Big Stories

YSRCP: ఆర్కే మంగళం!.. జగన్‌తో ఎంతెంత దూరం!?

jagan rk

YSRCP: రాజకీయాలు ఎప్పుడు ఎలాంటి టర్న్ తీసుకుంటాయో ఊహించడం కష్టం. దగ్గరి వారే దూరం అవ్వొచ్చు. శత్రువులు మిత్రులుగా మారొచ్చు. ఎమ్మెల్యే కోటంరెడ్డి వైసీపీని వీడుతారని ఎవరైనా అనుకున్నారా? వల్లభనేని వంశీ టీడీపీకి హ్యాండివ్వడమూ అంతే. అదే రాజకీయమంటే.

- Advertisement -

లేటెస్ట్‌గా పార్టీ ఎమ్మెల్యేలతో కీలక సమావేశం నిర్వహించారు జగన్. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వ్యూహాలు వివరించారు. ఇంతటి కీలక సమావేశానికి కొందరు హాజరు కాకపోవడం సంచలనంగా మారింది. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సైతం ఆ మీటింగ్‌కు రాకపోవడం కలకలం రేపింది. జగన్ ఇంటికి సమీపంలోనే ఆర్కే ఇల్లు ఉంటుంది. అయినా రాలేదు. కనీసం సమాచారం కూడా ఇవ్వలేదని టాక్. ఎందుకు? ఆళ్ల ఎందుకు రాలేదు?

- Advertisement -

ఆళ్ల రామకృష్ణరెడ్డి. మామూలోడు కాదు. మంగళగిరిలో నారా లోకేశ్‌నే ఓడించిన మొనగాడు. అయితేనేం? ఆయనకు మంత్రి పదవి ఇవ్వలేదు. కేబినెట్ పునర్‌వ్యవస్థీకరణలోనూ ఛాన్స్ దక్కలేదు. అందుకే, ఆయన బాగా హర్ట్ అయ్యారని అంటున్నారు. అలాగని ఆర్కే వైసీపీని వీడే నేత కాదు. టీడీపీలో చేరలేరు. ఆయన సోదరుడు అయోధ్య రామిరెడ్డి వైసీపీ తరఫున ఎంపీగా ఉన్నారు. వారి కుటుంబం జగన్ వెంటే ఉంటుంది. అయినా… తనకు తగినంత ప్రాధాన్యం దక్కలేదనే అక్కస్సు ఆర్కేలో బాగానే ఉందని తెలుస్తోంది.

రాజధానిని మూడు ముక్కలు చేసి.. అమరావతిని అటకెక్కించడంతో ఈసారి వైసీపీ మంగళగిరిలో గెలవడం డౌటే అంటున్నారు. ఆర్కే ఓటమి పక్కా అంటూ ప్రచారం జరుగుతోంది. అందుకే, ఈసారి ఎన్నికలకు దూరంగా ఉండాలని భావిస్తున్నారట ఆళ్ల. తాజాగా ఆయన సైతం అలాంటి వ్యాఖ్యలే చేశారు. అవసరమైతే తాను రాజకీయాలు మానేసి.. వ్యవసాయం చేసుకుంటానే కానీ.. వైసీపీని వీడనని తేల్చి చెప్పారు. మరి, జగన్‌తో మీటింగ్‌కు ఎందుకు అటెండ్ కాలేదని ప్రశ్నిస్తే.. పంటి సర్జరీ, ఇంట్లో ఫంక్షన్ అంటూ సాకులు చెప్పారు.

ఆర్కేకు ఈసారి మంగళగిరి నుంచి పోటీ చేసే ఉద్దేశ్యం లేదని తెలుస్తోంది. అలాగని జగన్‌నూ వీడలేరు. అందుకే, ఏకంగా రాజకీయాలకు దూరంగా ఉండాలని భావిస్తున్నట్టు సమాచారం. ఓడిపోవడం కంటే పోటీ చేయకపోవడమే బెటరని అనుకుంటున్నారా? ఈయన వద్దనుకున్నా.. జగన్ ఊరుకుంటారా? ఆర్కే బరిలో నిలవకపోతే జనాలకు రాంగ్ మెసేజ్ వెళ్లదా? పోటీ చేయాల్సిందేనని జగన్ ఆదేశిస్తే.. ఆర్కే చేయకుండా ఉండగలరా? అందుకే, ఎందుకైనా మంచిదని ఇప్పటినుంచే జగన్‌కు, పార్టీకి దూరం జరుగుతున్నారా? అనే చర్చ వినిపిస్తోంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News