Big Stories

BC Votes : వాళ్ల ఓటు బ్యాంకే టార్గెట్.. ఒకేదారిలో జగన్, చంద్రబాబు..

BC Votes : ఏ రాష్ట్రంలోనైనా బీసీల ఓటు బ్యాంకే అత్యంత కీలకం. జనాభాలో 50 శాతం వెనుకబడివర్గాలే ఉన్నాయి. అందుకే అన్ని పార్టీలు బీసీ మంత్రం పటిస్తాయి. ఎన్నికల సమీపిస్తున్న కొద్దీ ఈ వర్గాలను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తాయి. ఇప్పుడు ఏపీలోనూ ఇదే పరిస్థితి నెలకొంది.

- Advertisement -

ఏపీలో ఎన్నికలకు ఏడాదిన్నర సమయం ఉంది. అయితే ఇప్పటి నుంచే ఎన్నికల వేడి మొదలైంది. ముందస్తు ఎన్నికలు ఉంటాయని ప్రచారం జరుగుతోంది. గతంలో టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికల ముందే జరుగుతాయని పార్టీ నేతలు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఆ సమయంలో అధికార వైఎస్ఆర్ సీపీ నేతలు ఆ వ్యాఖ్యలను ఖండించారు. అయితే తాజాగా మంత్రి సీదిరి అప్పలరాజు ముందస్తు ఎన్నికల ఉంటాయనే హింట్ ఇచ్చారు. ఏపీలో ఏడాది ముందే ఎన్నికల జరుగుతాయని ప్రచారం నడుస్తోంది. ఈ నేపథ్యంలోనే అటు వైఎస్ఆర్ సీపీ, ఇటు టీడీపీ బీసీలపై ప్రత్యేక ఫోకస్ పెట్టాయి.

- Advertisement -

వైఎస్ఆర్ సీపీ డిసెంబర్ 7 బీసీల ఆత్మీయ సదస్సును నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది. జయహో బీసీ మహాసభను విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో నిర్వహించనుంది. ఈ మీటింగ్ ఏర్పాట్లను బీసీ నేతలతో కలిసి ఎంపీ విజయసాయిరెడ్డి పరిశీలించారు. జయహో బీసీ మహాసభ పోస్టర్ ను విడుదల చేశారు. ఈ సమయంలో విజయసాయిరెడ్డి కీలక విషయాలను వెల్లడించారు. జయహో బీసీ మహాసభలో సీఎం వైఎస్ జగన్ కీలక ప్రసంగం చేస్తారని తెలిపారు. ఈ సమావేశం తర్వాత జోనల్ వారీగా బీసీ మీటింగ్ లు పెడతామని ప్రకటించారు.

ఏప్రిల్ లో జరిగిన కేబినెట్ విస్తరణలో సీఎం జగన్ అగ్రవర్ణాలకు చెందిన ముగ్గురు మంత్రులను తొలగించారు. వారిస్థానంలో ముగ్గురు బీసీలకు స్థానం కల్పించారు. స్థానిక సంస్థల్లో వెనుకబడిన వర్గాలకు పెద్దపీట వేశారు. ప్రతి బీసీ కులానికి ఓ కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. ఇలా ఎన్నికలకు రెండేళ్ల ముందే జగన్ బీసీల ఓటు బ్యాంకుపై పట్టు సాధించేందుకు అన్ని ప్రయత్నాలు చేశారు. 2019 ఎన్నికల్లో బీసీల ఓటు బ్యాంకు సాధించడంలో సక్సెస్ అయ్యారు. ఇప్పుడు ఆ ఓటు బ్యాంకును నిలబెట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అందుకే జయహో బీసీ మహాసభ ఏర్పాటుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే టీడీపీ నుంచి చాలా మంది బీసీ నేతలను పార్టీలో చేర్చుకున్నారు. ఇలా బీసీల ఓట్లను పొందేందుకు సీఎం జగన్ వ్యూహాలు సిద్ధం చేశారు. జయహో బీసీ మహాసభ వేదికపై సీఎం జగన్ బీసీలకు ఇంకా ఎలాంటి వరాలు ప్రకటిస్తారనే ఆసక్తి నెలకొంది.

బీసీలు ఒకప్పుడు టీడీపీకి గుండెకాయగా ఉన్నారు. అయితే 2019 ఎన్నికల్లో అన్ని ప్రాంతాల్లో బీసీ ఓట్లు టీడీపీకి దూరమయ్యాయి. ముఖ్యంగా యువత వైఎస్ఆర్ సీపీ వైపు మొగ్గుచూపారు. అందుకే తిరిగి బీసీ ఓట్లపై పట్టు సాధించేందుకు చంద్రబాబు ప్రయత్నాలు మొదలుపెట్టారు. పశ్చిమగోదావరి జిల్లా పర్యటనలో చంద్రబాబు బీసీ మంత్రాన్ని జపించారు. బీసీ నేతలతో సమావేశమయ్యారు. వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వంలో బీసీలకు పేరుకే పదవులు ఇస్తున్నారని అధికారం మాత్రం అగ్రకులాల వద్దే ఉందని ఆ సమావేశంలో అన్నారు. టీడీపీతోనే బీసీలకు న్యాయం జరుగుతుందని స్పష్టం చేశారు. అంటే బీసీల ఓటు బ్యాంకును తిరిగి తెచ్చుకుంటేనే వచ్చే ఎన్నికల్లో విజయం సాధ్యమవుతుందని చంద్రబాబు బలంగా నమ్ముతున్నారు. ఆ దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేశారు.

వచ్చే ఎన్నికల్లో బీసీలకు ఇచ్చే సీట్లు కీలకం కానున్నాయి. మరి వైఎస్ఆర్ సీపీ ఎంత మంది బీసీలకు టిక్కెట్లు ఇస్తుంది. టీడీపీ ఎంత బీసీలను ఎన్నికల బరిలో నిలుపుతుందో చూడాలి మరి. ఏది ఏమైనా బీసీల ఓటు ఎటు వైపు ఉంటే ఫలితం అటు వైపే. మరి ఏ పార్టీ బీసీల మనసు దోసుకుంటుందో చూడాలి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News