E-Paper
Advertisement

హుజూరాబాద్ యునాని ఆసుపత్రిలో దారుణం.. డాక్టర్, ఫార్మసిస్ట్ కోసం రోగుల ఎదురుచూపులు!

హుజూరాబాద్ యునాని ఆసుపత్రిలో దారుణం.. డాక్టర్, ఫార్మసిస్ట్ కోసం రోగుల ఎదురుచూపులు!
Advertisement

Huzurabad Hospital: పేద ప్రజలకు ప్రత్యామ్నాయ వైద్య సేవలు అందించాలన్న ప్రభుత్వ ఆశయం క్షేత్రస్థాయిలో నీరుగారిపోతోంది. హుజూరాబాద్ ఏరియా ఆసుపత్రిలోని మొదటి అంతస్తులో కొనసాగుతున్న ప్రభుత్వ యునాని వైద్యశాల పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. అసలు ఇక్కడ యునాని విభాగం ఉందన్న సమాచారం తెలిపే కనీస నామఫలకం కూడా లేకపోవడంతో రోగులు తీవ్ర అయోమయానికి గురవుతున్నారు.

తిరిగే ఫ్యాన్లు.. కరువైన డాక్టర్, ఫార్మసిస్ట్!

ఈ విభాగంలో ఒక వైద్యురాలు, ఫార్మసిస్ట్, అటెండర్ ఉన్నప్పటికీ సిబ్బంది బాధ్యతారాహిత్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. మధ్యాహ్నం 12 గంటలు దాటినా వైద్యురాలి జాడ లేదు. గది తలుపులు తెరిచి, లోపల ఫ్యాన్ తిరుగుతున్నా వైద్యురాలు మాత్రం సీట్లో కనిపించలేదు. మరోవైపు ఫార్మసిస్ట్ కూడా రాదు వచ్చిన నిర్దేశిత గదిలో ఉండకుండా, ఆసుపత్రిలోని ఇతర గదుల్లో తిరుగుతూ కాలక్షేపం చేస్తున్నారే తప్ప తన సీట్లో మాత్రం కూర్చోవడం లేదు. దీంతో గంటల తరబడి నిరీక్షించిన రోగులు, వృద్ధులు విసిగి వేసారి వెనుదిరుగుతున్నారు.

Advertisement

Also read: పెళ్లాం, అత్త, ఇద్దరు కూతుళ్లను కాల్చేసిన డాక్టర్… తీరా ఆరా తీస్తే దేశాన్నే షాక్ చేసిన క్రైమ్ స్టోరీ

మందుల కోసం రోగుల ఎదురుచూపులు

తీవ్రమైన మోకాళ్ల నొప్పులు, ఇతర దీర్ఘకాలిక వ్యాధులతో పైఅంతస్తు మెట్లు ఎక్కి వచ్చే పేద రోగులకు నిరాశే ఎదురవుతోంది. డాక్టర్ గైర్హాజరు, ఫార్మసిస్ట్ గదులు తిరుగుతూ అందుబాటులో లేకపోవడంతో మందులు ఇచ్చే నాథుడే కరువయ్యాడు. ఎవరైనా రోగులు ప్రశ్నిస్తే “డాక్టర్ వస్తేనే మందులు ఇస్తాం, రేపు రండి” అంటూ నిర్లక్ష్యంగా సమాధానమిస్తూ తప్పించుకుంటున్నారు.

ఉన్నతాధికారులు చర్యలు చేపట్టాలి: గడ్డం విశాల్

Advertisement

రోజూ ఇదే తంతు పునరావృతమవుతోందని, యునాని వైద్యశాల పేరుకే తప్ప ప్రజలకు ఏమాత్రం ఉపయోగపడటం లేదని ఆల్ ఇండియా అంబేడ్కర్ యువజన సంఘం హుజూరాబాద్ నియోజకవర్గ నాయకుడు గడ్డం విశాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విధులకు డుమ్మా కొడుతున్న వైద్యురాలితో పాటు, గదిలో ఉండకుండా ఆసుపత్రి అంతా తిరుగుతూ కాలయాపన చేస్తున్న ఫార్మసిస్ట్‌పై ఉన్నతాధికారులు తక్షణమే శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. నిత్యం వైద్యులు, మందులు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టకపోతే ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.

Also read: డ్రోన్ ద్వారా పాకిస్థాన్ ఉగ్రవాదులకు సిమ్ కార్డులు సప్లై.. నిందితుడి అరెస్ట్!

Tags

Related News

నీ హీరోయిన్ల జాతకం మొత్తం బయటపెడతా.. కేటీఆర్ పై బల్మూరి వెంకట్ ఫైర్!

విదేశాల్లో చదవాలనుకునే బీసీ, ఈబీసీ విద్యార్థులకు భారీ గుడ్ న్యూస్.. వెంటనే అప్లై చేయండి?

33 జిల్లాల తెలంగాణలో టాలెంట్ ఉన్న క్రికెటర్లు లేరా.. ధరం గురువారెడ్డి ఫైర్!

హైదరాబాద్‌కు జగన్ మకాం..అక్రమాస్తుల కేసులో బిగ్ ట్విస్ట్, న్యాయస్థానం కీలక నిర్ణయం

మా సంకల్ప అదే.. యువతతోపాటు మహిళలను ప్రోత్సహించాలన్న సీఎం రేవంత్‌రెడ్డి

సరైన అభ్యర్థి ఎవరు? ఎమ్మెల్సీ టికెట్లపై బీజేపీ కసరత్తు

ప్రభుత్వ లెక్చరర్ల బాగోతంపై విద్యాశాఖలో ప్రకంపనలు.. మండిపడుతున్న ప్రజలు, చర్యలు తీసుకోవాలని డిమాండ్

ప్రైవేట్ డాక్టర్ల జీతం రూ. 25 వేలు.. ప్రభుత్వ మెడికోల స్టైఫండ్ ఎంతంటే? షాకింగ్ నిజాలు!

Big Stories

Advertisement
×