Karnataka Road Accident: కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. గుల్బర్గా జిల్లా కమలాపురం వద్ద కారును బొలేరో వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులంతా హైదరాబాద్‌లోకి యూసుఫ్‌గూడ ప్రాంతానికి చెందినవారు.
కర్ణాటకలోని వివిధ ప్రాంతాలను చూసేందుకు ఓ ఫ్యామిలీ హైదరాబాద్ నుంచి కారులో బయలుదేరింది. గానుగాపూర్ దత్తాత్రేయ క్షేత్రానికి వీరు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
యూసఫ్‌గూడకు చెందిన భార్గవ కృష్ణ, ఆయన భార్య సంగీత, కొడుకు ఉత్తమ్ రాఘవ, కారు డ్రైవర్ రాఘవేంద్రగౌడ్ ఉన్నారు. వీరంతా హైదరాబాద్ నుంచి కర్ణాటకకు వెళ్తున్నారు. డబుల్ రోడ్డు అయినా మధ్యలో డివైడర్లు లేకపోవడంతో అటువైపు నుంచి వేగంగా వస్తున్న బొలేరో వాహనం కారును బలంగా ఢీ కొట్టింది. ఈ ఘటనలో భార్గవ కృష్ణ ఫ్యామిలీ సభ్యులు మృతి చెందారు.
సమాచారం అందుకున్న వెంటనే కమలాపురం పోలీసులు అక్కడికి చేరుకున్నారు. కారు ముందు భాగం నుజ్జునుజ్జు అయ్యింది. వాహనాలు పక్కకు తీసి ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు బొలేరో రాంగ్ రూట్‌లో వచ్చినట్టు నిర్థారించారు.
ALSO READ: 16 ఏళ్ల స్టూడెంట్‌ని కిడ్నాప్ చేసిన మహిళా టీచర్.. లింగమార్పిడి చేసుకొని పెళ్లికోసం..
మరోవైపు యూపీలో ఆగ్రా-లక్నో ఎక్స్‌ప్రెస్ వేపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆగి ఉన్న లారీని బస్సు బలంగా ఢీ కొట్టింది. ఈ ఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న ఐదుగురు ప్రయాణికులు స్పాట్‌లో మృతి చెందారు. గాయపడినవారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు.
కర్ణాటక రాష్ట్రం గుల్బర్గా జిల్లా కమలాపూర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం
కారును ఢీకొన్న బొలెరో వాహనం.. నలుగురు మృతి
మృతులు హైదరాబాద్ యూసఫ్‌గూడ వాసులుగా గుర్తింపు
మృతుల వివరాలు: భార్గవ కృష్ణ (55), భార్య సంగీత (45), కుమారుడు ఉత్తమ్ రాఘవ (28), రాఘవేంద్ర గౌడ్(కారు డ్రైవర్)… pic.twitter.com/GUTbeiaiGS
— BIG TV Breaking News (@bigtvtelugu) November 9, 2024