Big Stories

PM Modi: ఎవరు ఎవరకి మిత్రులు?.. ఎవరు ఎవరికి శత్రువులు?

pm modi: ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఇంట్రెస్టింగ్ గా మారాయి. క్రిస్టల్ క్లియర్ గా అనిపిస్తూనే… కంప్లీట్లీ కన్ఫ్యూజింగ్ గా మారుతున్నాయి. ఏ పార్టీ ఎటువైపు?.. ఎవరు ఎవరకి మిత్రులు?.. ఎవరు ఎవరికి శత్రువు.? అనేది తెల్చుకోవడం కష్టం. ఈ పరిణామాలకు కారణం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ టూరే. ఏపీలో మోదీ పర్యటనకు… సీఎం జగన్ భారీ ఏర్పాట్లు చేశారు. మర్యాదకు ఎక్కడా లోటురాకుండా అన్ని హంగులూ సమకూర్చారు. ప్రభుత్వ యంత్రాంగమంతా బాగా కష్టపడ్డారు. మరి ఇంత చేస్తే రిజల్ట్ ఏంటి.?

- Advertisement -

వైసీపీకి బద్ధ శత్రువుగా భావిస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో మోదీ వన్ టూ వన్ గా భేటీ అయ్యారు. పవన్ కళ్యాణ్ తమకు ప్రియారిటీ అని చెప్పకనే చెప్పారు. ఇక భేటీలో ఏం చర్చించారన్నది పక్కన బెడితే.. మీడియా ముందుకు వచ్చిన పవన్.. ఏపీకి మంచిరోజులు వచ్చే విషయాల గురించి చర్చించామని చెప్పారు. అంతే కాదు.. ప్రభుత్వం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మోదీ ఉన్నప్పుడే.. జగన్ సర్కారు అవినీతిని ప్రశ్నిస్తున్నానంటూ పవన్ కళ్యాణ్ కొత్త ప్రచారాన్ని మొదలుపెట్టాడు. జగనన్న మోసం అంటూ క్యాంపెయిన్ స్టార్ట్ చేశారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్మిస్తున్న జగనన్న కాలనీలపై జనసేన ఫైట్ స్టార్ట్ చేసింది. ఇదంతా మోదీ డైరెక్షన్ లో జరుగుతున్నదా? లేక జనసేన రాజకీయ పోరాటనికి ప్రధాని ఊకొట్టినట్టేనా ? అనేది ఎవరి ఊహకూ అందదు. రెంటిలో ఏదైనా… జనగ్ ను బీజేపీ ప్రత్యర్థిగానే చూస్తున్నదనేది సుస్పష్టం. ఇక ఏపీ బీజేపీ నేతల తీరు కూడా.. వైసీపీ పట్ల అగ్గిమీద గుగ్గిలం తరలాలోనే ఉంటున్నది.

- Advertisement -

జగన్ మాత్రం ఆచితూచి వ్యవహరిస్తున్నారు. నొప్పించక తానొవ్వక అన్న సిద్ధాంతాన్నే ఫాలో అవుతున్నారు. విశాఖలోని ఏయూ ఇంజినీరింగ్‌ కళాశాల మైదానంలో నిర్వహించి బహిరంగ సభలో జగన్‌ మరోసారి కేంద్రంతో బంధంపై మాటల ద్వారా క్లారిటీ ఇచ్చారు. అదే విషయాన్ని విశాఖలో మోదీ సమక్షంలోనే స్పష్టం చేశారు. కేంద్రంతో తమ బంధం రాజకీయాలకు అతీతమని తేల్చేశారు. రాష్ట్ర ప్రయోజనాలు తప్ప మరో అజెండా ఉండదన్నారు. అంటే ఆ పార్టీతో వైరం ఉండదు. అదే సమయంలో పొత్తు ఉండదు. జగన్ చెప్పిన మాటల్లో అంతరార్థం ఇదే అని స్పష్టమవుతోంది.

