BigTV English

Amaravati : ఇక అమరావతే రాజధానా..? విశాఖకు షిఫ్టింగ్ కష్టమేనా..?

Amaravati : ఇక అమరావతే రాజధానా..? విశాఖకు షిఫ్టింగ్ కష్టమేనా..?

Amaravati capital news latest(Andhra Pradesh today news): విశాఖ నుంచే పాలనా కార్యకలాపాలు నిర్వహించాలనేది సీఎం జగన్ లక్ష్యం. అందుకు తగ్గట్టుగానే చర్యలు చేపట్టారు. ఈ ఏడాది ఉగాది నుంచి విశాఖకు పాలనను తరలిస్తామని తొలుత ప్రకటించారు. కానీ అమరావతిపై దాఖలైన పిటిషన్లు సుప్రీంకోర్టులో విచారణ జరగాల్సిఉండటంతో రాజధాని తరలింపు సాధ్యంకాలేదు.


ఆ తర్వాత సెప్టెంబర్ నుంచి విశాఖ కేంద్రంగానే పరిపాలన కొనసాగుతుందని ఏపీ సీఎం పదే పదే ప్రకటనలు చేశారు. విశాఖ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ కు ముందు తర్వాత సీఎం, మంత్రులు విశాఖే ఏపీ రాజధాని అంటూ స్పష్టం చేశారు. అమరావతిపై జులై 11న సుప్రీంకోర్టు తీర్పు వస్తుందని ఆశించారు. అందుకే పరిపాలనా వ్యవహారాలను విశాఖ నుంచి సాగించేందుకు ఏర్పాట్లు ప్రారంభించారు. ప్రభుత్వ కార్యాలయాల కోసం కొన్ని భవనాలు పరిశీలించారు. కానీ అమరావతిపై తీర్పు ఇంకా వెల్లడికాలేదు.

అమరావతి రాజధాని వ్యవహారంలో దాఖలైన పిటిషన్లపై విచారణను తాజాగా సుప్రీంకోర్టు చేపట్టింది. ఈ పిటిషన్లపై పూర్తిస్థాయి విచారణ డిసెంబర్ లో చేపడతామని జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ బేలా ఎం. త్రివేది ధర్మాసనం ప్రకటించింది. కేసును అత్యవసరంగా విచారణ చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వ తరఫున మాజీ అటార్నీ జనరల్‌ వేణుగోపాల్‌ విజ్ఞప్తి చేశారు. అయితే నవంబర్‌ వరకు రాజ్యాంగ ధర్మాసనాల కేసులు ఉన్నాయని సుప్రీంకోర్టు తెలిపింది. డిసెంబర్‌లోపు అత్యవసరంగా అమరావతి పిటిషన్ల విచారణ సాధ్యం కాదని తేల్చేసింది.


మరోవైపు సుప్రీంకోర్టు రిజిస్టరీ వివరాల ప్రకారం ప్రతివాదులందరికీ నోటీసులు వెల్లలేదని పేర్కొంది. ఈ నేపథ్యంలో కేసును విచారించడం సబబు కాదని అభిప్రాయపడింది. ఇద్దరు ప్రతివాదులు మరణించారని తమ వద్ద నివేదిక ఉందని వివరించింది. మరణించిన వారిని ప్రతివాదుల జాబితా నుంచి తొలగించాలని సుప్రీంకోర్టుకు దరఖాస్తు పెట్టామని ఏపీ తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ విషయంలో ధర్మాసనం సమ్మతించింది. వాటి వివరాలను ప్రత్యేకంగా ధర్మాసనం దృష్టికి తీసుకురావాలని స్పష్టం చేసింది.

అమరావతిపై దాఖలైన పిటిషన్లపై డిసెంబర్ లోనే సుప్రీంకోర్టు విచారణ చేపడుతుంది. దీంతో అప్పటి వరకు రాజధానిని విశాఖకు తరలించడం సాధ్యంకాదు. ఆ తర్వాత 3 నెలలకే ఏపీలో ఎన్నికలు జరుగుతాయి. ఆ సమయానికి ఎన్నికల హడావిడి మొదలవుతుంది. ఈ పరిస్థితుల్లో ఎన్నికల ముందు విశాఖకు రాజధాని తరలింపు సాధ్యం కాదనే చెప్పుకోవాలి. అంటే అమరావతి నుంచే యథావిథిగా అన్ని కార్యకలాపాలు నిర్వహించాల్సిందే. అంటే ఇక ఎన్నికలలోపు విశాఖకు రాజధాని తరలింపు సాధ్యం కాదని స్పష్టమవుతోంది. మరి ఏపీ ప్రభుత్వం దారెటు..?

Related News

Aadudam Andhra Scam: రోజా అసలు ‘ఆట’ మొదలు.. అరెస్టుకు రంగం సిద్ధం, రంగంలోకి సిట్?

Tirumala News: బుక్కైన జగన్ మామ, టీటీడీ కేసు నమోదు? అసలు ఏం జరిగింది?

YS Jagan: ఉప ఎన్నికల వేళ జగన్ 8 ప్రశ్నలు.. ఓటమిని ముందే ఒప్పుకున్నారా..?

Pulivendula Campaign: ఖైదీల వేషధారణలో ఎన్నికల ప్రచారం.. వైసీపీ పరువు తీసేశారుగా!

Nara Lokesh: ర్యాగింగ్ ఘటనపై లోకేష్ ఘాటు రియాక్షన్

Visakhapatnam 2050: విశాఖ నగరం 2050లో.. ఇలా ఉంటుందా? అసలు ఊహించలేం కదా!

Big Stories

×