎందుకు.. చంద్రబాబు, నారా లోకేష్ పై నిప్పులు చెరిగిన జగన్!

ఆంధ్రా పేపర్స్ లిమిటెడ్‌కు షాకిచ్చిన కూటమి సర్కార్.. స్పందిచిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్!

కూటమి సర్కార్ పై పేర్ని నాని ఫైర్.. డీఎస్సీపై సీబీఐ విచారణ చేయాలని డిమాండ్!

కొబ్బరి చెట్టుని ఢీ కొట్టిన కారు, స్పాట్ ఐదుగురు, తూర్పుగోదావరి జిల్లాలో ఘటన

తల్లి మందలింపుతో కోపం.. తండ్రి నవ్వాడని గొంతు కోసిన కొడుకు, చిత్తూరు జిల్లాలో దారుణం

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

Big Stories

Advertisement
×