ఇప్పుడే కాదు… ఏపీలో వైఎస్ఆర్ సీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కేంద్రంతో మంచి సంబంధాలే కొనసాగిస్తున్నారు సీఎం జగన్. రాష్ట్రంలో కొందరు బీజేపీ నేతలు వైఎస్ జగన్ ప్రభుత్వంపై ఆరోపణలు, విమర్శలు చేసినా ఆ నేతలకే వైఎస్ఆర్ సీపీ నేతలు కౌంటర్ ఇస్తున్నారు తప్ప కేంద్రంపై ఎలాంటి విమర్శలు చేయడంలేదు.కేంద్రం పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన అనేక బిల్లులకు వైఎస్ఎస్ సీపీ మద్దతు ఇచ్చింది. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలల్లో మద్దతు ఇచ్చింది. విభజన హామీలు, ఏపీకి ప్రత్యేక హోదా, విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు విషయంలోనూ రాజీధోరణిలోనే వ్యవహరించారు సీఎం జగన్. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా , ఇతర కేంద్రమంత్రులను అనేకసార్లు కలిసి వినతి పత్రాలు అందించారు. కొన్నిసార్లు లేఖలు రాశారు సీఎం జగన్. అంతే తప్ప కేంద్ర హామీలు అమలు చేయడంలేదని నిందించలేదు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్రంతో ఢీ అంటే ఢీ అనలేదు. పోలవరం ప్రాజెక్టు నిధులు కోసం అదే ధోరణితో వైఎస్ జగన్ ప్రభుత్వం వ్యవహరించింది. 22 మంది ఎంపీలు ఉన్నారు కేంద్రాన్ని నిలదీయండి అని టీడీపీ ఎంత రెచ్చగొట్టినా ఆ ట్రాప్ లో వైఎస్ఆర్ సీపీ పడలేదు. కేంద్రంతో స్నేహసంబంధాలనే కొనసాగించారు సీఎం వైఎస్ జగన్.

మరి టీడీపీ సంగతేంటి? ప్రస్తుతం టీడీపీ.. జనసేనను తమ సహచరుడిగా చూస్తున్నది. టీడీపీకి పవన్ మద్దతు ప్రకటించడం అందరికీ తెలిసిందే. అందుకే పవన్ కళ్యాణ్ ను.. సీఎం జగన్ తో సహా వైసీపీ నేతలంత దత్తపుత్రుడని ఎగతాళి చేస్తుంటారు. తాజాగా ప్రధాని మోదీతో పవన్ కళ్యాణ్ భేటీతో.. బీజేపీ వ్యూహం స్పష్టమైంది. మరి టీడీపీని కూడా బీజేపీ అలాగే భావిస్తున్నదా? ఇదే ఇప్పుడు తేలాల్సిన విషయం. ఎందుకంటే..

మోదీతో భేటీ కోసం చంద్రబాబు, ఇతర టీడీపీ నేతలు ప్రయత్నించారన్న వార్తలు వినిపించాయి. కానీ.. ఎవరికీ అపాయింట్ మెంట్ దక్కలేదు. ఈ నేపథ్యంలో బీజేపీ ఆలోచనేంటన్నది అంతుచిక్కడం లేదు. పవన్ కళ్యాణ్ తో కలిసి పోటీచేయాలన్నదే బీజేపీ వ్యూహం. ? ఐతే.. టీడీపీని కాదని బీజేపీతో.. పవన్ కళ్యాణ్ ముందుకు వెళ్లగలరా? లేక బీజేపీని కాదని టీడీపీకే మరోసారి మద్దతు పలుకుతారా? లేక బీజేపీ, టీడీపీ, జనసేన కలిపి కూటమి కట్టనున్నాయా? ఒకవేళ జనసేన, బీజేపీ మాత్రమే పొత్తు పెట్టుకుంటే.. టీడీపీ పరిస్థితేంటి? మొత్తంగా బోలెడు లెక్కలు .. ఇంకెన్నో కాంబినేషన్స్. ప్రతీ లెక్కకు మరేదో సూత్రీకరణలు .. వెరసి.. ఏపీ రాజకీయం ఇంట్రెస్టింగి రూబిక్ క్యూబ్ పజిల్ గా మారింది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News