BigTV English

Simhachalam Tragedy: ఆ తప్పు వల్లే ప్రమాదం.. సింహాచలం ఘటనపై రాజకీయ కల్లోలం

Simhachalam Tragedy: ఆ తప్పు వల్లే ప్రమాదం.. సింహాచలం ఘటనపై రాజకీయ కల్లోలం

Simhachalam Tragedy: సింహాచలంలో జరిగిన ప్రమాదం.. ముమ్మాటికీ ప్రభుత్వ తప్పిదమే అన్నారు గుడివాడ అమర్నాథ్.. తిరుపతిలో వైకుంఠ ఏకాదశి ఎంత విశిష్టత ఉంటుందో.. సింహాచలంలో చందనోత్సవానికి అంతే విశిష్టత ఉంటుంది. ప్రభుత్వ నిర్లక్ష్యం, చేతకాని తనంతోనే ఈ ప్రమాదం జరిగిందని ఆరోపించారు. మూడు, నాలుగు రోజుల క్రితం గోడ నిర్మించారు కానీ.. ఎటువంటి జాగ్రత్తలు తీసుకోలేదు.. గోడ ప్లెక్సీ ఊగినట్లు ఊగిందని సాక్షులు చెప్పారన్నారు. ఒకే కుటుంబంలో నలుగురు చనిపోయారు. మృతిచెందిన వారి కుటుంబానికి కోటి రూపాయలు పరిహారం, అలాగే ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి డిమాండ్ చేశారు. కొండపై చాలా గోడలు ఉన్నాయి.. అవి ఎందుకు పడిపోలేదు.. నాణ్యాత లోపించింది కాబట్టే గోడ పడిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సంఘటన తెలిసిన వెంటనే వైఎస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. కేజీహెచ్‌లో బాధిత కుటుంబాలను పరామర్శిస్తారని ఆయన తెలిపారు.


ఇదే ఘటనపై హోంమంత్రి అనిత కూడా స్పందించారు. మృతి చెందిన కుటుంబ సభ్యులకు ఒక్కొక్కరికి రూ.25 లక్షలు నష్టపరిహారం అందిస్తాం అన్నారు. వారి కుటుంబ సభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తాం అని తెలిపారు. వారికి వెంటనే నష్టపరిహారం కూడా అందిస్తాం అని ఈ సందర్భంగా తెలియజేశారు. ఛాన్స్ దొరికింది కదా అని.. ఈ ఘటనపై రాజకీయం చేయొద్దని ఆమె హెచ్చరించారు. చనిపోయిన వారి కుటుంబ సభ్యులకు ప్రభుత్వం అండగా ఉంటుంది. మృతిచెందిన కుటుంబ సభ్యులకు ప్రభుత్వం అండగా ఉంటుందని అనిత వెల్లడించారు. జరిగిన ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు 3 మెన్ కమిటీ వేశారు. నివేదిక వచ్చేసరికి రెండు రోజులు సమయం పడుతుంది. వచ్చిన తరవాత నిర్ణయం తీసుకుంటాం అన్నారు. ఎవరైనా తప్పు చేసినా, అధికారులపై క్రిమినల్ చర్యలు తీసుకుంటాం అని హెచ్చరించారు. చనిపోయిన వారు ఏ పార్టీ అయినా నష్టపరిహారం అందిస్తాం. చావులకు పార్టీలు ముడిపెట్టొద్దని ఆమె అన్నారు.

కాగా.. స్వామివారి దర్శనానికి వచ్చే భక్తుల కోసం మెట్ల మార్గంలో రిటైనింగ్ వాల్ నిర్మించారు. చందనోత్సవం కావడంతో భక్తుల కోసం ఓ భారీ టెంట్‌ను కూడా ఏర్పాటు చేశారు. గాలివాన సమయంలో టెంట్ కోసం ఏర్పాటు చేసిన స్తంభాలు కదిలిపోయి.. రిటైనింగ్ వాల్‌పై పడిపోయాయి. వర్షం కారణంగా ఆ గోడ అప్పటికే పూర్తిగా నానిపోయి ఉండటం.. అదే సమయంలో స్తంభాలు పడటంతో గోడ కూలింది. పక్కనే ఉన్న భక్తులపై పడటంతో.. కొందరు అక్కడికక్కడే మృతి చెందారు.


సింహాచలం చందనోత్సవంలో అపశృతి చోటు చేసుకుంది. ఆలయం లోపలి గోడ కూలి ఏడుగురు భక్తులు మరణించారు. భారీ వర్షం, తీవ్రంగా వీచిన గాలుల వల్ల అప్పుడే నిర్మించిన గోడ కూలి భక్తులపై పడింది. ఈ ఘటన ఓ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఈ దుర్ఘటనలో చనిపోయారు. స్వామివారి నిజరూపాన్ని దర్శించుకునేందుకు భక్తులు భారీ ఎత్తున కొండకు పోటెత్తారు. కొందరు రాత్రే వచ్చి ఆలయంలో నిద్రించారు. ఈ సమయంలో అర్ధరాత్రి కురిసిన వర్షానికి గోడ కూలి పక్కనే నిద్రిస్తున్న భక్తులపై పడింది. తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

Also Read: మేము ఏ పాపం చేశాం దేవుడా.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి

స్వామివారి దర్శనానికి వచ్చే భక్తుల కోసం మెట్ల మార్గంలో రిటైనింగ్ వాల్ నిర్మించారు. చందనోత్సవం కావడంతో భక్తుల కోసం ఓ భారీ టెంట్‌ను కూడా ఏర్పాటు చేశారు. గాలివాన సమయంలో టెంట్ కోసం ఏర్పాటు చేసిన స్తంభాలు కదిలిపోయి.. రిటైనింగ్ వాల్‌పై పడిపోయాయి. వర్షం కారణంగా ఆ గోడ అప్పటికే పూర్తిగా నానిపోయి ఉండటం.. అదే సమయంలో స్తంభాలు పడటంతో గోడ కూలింది. పక్కనే ఉన్న భక్తులపై పడటంతో.. కొందరు అక్కడికక్కడే మృతి చెందారు.

 

 

Related News

Araku Coffee: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. అరకులో ఇకపై అందరూ లక్షాధికారులే!

Pawan Kalyan project: పవన్ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం.. కోట్లల్లో ఖర్చు.. ఎందుకంటే?

Railways: రైల్వే ప్రాజెక్టులపై దృష్టి.. అవన్నీ జరిగితే ఏపీకి తిరుగుండదు

Pulivendula Politics: పులివెందుల రాజకీయాలు.. 30 ఏళ్లలో రెండోసారి, ఓటర్లు ఫుల్‌ఖుషీ

Pawan Kalyan: రూటు మార్చిన పవన్.. నిన్న మామిడి.. నేడు చీరలు, రేపు?

AP Free Bus Scheme: ఏపీలో ఫ్రీ బస్ స్కీమ్.. ఆ బస్సు లెక్కితే ఉచిత ప్రయాణం ఉండదు

Big Stories

×