TG SSC Result 2025: తెలంగాణ విద్యార్థులు ఎప్పుడెప్పుడాని ఎదురుచూస్తున్న పదో తరగతి ఫలితాలు వచ్చేశాయి. రవీంద్రభారతిలో బుధవారం మధ్యాహ్నం రెండున్నర గంటలకు సీఎం రేవంత్‌రెడ్డి విడుదల చేశారు. ఈ ఏడాది 92.78 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించింది. గతేడాది కంటే 1.47 శాతం అధికం అన్నమాట.
గురుకులాల్లో 98.7 శాతం మంది ఉత్తీర్ణత సాధించగా, ఆశ్రమ పాఠశాలల్లో 95శాతంగా ఉంది. ప్రైవేటు పాఠశాలలు 94.21 శాతం ఉత్తీర్ణత సాధించింది. గతేడాది కంటే ఇది నాలుగు శాతం ఎక్కువ. ఈసారి గ్రేడింగ్‌తోపాటు విద్యార్థుల మార్కులను విడుదల చేసింది ప్రభుత్వం.
ఈ ఫలితాల్లో బాలికలదే హవా కొనసాగింది. 99.29 శాతంతో మహబూబాబాద్ జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. 99.09 శాతంతో సంగారెడ్డి జిల్లా రెండో స్థానం సాధించింది. 73.97 శాతంతో వికారాబాద్ జిల్లా చివరి స్థానంతో సరిపెట్టుకుంది. జూన్ 3 నుంచి 13 వరకు పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయి. ఈ పరీక్షల కోసం దరఖాస్తుల స్వీకరణ మే 17 వరకు ఉండనుంది.
విద్యార్థుల మోమోలలో సబ్జెక్టుల వారీగా ఉన్నాయి. గ్రేడ్‌ల పలు ఎంట్రన్స్ పరీక్షలకు వెయిటేజికి ఇబ్బందిగా మారకుండా మళ్లీ మార్కుల పద్ధతి తీసుకొచ్చింది. ఈ ఏడాది మార్చి 21 నుంచి ఏప్రిల్ 4 వరకు పదో తరగతి పరీక్షలు జరిగాయి. దాదాపు 5 లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరయ్యారు. ఫలితాలను విద్యార్థులు ఈ కింది వెబ్ పోర్టల్‌లో చూడవచ్చు. results.bse.telangana.gov.in, bse.telangana.gov.in
ALSO READ: తెలంగాణ మహిళలకు మరో పథకం, ఆలస్యం చేయొద్దు, వెంటనే అప్లై చేయండి
మార్చి 21 నుంచి ఏప్రిల్ 4 వరకు పరీక్షలు జరిగాయి. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 5,09,403 మంది విద్యార్థులు హాజరయ్యారు. అందులో 2,58,895 మంది బాలురు కాగా, 2,50,508 మంది బాలికలు ఉన్నారు. 2,650 కేంద్రాల్లో ఈ పరీక్షలు జరిగాయి. మొత్తం ఆరు సబ్జెక్టులు ఉండనున్నాయి. అందులో రాత పరీక్షకు 80 మార్కులు, ఇంటర్నల్ కు 20 మార్కులు ఓవరాల్ గా సబ్జెక్టుకు 100 మార్కులన్న మాట.
హిందీ సబ్జెక్టుకు రాత పరీక్షలో 16 కాగా, పాస్ మార్కులు 20గా ఉంది. సబ్జెక్టులకు పాస్ మార్కులు 35. ఈ ఏడాది టెన్త్‌లో ఇంటర్నల్స్ రద్దు చేయాలని ఆలోచన చేసింది. ప్రభుత్వం నిర్ణయం ఆలస్యం కావడంతో కంటిన్యూ చేశారు. వచ్చే ఏడాది నుంచి ఇంటర్నల్స్ ఉండవన్నది అధికారుల మాట.