West Godavari Couple Suicide:పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక ఉంగరం కారణంగా దంపతులు ఆత్మహత్య చేసుకున్న సంఘటన తెలుగు రాష్ట్రాలలో తీవ్ర కలకలం రేపుతుంది. వేల్పూరుకు చెందిన దొడ్డా వెంకట ధనసాయికృష్ణ (32), ఆయన భార్య శిరీష (28) పశ్చిమ గోదావరి జిల్లా చించినాడ వంతెన వద్ద గోదావరి నదిలో దూకి ప్రాణాలు తీసుకున్నారు.
విషయంలోకి వెళ్తే సాయికృష్ణ, శిరీష దంపతులు భీమవరంలో నివసిస్తున్నారు.అయితే దాదాపు రెండేళ్ళక్రితం సాయికృష్ణ కి తెల్సిన ఒక వ్యక్తి రూ.50,000 విలువ గల ఒక ఉంగరం ఇచ్చి తాకట్టు పెట్టమన్నారు.అయితే సాయికృష కి ఉన్న ఆర్ధిక ఇబ్బందుల కారణంగా దానిని వాడుకుని సమయానికి అతడికి ఇవ్వలేకపోయాడు.
దీనితో గురువారం ఉదయం ఆ వ్యక్తి కొంతమంది తన మనుషులతో సాయి కృష్ణ సొంత గ్రామం అయిన వేల్పూరు వచ్చి నానా యాగీ చేశాడు,అంతే కాకుండా భీమవరం వెళ్లి సాయికృష్ణ భార్య శిరీషను, కుటుంబ సభ్యులను కూడా ఇష్టమొచ్చినట్టుగా తిట్టారు.దీంతో ఒక వైపు పరువు పోయిందన్న బాధ ఒకవైపు, అప్పులు పెరిగిపోయాయన్న బాధ మరో వైపు ..ఇలా అన్నిరకాలుగా చుట్టు ముట్టిన సమస్యలతో మానసిక ఒత్తిడి తట్టుకోలేక ఇద్దరు దంపతులు కలిసి ఆత్మహత్య చేసుకుకోవాలని నిర్ణయం తీసుకున్నారు.
ఇక ఇద్దరు తన బాబుతో కలిసి గురువారం రాత్రి తన బైక్ పై చించినాడ వంతెన వద్దకు చేరుకున్నారు. మొదట బాబుతో సహా చనిపోవాలని అనుకున్నారు.కానీ కొడుకు మీద ఉన్న ప్రేమతో ఆ బాబుని బైక్ పైనే ఉంచేసి భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఒక్కసారిగా ఆ వంతెన మీది నుండి గోదావరి నదిలోకి దూకేశారు.ఇక తల్లి తండ్రులు ఏం అయిపోయారో అర్థం కాని ఆ చిన్న బాబు బోరున ఏడుపు అందుకోవడం అక్కడికి వచ్చిన స్థానికులని, పోలీసులని కదిలించింది.ఒంటరైన బాబుని సాయికృష్ణ సోదరికి అప్పచెప్పినట్టు తెలుస్తుంది.
అయితే ఈ ఘటనకి ముందు సాయికృష్ణ రికార్డు చేసిన ఆడియో క్లిప్ ఇపుడు సోషల్ మీడియాలో మంటలు రేపుతుంది. “మా ఆర్థిక పరిస్థితి బాగోలేక సమయం అడిగాం. నా పరిస్థితి తెలిసి కూడా నా భార్యను దారుణంగా దూషించారు. ఈ అవమానం భరించలేకే చనిపోతున్నాం” అని అందులో చెప్పుకొచ్చాడు సాయి కృష్ణ.
మరోవైపు, ఆత్మహత్యకు రెండు రోజుల ముందు సాయికృష్ణ రికార్డ్ చేసిన సెల్ఫీ వీడియో కూడా వెలుగులోకి వచ్చింది. తనకి కవల పిల్లలు కాగా, పాప తన తల్లి దండ్రుల వద్ద ఉంటుంది.ఆ పాపని ఉద్దేశిస్తూ కవల కుమార్తెను తన వద్దకు పంపకపోతే సీలింగ్ ఫ్యాన్‌కు ఉరి వేసుకుంటానని బెదిరిస్తున్న దృశ్యాలు అందులో ఉన్నాయి. “ఇది ఎవరి బిడ్డ అని అడిగారు కదా, ఆ పాపపై ప్రమాణం చేసి చెబుతున్నా.. సాయంత్రంలోగా పంపకపోతే ఉరి వేసుకుంటా” అని ఆయన భావోద్వేగానికి గురయ్యాడు.
ఇక ప్రస్తుతం రైట్ నౌ ఎన్డీఆర్‌ఎఫ్ (NDRF) బృందాలు గోదావరి నదిలో తీవ్రంగా గాలింపు చర్యలు చేపట్టాయి. శుక్రవారం రాత్రి వరకు దంపతుల జాడ దొరకలేదని తెలుస్తుంది. ఇంతకీ రూ. 50 వేల కోసం దంపతులను బలి తీసుకున్న ఆ వేధింపుల రాయుళ్లు ఎవరు? ఉరి వేసుకునే వీడియో వెనుక అసలు కథేంటి? కుటుంబంలో ఉన్న ఇతర ఆర్థిక, వ్యక్తిగత వివాదాలు ఏమైనా ఉన్నాయా? అనే కోణంలో పోలీసులు కేసు నమోదు చేసి తీవ్రంగా దర్యాప్తు చేస్తున్నారు.
also read :రేణిగుంటకు 164 ఏళ్లు.. ఇంత సుదీర్ఘ చరిత్ర ఉందా?
కేవలం చిన్నపాటి ఆర్థిక గొడవలు, పరువు ప్రతిష్టల పట్టింపులు ఎంతటి ఘోరానికి దారితీస్తాయో ఈ ఘటన స్పష్టం చేస్తోంది. అన్యాయంగా అనాథలైన ఆ ఇద్దరు కవల పిల్లల భవిష్యత్తు ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది.