E-Paper
Advertisement

Polavaram : పోలవరం వద్ద టెన్షన్ టెన్షన్.. చంద్రబాబు ప్రాజెక్టు సందర్శనకు నో పర్మిషన్..

Polavaram : పోలవరం వద్ద టెన్షన్ టెన్షన్.. చంద్రబాబు ప్రాజెక్టు సందర్శనకు నో పర్మిషన్..
Advertisement

Polavaram : పోలవరం ప్రాజెక్టు వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పోలవరం సందర్శనకు పోలీసులు అనుమతి నిరాకరించారు. దీంతో పోలవరం ప్రాజెక్టుకు వెళ్లే మార్గంలోనే రోడ్డుపై చంద్రబాబు బైఠాయించారు. తనతోపాటు, మరో ఐదుగురు నేతలు పోలవరం ప్రాజెక్టును సందర్శించేందుకు అనుమతి ఇవ్వాలని పోలీసులను చంద్రబాబు కోరారు. అనుమతి ఇవ్వడానికి పోలీసులు నిరాకరించడంతో నిరసనకు దిగారు.

మరోవైపు పోలవరం ప్రాజెక్టు వద్దకు టీడీపీ నాయకులు, కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. చంద్రబాబుతోపాటు టీడీపీ నేతలు దేవినేని ఉమామహేశ్వరరావు, నిమ్మల రామానాయుడు, బుచ్చయ్యచౌదరి రోడ్డుపై బైఠాయించారు. పోలవరం ప్రాజెక్టు వైపు వెళ్లే మార్గంలో పోలీసులు తొలుత బారీకేడ్లు పెట్టారు. ఆ తర్వాత బారీకేడ్లు తొలగించి పోలీసు వ్యాను, జీపులను అడ్డంగా పెట్టారు. దీంతో పోలీసుల తీరుపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను పోలవరం ఎందుకు వెళ్లకూడదో లిఖిత పూర్వకంగా రాసివ్వాలని పోలీసులను కోరారు. ఈ సమయంలో రోడ్డుపైనే బైఠాయించి నిరసన తెలిపారు. ప్రభుత్వంపై చంద్రబాబు తీవ్ర విమర్శలు చేశారు.

Related News

ప్రశ్నిస్తే బ్లాక్ చేస్తారా? బిగ్ టీవీ వ్యవహారంపై నెటిజన్ల ఫైర్

ఏపీలో అమల్లోకి కొత్త మున్సిపల్ చట్టం.. జీవోలు విడుదల!

నిజాలు చూపిస్తే ఇన్‌స్టాగ్రామ్ ఖాతా బ్లాక్ చేయిస్తారా.. కూటమి ప్రభుత్వంపై సీదిరి అప్పలరాజు ఫైర్!

ఏపీ డీఎస్సీ 2025 కుంభకోణంపై జగన్ సంచలన ట్వీట్.. ప్రశ్నిస్తే సోషల్ మీడియా ఖాతాలు బ్లాక్ చేస్తారా అంటూ ఫైర్!

ఏపీ ఉద్యోగులకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్.. డీఏల విడుదలకు గ్రీన్ సిగ్నల్!

విజయసాయిరెడ్డి కీలక నిర్ణయం.. రాజకీయ పార్టీపై సోమవారం కీలక ప్రకటన

ఆ దూడ తపన.. అమ్మ బొమ్మ నుండి పాలు తాగడానికి ప్రయత్నం, వీడియో వైరల్

బిగ్‌ టీవీ ఎఫెక్ట్.. ఏపీ డీఎస్సీ స్కామ్ బట్టబయలు, ఎస్జీటీ ప్రభాకర్‌పై ఎంక్వైరీకి ఆదేశం

Big Stories

Advertisement
×