Big Stories

Artificial intelligence : క్యాన్సర్ పేషెంట్ల జీవితకాలాన్ని చెప్పే ఏఐ..

Artificial intelligence

Artificial intelligence : ఒకప్పుడు ఒక ఆరోగ్య సమస్య వచ్చిందంటే చాలు.. వారికి అందే చికిత్స ఎంత మెరుగ్గా ఉంటుందో తెలియక ఇబ్బంది పడేవారు. కానీ ఈరోజుల్లో అలా కాదు.. క్యాన్సర్ లాంటి వ్యాధులకు కూడా చికిత్స వచ్చేసింది. అయినా కూడా క్యాన్సర్ వచ్చిన వ్యక్తులకు కూడా ప్రాణహాని తప్పడం లేదు. అడ్వాన్స్ స్టేజ్‌లో ఉన్నవారిని ఏ చికిత్స కాపాడలేకపోతోంది. అందుకే క్యాన్సర్ పేషెంట్ల భవిష్యత్తును చెప్పడం కోసం ఒక కొత్త ఏఐ మోడల్ తయారయ్యింది.

- Advertisement -

యూనివర్సిటీ ఆఫ్ బ్రిటీష్ కొలంబియా, బీసీ క్యాన్సర్ శాస్త్రవేత్తలు కలిసి ఒక కొత్త ఏఐ మోడల్‌ను క్రియేట్ చేశారు. ఇది అడ్వాన్స్ స్టేజ్ క్యాన్సర్‌తో బాధపడుతున్న పేషెంట్లు ఎంతకాలం బ్రతకగలరు అనే విషయాన్ని సరిగ్గా చెప్పగలుగుతుంది. ఇప్పటివరకు క్యాన్సర్ పేషెంట్ల జీవితకాలాన్ని చెప్పడానికి ఎన్నో పద్ధతులు ఆచరణలోకి వచ్చాయి. కానీ వాటన్నింటికంటే ఇది మెరుగ్గా పనిచేస్తుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు.

- Advertisement -

నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ (ఎన్‌ఎల్పీ) ద్వారా ఈ ఏఐ మోడల్ పనిచేస్తుంది. ముందుగా ఇది క్యాన్సర్ పేషెంట్లపై డాక్టర్లు చేసిన స్టడీని పరీక్షిస్తుంది. ఆ తర్వాత పేషెంట్ల కన్సల్టేషన్ సమయంలో డాక్టర్లు తీసుకున్న నోట్స్‌ను స్టడీ చేస్తుంది. ప్రతీ పేషెంట్‌ను విడివిడిగా స్టడీ చేస్తూ వారి జీవితకాలం ఎంతవరకు ఉండవచ్చని చెప్తుంది ఈ ఏఐ మోడల్. ఇప్పటివరకు ఈ ఏఐ మోడల్‌తో చేసిన పరీక్షలు 80 శాతం కరెక్ట్‌గా ఉన్నాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు.

క్యాన్సర్ పేషెంట్ల జీవితకాలం ఎంతవరకు ఉంటుందో తెలిస్తే.. వారికి అందించే చికిత్స అంత మెరుగ్గా ఉండగలుగుతుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. దాన్ని బట్టి వారి చికిత్సకు సంబంధించిన కోర్సును కూడా మార్చవచ్చా లేదా అని వైద్యులు ఆలోచించవచ్చు. ఒకవేళ పేషెంట్ జీవితకాలాన్ని ముందే తెలుసుకోగలిగితే వారికి చూపించే కేర్‌పై కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టవచ్చని అంటున్నారు శాస్త్రవేత్తలు. క్యాన్సర్‌ను జయించే వారు ఉన్నట్టే క్యాన్సర్ వల్ల మరణిస్తున్న వారు కూడా ఉంటున్నారని, అలాంటి వారికి ఈ ఏఐ మోడల్ సహాయపడుతుందని వారు భావిస్తున్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News