Big Stories

Rave Party – Kakani Vs Somireddy: బెంగుళూరు రేవ్ పార్టీ.. తెలుగు వారే ఎక్కువ మంది

Bangalore Rave Party Kakani Vs Somireddy(AP latest news): బెంగుళూరు రేవ్ పార్టీ వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. దీనికి రాజకీయ రంగు అంటుకుంది. ముఖ్యంగా ఏపీలో అధికార వైసీపీ- విపక్ష టీడీపీ మధ్య మాటలు తారాస్థాయికి చేరాయి. ఈ వ్యవహారంపై మంత్రి కాకాణి గోవర్దన్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి కౌంటర్ ఇచ్చారు.

- Advertisement -

మంత్రి కాకాణి వ్యవహారాన్ని తమకు అనుకూలంగా మార్చుకునే పనిలోపడ్డారు టీడీపీ మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి. మంగళవారం మధ్యాహ్నం నెల్లూరులో మీడియాతో మాట్లాడిన ఆయన.. రేవ్ పార్టీ జరిగిన ఫామ్ హౌస్ యజమాని గోపాల్‌రెడ్డిది కాగా, కాకాణికి ఆయన స్వయానా మిత్రుడని బాంబు పేల్చారు. రేవ్ పార్టీతో తనకు సంబంధం లేదంటున్న కాకాణి.. మరి పాస్‌పోర్టు, స్టిక్కర్లు అందులో ఎందుకు దొరికాయని ప్రశ్నించారు సోమిరెడ్డి.

- Advertisement -

నకిలీ పత్రాలు, నకిలీ మద్యం తయారీలో కాకాణికి సంబంధాలున్నాయని తీవ్రస్థాయిలో ఆరోపణలు గుప్పించారు సోమిరెడ్డి. నకిలీ పత్రాలు తయారుచేయడంలో కాకాణి నెంబర్ వన్ అని ధ్వజమెత్తారు. ఈ కేసులో ముగ్గురు జైలుకి వెళ్లారని ఆరోపించారు. నకిలీ మద్యం కేసులో 19 మంది జైలులో ఉన్నారని గుర్తు చేశారు. అంతరాష్ట్ర ముఠాతో కలిసి కాకాణి కార్యకలాపాలు చేశారని, ఇప్పుడు రెడ్‌ హ్యాండెడ్‌గా  దొరికిపోయారన్నారు సోమిరెడ్డి.

Also Read: బెంగుళూరులో రేవ్ పార్టీ.. టాలీవుడ్ నటీనటులు, ఏపీ మంత్రి కారు కూడా..!

ఈ విషయంలో కాకాణి అవినీతిపై పెద్ద పుస్తకం రాయవచ్చన్నారు. సంఘ విద్రోహశక్తులతో కాకాణికి సంబంధాలున్నాయని కుండబద్దులు కొట్టేశారు. కర్ణాటకలో 224 మంది, ఏపీలో 175, తెలంగాణలో 119 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని, అందులో ఎవరిదీ లేదని, కేవలం కాకాణి స్టిక్కర్ పేరున్న కారు ఎందుకు పోలీసులకు చిక్కిందని ప్రశ్నల మీద ప్రశ్నలు సంధించారు సోమిరెడ్డి. నెల్లూరు జిల్లాలో కాకాణి వర్సెస్ సోమిరెడ్డి గురించి చెప్పనక్కర్లేదు. ఏదైనా విషయం వస్తే ఒకరిపై మరొకరు విమర్శలు గుప్పించుకుంటు న్నారు. దీనికి రేవ్ పార్టీ వేదికైంది.

ఆదివారం రాత్రి బెంగుళూరులోని ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలో ఓ వ్యాపారవేత్త తన బర్త్ డే సందర్భంగా రేవ్ పార్టీ ఏర్పాటు చేశారు. సోమవారం ఉదయం మూడుగంటల సమయంలో దానిపై పోలీసులు దాడులు చేశారు. దీనికి సినీ, రాజకీయ కూడా హాజరయ్యారు. ఆ సమయంలో ఎమ్మెల్యే కాకాణి పేరిట కారు మీద స్టిక్కర్, పాస్‌పోర్టు లభించాయి. అంతేకాదు 25 మంది యువతీ యువకులు, 15 విలువైన కార్లను సీజ్ చేశారు బెంగుళూరు పోలీసులు.

Also Read: Karate Kalyani: నన్నుపేకాట ఆడానని చెప్పింది.. బెంగుళూరు రేవ్ పార్టీలో హేమ ఏం చేసింది.. దులిపేసిన కరాటే కళ్యాణి

ప్రస్తుతం దీనిపై బెంగుళూరు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కొద్దిసేపటి కిందట పోలీసు కమిషనర్ దయానంద్ కీలక విషయాలను వెల్లడించారు. రేవ్ పార్టీలో 101 మంది పాల్గొన్నారని తెలిపారు. అందులో తెలుగు వారే ఎక్కువ మంది ఉన్నారన్నారు. పార్టీలో ఓ నటి ఉన్నారని, వివరాలు అప్పుడే చెప్పలేమన్నారు. ఇంకా విచారణ జరుగుతోందన్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News