E-Paper
Advertisement

తిరుపతి స్విమ్స్ ఆసుపత్రికి.. రూ.10 లక్షల విరాళం అందించిన హర్యానా దాత!

తిరుపతి స్విమ్స్ ఆసుపత్రికి.. రూ.10 లక్షల విరాళం అందించిన హర్యానా దాత!
Advertisement

SWIMS Donation: పేద, నిరుపేద రోగులకు అత్యున్నత ప్రమాణాలతో కూడిన వైద్య సేవలను అందిస్తున్న శ్రీ వేంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ తిరుపతికి మరో ఉదారమైన విరాళం అందింది. స్విమ్స్ ఆధ్వర్యంలోని “శ్రీ బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని పథకం” ద్వారా నిరుపేద రోగులకు అందిస్తున్న వైద్య సేవలకు ఆకర్షితులైన హర్యానా రాష్ట్రం, కర్నాల్‌కు చెందిన శ్రీ అంకిత్ ఖర్గ్ రూ.10వేల రూపాయలను విరాళంగా అందించారు.

రూ.10 లక్షల డిమాండ్ డ్రాఫ్ట్‌..

ఈ విరాళానికి సంబంధించిన రూ.10 లక్షల డిమాండ్ డ్రాఫ్ట్‌ను తిరుపతికి చెందిన వై. రాఘవేంద్ర శనివారం ఉదయం 11 గంటలకు స్విమ్స్ డైరెక్టర్ కార్యాలయంలో స్విమ్స్ డైరెక్టర్ మరియు వైస్ ఛాన్సలర్ డా. గుడారు జగదీష్‌కి అందజేశారు. ఈ సందర్భంగా డా. గుడారు జగదీష్ మాట్లాడుతూ, “బాధలో ఉన్న పేద రోగికి అందించే వైద్య సహాయం కేవలం విరాళం కాదు ఒక ప్రాణానికి భరోసా, ఒక కుటుంబానికి ఆశ. శ్రీ అంకిత్ ఖర్గ్ అందించిన రూ.10 లక్షల ఉదార విరాళం ఎంతో మంది నిరుపేద రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు దోహదపడుతుంది” అని పేర్కొన్నారు.

ఆరోగ్య వరప్రసాదిని..

Advertisement

శ్రీవారి ఆశీస్సులతో సేవా దృక్పథంతో పనిచేస్తున్న స్విమ్స్‌లో ఆర్థిక స్థోమత లేని రోగులకు నాణ్యమైన, అత్యాధునిక వైద్య సేవలను అందించేందుకు శ్రీ బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని పథకం ఎంతో కీలకంగా నిలుస్తోందన్నారు. దాతలు అందించే ప్రతి రూపాయినీ బాధ్యతాయుతంగా, పారదర్శకంగా పేద రోగుల వైద్య సేవలకే వినియోగించేందుకు స్విమ్స్ కట్టుబడి ఉందని తెలిపారు.

Also read: రాత్రికి రాత్రే 83 గ్రామాల ప్రజలు అదృశ్యం.. ఇంతకీ ఆ రోజు కుల్ధారాలో ఏం జరిగింది?

“దాతృత్వం ఒక ప్రాణాన్ని నిలబెట్టగలదు”

Advertisement

సమాజంలో ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు తీవ్రమైన అనారోగ్యం ఎదురైనప్పుడు చికిత్స ఖర్చులు పెద్ద భారంగా మారుతాయని డా. జగదీష్ పేర్కొన్నారు. ఇటువంటి సందర్భాల్లో దాతలు అందించే సహాయం ఒక రోగికి చికిత్స అందించడమే కాకుండా, ఆ కుటుంబానికి కొత్త ఆశను, జీవితంపై నమ్మకాన్ని అందిస్తుందని తెలిపారు. ఈ స్ఫూర్తితో పారిశ్రామికవేత్తలు, వ్యాపార సంస్థలు, కార్పొరేట్ సంస్థలు, సేవా సంస్థలు, ప్రవాస భారతీయులు (NRIs), స్వచ్ఛంద సంస్థలు మరియు దాతృత్వ హృదయం కలిగిన ప్రతి ఒక్కరూ స్విమ్స్ శ్రీ బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని పథకానికి విరాళాలు అందించి పేద రోగుల ప్రాణరక్షణలో భాగస్వాములు కావాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

స్విమ్స్ వైద్య సేవలు..

“మన సంపాదనలో కొంత భాగం ఒక నిరుపేద రోగి ప్రాణాన్ని కాపాడేందుకు ఉపయోగపడితే, అంతకంటే గొప్ప సేవ మరొకటి ఉండదు. దాతలు అందించే సహకారం స్విమ్స్ వైద్య సేవల పరిధిని మరింత విస్తరించి, అవసరమైన ప్రతి పేద రోగికి అత్యుత్తమ వైద్యం అందించాలనే మా సంకల్పానికి బలాన్నిస్తుంది” అని డా. గుడారు జగదీష్ పేర్కొన్నారు.

దాతల చేయూత..

రూ.10 లక్షల విరాళాన్ని అందించిన శ్రీ అంకిత్ ఖర్గ్ సేవా దృక్పథాన్ని ప్రత్యేకంగా అభినందిస్తూ, స్విమ్స్ తరఫున డా. గుడారు జగదీష్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. ఆయన దాతృత్వం మరెందరికో ఆదర్శంగా నిలిచి, పేద రోగుల సేవకు మరింత మంది దాతలు ముందుకు రావడానికి స్ఫూర్తినివ్వాలని ఆకాంక్షించారు. “దాతల చేయూత – నిరుపేద రోగులకు ప్రాణదాత” అనే స్ఫూర్తితో స్విమ్స్ చేపడుతున్న సేవా కార్యక్రమాలకు సమాజంలోని దాతలు మరింత విస్తృతంగా సహకరించాలని కోరారు. పత్రికా మరియు ప్రసార మాధ్యమాల ప్రతినిధులు ఈ సేవా కార్యక్రమానికి విస్తృత ప్రచారం కల్పించి, మరింత మంది దాతలు పేద రోగుల వైద్య సేవలో భాగస్వాములు అయ్యేలా ప్రోత్సహించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము.

Also read: పవన్ బర్త్ డే స్పెషల్… సతీసమేతంగా కళ్యాణం జరిపించిన నాగబాబు దంపతులు!

Tags

Related News

అరకు లోయలో ‘సంజీవని’ విప్లవం.. దేశానికే గేమ్ ఛేంజర్.. సీఎం చంద్రబాబు

టీడీపీ ఎమ్మెల్యే కారును.. బలంగా ఢీకొట్టిన బస్సు.. త్రుటిలో తప్పిన ప్రాణాపాయం!

మాజీ మంత్రి అంబటి రాంబాబుకు అస్వస్థత.. గుండెకు స్టెంట్ వేసిన వైద్యులు!

మేము చేసిన పనుల క్రెడిట్ కొట్టేయడంలో జగన్ మహా సిద్ధహస్తుడు: నారా లోకేష్

స్థానిక ఎన్నికలను అడ్డుకోవడానికి జగన్ కుట్రలు.. సీఎం చంద్రబాబు ఫైర్!

నగరానికి వచ్చేవారికి విజయవాడలో ఆపన్న హస్తం.. ఉచితంగా వసతి ఆపై ఫుడ్ కూడా

అమరావతిలో మళ్లీ ల్యాండ్ పూలింగ్.. మౌలిక సదుపాయాలకు రూ.1,437 కోట్లు మంజూరు

Big Stories

Advertisement
×