E-Paper
Advertisement

జై కొడుతూనే జేబులు కొట్టేశారు.. మంత్రుల పర్యటనలో జేబు దొంగల హల్‌చల్

జై కొడుతూనే జేబులు కొట్టేశారు.. మంత్రుల పర్యటనలో జేబు దొంగల హల్‌చల్
Advertisement

Nellore Pickpockets:మంత్రుల పర్యటన అనగానే నాయకుల హడావుడి, కార్యకర్తల హంగామా మామూలే. మంత్రి దృష్టిలో పడాలని కొందరు.. తమ విజ్ఞప్తులు వినిపించాలని ఇంకొందరు.. కనీసం మంత్రితో ఒక సెల్ఫీ దిగాలని యువత ఆతృతగా ఉరుకులు పరుగులు పెడుతుంటారు. సరిగ్గా ఇదే సందర్భాన్ని జేబు దొంగలు అందివచ్చిన అవకాశంగా మలుచుకున్నారు. మంత్రుల పర్యటనలోనే ఆ దొంగలు తమ ప్లాన్‌ను అమలు చేశారు.

ఆలయ ఉద్యోగి నుంచి రూ.5 వేల చోరీ

నెల్లూరు జిల్లా దుత్తలూరు మండలం నర్రవాడ శ్రీవెంగమాంబ ఆలయాన్ని మంత్రులు MD ఫరూఖ్, వాసంశెట్టి సుభాష్‌తో పాటు స్థానిక ఎమ్మెల్యే కాకర్ల సురేష్‌ దర్శించుకున్నారు. ప్రముఖులు రావడంతో ఆలయం దగ్గర భారీగా జనసందోహం చేరింది. సరిగ్గా ఇదే అదునుగా భావించిన జేబు దొంగలు రెచ్చిపోయారు. వీఐపీల చుట్టూ చేరి.. నాయకులకు జై కొడుతూనే భక్తుల జేబులు కొట్టేశారు. ఆలయ ఉద్యోగి నుంచి 5వేల నగదు.. అలాగే సీతారాంపురం నాయకుల దగ్గర నుంచి 30వేల రూపాయల నగదును క్షణాల్లో కాజేశారు.

ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లిన బాధితులు

Advertisement

తమ జేబులు ఖాళీ కావడాన్ని గుర్తించిన బాధితులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. వెంటనే తేరుకుని ఎమ్మెల్యే కాకర్ల సురేష్ దృష్టికి తీసుకెళ్లారు. మంత్రులున్న చోటే ఇంత ధైర్యమా అంటూ అప్రమత్తమైన పోలీసులు వెంటనే రంగంలోకి దిగి దొంగలను గుర్తించారు. పారిపోతున్న దొంగల చొక్కా పట్టుకుని, అక్కడి నుంచి ఈడ్చుకుంటూ నేరుగా పోలీస్ స్టేషన్‌కు లాక్కెళ్లారు.

also read :జ‌నసేన ఎంట్రీకి క‌లిసివ‌స్తోన్న జెన్‌జీ.. యువ‌త‌లో ప‌వ‌న్ క్రేజ్‌.. ఎమ్మెల్సీ ఎన్నిక‌ల‌కు ప‌నికివ‌స్తుందా?

నిమిషాల్లో దొంగల ఆట కట్టించిన పోలీసులు

Advertisement

పోలీసుల ఈ స్పీడ్ యాక్షన్‌ చూసి అక్కడివారంతా షాక్ అయ్యారు. నిందితుల నుంచి చోరీ చేసిన నగదును వెంటనే స్వాధీనం చేసుకుని, బాధితులకు అప్పగించారు. ప్రముఖుల భద్రత మధ్యే రెచ్చిపోయిన జేబు దొంగల ఆటను పోలీసులు ఇలా నిమిషాల్లో కట్టడి చేశారు.

Tags

Related News

ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల

హైదరాబాద్‌కు జగన్ మకాం..అక్రమాస్తుల కేసులో బిగ్ ట్విస్ట్, న్యాయస్థానం కీలక నిర్ణయం

వివేకానంద కేసు.. ఈడీ ముందుకు ఎంపీ అవినాష్‌రెడ్డి, విచారణ మరో అడుగు ముందుకెళ్లేనా?

‘మాపై కోపంతో ఆ పనులన్నీ ఆపేశారు’.. గత ప్రభుత్వంపై విరుచుకుపడ్డ మంత్రి నారాయణ!

ఏపీలో మేయర్ సీట్లపై పీఠముడి.. టీడీపీ-జనసేన మధ్య ఈ ఉదయం చర్చలు, ఫెయిలైతే ఎవరిదారి వారిదే!

ఏపీలో మరో డీఎస్సీ నోటిఫికేషన్.. 2,721 ఉపాధ్యాయ పోస్టులు, వచ్చే నెల నుంచి

ఏపీలో జిల్లా పరిషత్ ఛైర్మన్లకు రిజర్వేషన్లు.. కీలక నేతలు జిల్లాలైతే..

జెడ్పీ పీఠం రేసులో బొత్స అనూష.. ప్రత్యర్థులకు గట్టి పోటీనా?

Big Stories

Advertisement
×