BigTV English

Extra Marital affair | రోడ్డుపై నిరసనకు దిగిన పోలీస్ కానిస్టేబుల్ భార్య.. భర్త ఏం చేశాడంటే?

Extra Marital affair | చట్టాన్ని కాపాడాల్సిన కొందరు ఖాకీలు వ్యవహరిస్తున్న తీరు.. ఆశ్చర్యంతో పాటు వైరల్‌గా మారుతోంది. చిత్తూరు జిల్లా పుంగనూరులో AR కానిస్టేబుల్‌ గిరిబాబు చేసిన పనితో స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

Extra Marital affair | రోడ్డుపై నిరసనకు దిగిన పోలీస్ కానిస్టేబుల్ భార్య.. భర్త ఏం చేశాడంటే?

Extra Marital affair | చట్టాన్ని కాపాడాల్సిన కొందరు ఖాకీలు వ్యవహరిస్తున్న తీరు.. ఆశ్చర్యంతో పాటు వైరల్‌గా మారుతోంది. చిత్తూరు జిల్లా పుంగనూరులో AR కానిస్టేబుల్‌ గిరిబాబు చేసిన పనితో స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.


పుంగనూరు సదుం పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్‌గా చేస్తున్న టి.గిరిబాబుకు.. 2017 సంవత్సరంలో విజయకుమారితో వివాహం జరిగింది. అతనికి కొన్ని రోజుల క్రితం సోమల మండలం బుంగ వారిపల్లెకు చెందిన యువతితో పరిచయం ఏర్పడింది. అది కాస్తా.. వివాహేతర బంధానికి తెరతీసింది. దీంతో తనను పెళ్లి చేసుకోవాలని కోరగా… స్థానిక సుబ్రహ్మణ్యంస్వామి ఆలయంలోనే.. పోలీస్ డ్రెస్ లోనే తాళి కట్టేశాడు. ఆ వివాహతంతు.. నిర్వహించేదుకు గుడిలో ఉన్న పూజారి కూడా అంగీకరించకపోవటంతో.. గుడిబయటే ఆ యువతి మెడలో సదరు కానిస్టేబుల్‌ తాళి కట్టేశాడు.

విషయం తెలుసుకున్న గిరిబాబు మొదటిభార్య విజయకుమారి.. అంబేద్కర్ సర్కిల్ వద్ద ఆందోళనకు దిగింది. చట్టపరంగా వివాహం చేసుకున్న తనకు న్యాయం చేయాలని కోరుతోంది. ఘటనపై పుంగనూరు పోలీసులకు ఫిర్యాదు చేయడంతొ కేసు నమోదు చేసినట్లు ఆమె తెలిపింది..


చట్టాన్ని కాపాడాల్సిన ఓ పోలీసు.. ఖాకీ దుస్తుల్లోనే రెండో వివాహం చేసుకోవటం చర్చనీయాంశంగా మారింది.

Police constable, wife. public protest, husband, Extra Marital affair, Punganur, Andhra Pradesh,

Related News

Jagan: ప్రతిపక్ష హోదా వల్ల లాభం ఏంటి? ఎమ్మెల్యేలకు ప్రశ్నించే హక్కు ఉండదా? జగన్ లాజిక్ ఏంటి?

Tirumala News: భక్తులకు నేరుగా శ్రీవారి దర్శనం, సాయంత్రం తిరుమలకు సీఎం చంద్రబాబు

Amaravati News: హెచ్ 1 బీ వీసా ఎఫెక్ట్.. ఏపీకి టెక్ కంపెనీ యాక్సెంచర్, విశాఖలో కొత్త క్యాంపస్‌

Nellore News: రెచ్చిపోయిన హిజ్రాలు.. న‌ర్సుపై మూకుమ్మడిగా దాడి, అడిగినంత ఇవ్వలేదని

Rajahmundry News: క్రిమినల్ బత్తుల జాడెక్కడ? జైలులో ప్రభాకర్ ఏమేమి చేసేవాడు?

Amaravati News: వైసీపీ స్కెచ్ మామూలుగా లేదు.. సీఎం చంద్రబాబుకు ఆ పోలీసు నోటీసు,అసలు మేటర్ అదే?

TTD Chairman BR Naidu: తిరుమల శ్రీవారి సేవకులకు.. టీటీడీ ఛైర్మన్ గుడ్‌న్యూస్

Nagababu – Anitha: ఎమ్మెల్సీగా నాగబాబు తొలి ప్రశ్న – మంత్రి అనిత సమాధానం

Big Stories

×