BigTV English

Supreme Shock to Pinnelli : పిన్నెల్లికి సుప్రీంకోర్టులో చుక్కెదురు.. హైకోర్టు తీర్పుపై ఆగ్రహం

Supreme Shock to Pinnelli : పిన్నెల్లికి సుప్రీంకోర్టులో చుక్కెదురు.. హైకోర్టు తీర్పుపై ఆగ్రహం

Supreme Court Shock to Pinnelli Ramakrishna Reddy : మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. పిన్నెల్లిపై అత్యున్నత న్యాయస్థానం ఆంక్షలు విధించింది. మాచర్ల లోని పాల్వాయిగేట్ పోలింగ్ కేంద్రంలో ఈవీఎం ధ్వంసంపై టీడీపీ ఏజెంట్ నంబూరి శేషగిరిరావు దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టు సోమవారం విచారణ జరిపింది. ఈవీఎం ధ్వంసం, హత్యాయత్నం కేసులో పిన్నెల్లిని అరెస్ట్ చేయాలని నంబూరి పిటిషన్లు వేశారు.


తాజాగా ఆ పిటిషన్లపై విచారణ చేసిన సుప్రీంకోర్టు.. రేపు కౌంటింగ్ కేంద్రానికి వెళ్లొద్దని ఆదేశించింది. కౌంటింగ్ పరిసర ప్రాంతాల్లో కూడా ఉండొద్దని ఆదేశాల్లో పేర్కొంది. ఈవీఎం ధ్వంసం కేసుతో పాటు మరో మూడు కేసుల్లో పిన్నెల్లి హైకోర్టు నుంచి ముందస్తు బెయిల్ పొందిన విషయం తెలిసిందే. ఈ కేసుల్లో జూన్ 6వ తేదీ వరకూ పిన్నెల్లిని అరెస్ట్ చేయవద్దని హైకోర్టు ఆదేశాలివ్వడాన్ని సుప్రీం ధర్మాసనం తప్పుబట్టింది. పిన్నెల్లి కేసులో హైకోర్టు తీర్పు.. న్యాయాన్ని అపహాస్యం చేసేలా ఉందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. దీనిపై హైకోర్టు జూన్ 6న సమగ్ర విచారణ జరిపి కేసును ముగించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

Also Read : నరసరావుపేటలో పిన్నెల్లి.. హోటల్‌లో స్టే.. ఆపై..!


మే 13న ఏపీలో జరిగిన అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో అక్కడక్కడా ఘర్షణలు జరిగాయి. మాచర్ల నియోజకవర్గం పాల్వాయిగేట్ పోలింగ్ కేంద్రంలో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం ను ధ్వంసం చేసిన వీడియో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈవీఎం ధ్వంసం, ప్రశ్నించిన మహిళను దుర్భాషలాడటం, పోలింగ్ జరిగిన మర్నాడు కారంపూడిలో జరిగిన మరో ఘటన, సీఐ టీపీ నారాయణస్వామిపై దాడి.. ఇలా నాలుగు కేసుల్లో 10 సెక్షన్ల కేసులు నమోదయ్యాయి. ఈ నాలుగు కేసుల్లోనూ పిన్నెల్లిని అరెస్ట్ చేయతుండా హైకోర్టు ముందస్తు, మధ్యంతర బెయిల్స్ మంజూరు చేసింది. జూన్ 6వ తేదీ వరకూ పిన్నెల్లిని అరెస్ట్ చేయవద్దని ఉత్తర్వుల్లో పేర్కొంది. అప్పటి వరకూ మీడియాతో మాట్లాడవద్దని, నరసరావుపేట దాటి వెళ్లొద్దని, ప్రతిరోజూ ఎస్పీ ఎదుట హాజరై, ఎక్కడ ఉంటారో సమాచారం ఇవ్వాలని ఆదేశించింది.

పిన్నెల్లి ఈవీఎంను ధ్వంసం చేసిన వీడియో బయటికొచ్చినప్పటి నుంచి ఆయన ఎక్కడా కనిపించలేదు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పరారవుతున్నారన్న సమాచారంతో.. ఆయన్ను అరెస్ట్ చేసేందుకు ఏపీ పోలీసులు వెంబడించారు. సంగారెడ్డి వద్ద కార్లను వదిలి వెళ్లిన పిన్నెల్లి.. ఆ తర్వాత హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ వేసి.. అరెస్ట్ అవ్వకుండా బెయిల్ ను పొందారు. జూన్ 6 విచారణ తర్వాత పిన్నెల్లి అరెస్ట్ అవుతారా ? సుప్రీంకోర్టు వేసిన మొట్టికాయలతో హైకోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందో చూడాలి.

Related News

Viveka Murder Case: వివేకా హత్యకేసు విచారణలో కీలక మలుపు..

ZPTC Fightings: భగ్గుమన్న పులివెందుల.. మంత్రి ఎదుటే కొట్టుకున్న టీడీపీ, వైసీపీ కార్యకర్తలు

Pulivendula ZPTC: పులివెందుల, ఒంటమిట్టలో ముగిసిన పోలింగ్

AP Free Bus Scheme: ఆగస్ట్ 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం – స్త్రీశక్తి పథకంపై సీఎం సమీక్ష

AP Asha Workers: ఆశా వర్కర్లకు ఏపీ సర్కార్ బంపర్ ఆఫర్.. ఆరోగ్యం, భవిష్యత్తు భరోసా!

Pulivendula ZPTC: ఏపీ పాలిటిక్స్ @ పులివెందుల

Big Stories

×