BigTV English

Pinnelli in Narasaraopeta : పిన్నెల్లిపై పోలీసుల నిఘా.. అరెస్టుకు రంగం సిద్ధం ?

Pinnelli in Narasaraopeta : పిన్నెల్లిపై పోలీసుల నిఘా.. అరెస్టుకు రంగం సిద్ధం ?

Police deployed, Pinnelli staying at Narasaraopeta: ఈవీఎం ధ్వంసం చేసిన కేసులో మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఉచ్చు బిగుస్తోంది. నేటితో ఆయనకు హైకోర్టు మంజూరు చేసిన ముందస్తు బెయిల్ ముగియనుంది. కోర్టు ఇచ్చిన గడువు నేటితో ముగియడంతో పిన్నెల్లిని ఏ క్షణమైనా అరెస్ట్ చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ నివాసంలో పిన్నెల్లి తలదాచుకున్నట్లు తెలుస్తోంది. దీంతో పిన్నెల్లి మరోసారి తప్పించుకోకుండా.. పోలీసులు భద్రత కట్టుదిట్టం చేశారు. అనిల్ కుమార్ యాదవ్ ఇంటి వద్ద పోలీసులు మరింత భద్రతను పెంచారు. పిన్నెల్లిపై పాల్వాయిగేట్ పోలింగ్ కేంద్రంలో ఈవీఎం ధ్వంసం సహా.. 3 హత్యాయత్నం కేసులు ఎదుర్కొంటున్నారు పిన్నెల్లి.


మే 13న ఏపీలో ఎన్నికల పోలింగ్ జరుగగా.. అదేరోజున పాల్వాయిగేట్ పోలింగ్ కేంద్రంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి విధ్వంసం సృష్టించారు. పోలింగ్ బూత్ లో ఈవీఎం ను పగులగొట్టి హడావిడి చేసిన వీడియో బయటికి రావడంతో.. ఏపీలో ఒక్కసారిగా రాజకీయం వేడెక్కింది. ఆ తర్వాత మహిళను దుర్భాషలాడటం, సీఐపై చేయి చేసుకోవడం, టీడీపీ ఏజెంట్ పై హత్యాయత్నం.. ఇలా పిన్నెల్లిపై నాలుగు కేసులు ఫైల్ అవ్వగా.. అరెస్ట్ భయంతో తెలంగాణ నుంచి పారిపోయేందుకు స్కెచ్ వేశారు. పిన్నెల్లిని అదుపులోకి తీసుకునేందుకు మాచర్ల పోలీసులు వెంబడించగా.. సినీ ఫక్కీలో ఆయన తప్పించుకున్నారు.

Also Read : పిన్నెల్లికి సుప్రీంకోర్టులో చుక్కెదురు.. హైకోర్టు తీర్పుపై ఆగ్రహం


మే 23న హై కోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ పై విచారణ చేసిన హైకోర్టు.. ఈవీఎంను ధ్వంసం చేసిన కేసులో జూన్ 5 వరకూ ఆయనపై చర్యలు తీసుకొవద్దని పోలీసులకు ఆదేశాలిచ్చింది. పిన్నెల్లికి ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. మే 27న మరో మూడు కేసుల్లో ముందస్తు బెయిల్ కోరగా.. మే 28న బెయిల్ మంజూరైంది. జూన్ 6కు కేసును వాయిదా వేసింది.

పిన్నెల్లిపై ఉన్న కేసులను విచారణకు తీసుకోకుండా బెయిల్ మంజూరు చేయడంపై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. జూన్ 6న పూర్తి విచారణ చేసి.. కేసును క్లోజ్ చేయాలని హైకోర్టును ఆదేశించింది సర్వోన్నత న్యాయస్థానం. నాలుగు కేసుల్లో ఆయన్ను జూన్ 6 వరకూ అరెస్ట్ చేయకుండా ఆదేశాలివ్వడాన్ని తప్పుబట్టింది. ఇది న్యాయాన్ని అపహాస్యం చేసేలా ఉందని అసహనం వ్యక్తం చేసింది.

 

Related News

YS Jagan: ఉప ఎన్నికల వేళ జగన్ 8 ప్రశ్నలు.. ఓటమిని ముందే ఒప్పుకున్నారా..?

Pulivendula Campaign: ఖైదీల వేషధారణలో ఎన్నికల ప్రచారం.. వైసీపీ పరువు తీసేశారుగా!

Nara Lokesh: ర్యాగింగ్ ఘటనపై లోకేష్ ఘాటు రియాక్షన్

Visakhapatnam 2050: విశాఖ నగరం 2050లో.. ఇలా ఉంటుందా? అసలు ఊహించలేం కదా!

Araku Coffee: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. అరకులో ఇకపై అందరూ లక్షాధికారులే!

Pawan Kalyan project: పవన్ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం.. కోట్లల్లో ఖర్చు.. ఎందుకంటే?

Big Stories

×