Mp Avinash Reddy: ఏపీ సర్కార్ సోషల్ మీడియా అరాచకాలపై నిఘా పెట్టిన సంగతి తెలిసిందే. నెట్టింట అసత్య ప్రచారం, వ్యక్తిగత దూషణలు చేసిన వారిపై చర్యలకు సిద్ధమైంది. ఇప్పటికే కొంత మందిని గుర్తించడంతో పాటు అదుపులోకి తీసుకుంది. ఏకంగా మూడు వందల మంది సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసినవారు ముందుగానే లొంగిపోయేందుకు సిద్ధమైనట్టు సమాచారం. అదే విధంగా దాదాపు 2వేల మంది ఆకతాయిలను పోలీసులు ఇప్పటికే గుర్తించినట్టు తెలుస్తోంది.
Also read:కుప్పంలో వైసీపీ ఖాళీ.. టీడీపీలోకి కీలక నేతలు
మరోవైపు నటి, వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త శ్రీరెడ్డి ఇప్పటికే బయటకు వచ్చి ఓ వీడియోను విడుదల చేసింది. తనను వదిలిపెట్టాలని వేడుకుంది. ఇక పోలీసులు తాము గుర్తించిన వారిని ఒక్కొక్కరిగా అదుపులోకి తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టినందుకు గానూ వైసీపీ ఎంపీ అవినాష్ పీఏ రాఘవ ఇంటికి చేరుకున్నారు. దీంతో అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది. కానీ రాఘవ ఇంట్లో నుండి పరార్ అయినట్టు తెలుస్తోంది.
పోలీసులు రాఘవ తండ్రిని ప్రశ్నించగా ఇంట్లో లేడని వచ్చిన తరవాత సమాచారం ఇస్తామని సమాధానం ఇచ్చారు. ఆయన లాయర్ పోలీసులకు పరిస్థితి వివరించడంతో ఇంటి నుండి వెళ్లిపోయారు. రాఘవ వైఎస్ భారతి, వర్ర రవీంద్రలతో చాటింగ్ చేసినట్టు పోలీసులు గుర్తించినట్టు తెలుస్తోంది. రాఘవను అదుపులోకి తీసుకుంటే ఈ విషయంపై కూడా విచారణ జరగనుంది. మరోవైపు పోలీసుల అదుపులో ఉన్న బోరుగడ్డ అనిల్ ను కర్నూలుకు తీసుకువచ్చారు. పీటీ వారెంట్ పై కర్నూలు తీసుకురాగా.. చంద్రబాబు, లోకేష్ లకు వ్యతిరేకంగా పోస్టులు పెట్టినందుకు కేసులు నమొదు చేశారు.